Reading Time: < 1 min

Ka Movie Audio Rights Bagged By Saregama Music – Tel

హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ క సినిమా మ్యూజిక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ ఆడియో లేబుల్ సారెగమ

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా క. రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమా టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌రూపొందిస్తున్నారు. క సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో లేబుల్ సారెగమ సొంతం చేసుకుంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న క సినిమా ఆడియో మ్యూజిక్ ఫీస్ట్ లా ఉండబోతోంది.

క సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో క సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. కిరణ్ అబ్బవరం కొంత విరామం తర్వాత చేస్తున్న క సినిమా అనౌన్స్ మెంట్ నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది.

నటీనటులు :

కిరణ్ అబ్బవరం

టెక్నికల్ టీమ్ :

సినిమాటోగ్రఫీ విశ్వాస్ డానియేల్
మ్యూజిక్ సామ్ సీఎస్
బ్యానర్ శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి
దర్శకత్వం సుజీత్, సందీప్