Reading Time: 3 mins

Bharateeyudu 2 Movie Review – Tel

 

Emotional Engagement Emoji

 

 

యూనివర్సల్ స్టార్ ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996 లో విడుదలై సంచలనం సృష్టించిన బ్లాక్ బస్టర్ చిత్రం  భారతీయుడు  లోని సేనాపతి పాత్రని కొనసాగింపుగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భారతీయుడు-2 ఈ రోజే విడుదల అయింది.

సినిమా గురించి వివరాల్లోకి వెళ్తే…

కథ :

చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్) మరియు అతని స్నేహితులు సమాజంలో ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై జరుగుతున్న వివిధ రకాల అన్యాయాలను, అకృత్యాలను వాటిని కాపాడుతున్న ప్రభుత్వ వ్యవస్థలపై, అన్యాయాల పై సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఆయినా ఎటువంటి మార్పు రాకపోవడంతో విసుగుచెంది వుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల నేపథ్యంలో, ఈ వ్యవస్థని మార్చాలంటే సేనాపతి భారతీయుడు మళ్లీ రావాలంటూ #ComeBackIndian అని హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడతారు, అది దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ విషయం సేనాపతి వరకూ రీచ్ అవుతుంది. ఎక్కడో విదేశంలో చిన్న ఆశ్రమంలో కొంతమంది విద్యార్థులకు మర్మకళ నేర్పుతూ కనిపిస్తాడు. యువత డిమాండ్ మేరకు సేనాపతి అలియాస్ భారతీయుడు (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వచ్చి, భారతదేశ ఆర్ధిక మూలాల మీద కార్పొరేట్ ముసుగులో ఆర్ధిక అస్థిరతకి కారణమై, వేలకోట్లు అప్పులు చేసి బ్యాంకులకు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్తలను చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని భారతీయుడు చంపేస్తాడు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా సేనాపతి లైవ్ లో యువతకు ఈ దేశం శుభ్రంగా వుండాలంటే ముందు మన ఇల్లు శుభ్రంగా వుంచుకోవాలి, అంటే, ఈ అవనీతి మూలాలని రూపుమాపే ఈ కార్యక్రమాన్ని మన ఇంటినుండే మొదలుపెట్టాలి  అని యువకులను మోటివేట్ చేస్తాడు. భారతీయుడు మాటలు ప్రభావం కారణంగా చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్) జీవితంలో చాలా విషాదం జరుగుతుంది. దానికి కారణం భారతీయుడే అంటూ అందరూ నిందిస్తారు. అసలు ఏం జరిగింది ?, ఎందుకు సామాన్య జనం కూడా భారతీయుడు పై కోపం పెంచుకున్నారు ?, ఇంతకీ, భారతీయుడు టార్గెట్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

స‌మ‌కాలీన‌ స‌మాజంలో పేరుకుపోయిన అవినీతి, అన్యాయాల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా ఎస్టాబ్లిష్ చేస్తూ సాగిన ఈ సినిమాలో భారీ తారాగణంతో పాటు అద్భుతమైన విజువల్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. సేనాప‌తిగా క‌మ‌ల్‌ హాస‌న్ ఎప్పటిలాగే త‌న యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. కమ‌ల్‌ లుక్‌ అండ్ మ్యాన‌రిజ‌మ్స్‌తో పాటు ఆయ‌న‌పై వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే బ్రేకింగ్ డాగ్స్ అంటూ సాగిన యానిమేషన్ విజువల్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి విజువ‌ల్‌ గా ఈ చిత్రం చాలా గ్రాండియ‌ర్‌గా ఉంది.

చిత్ర అరవిందన్‌ పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడు. పైగా సిద్దార్థ్ కి స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువగానే ఉంది. సకలకళ వల్లవన్ సర్గుణ పాండియన్‌గా SJ సూర్య తన పాత్రకు ప్రాణం పోశారు. సిబిఐ ప్రమోద్‌గా బాబీ సింహా ఆకట్టుకున్నాడు. దిశా పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా మెప్పించింది. నటి ప్రియా భవానీ శంకర్ తన పాత్రలో మెరిశారు. మరో కీలక పాత్రలో సముద్రఖని కూడా చాలా బాగా నటించాడు. అలాగే, వివేక్, గుల్షన్ గ్రోవర్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఇక దేశంలోని అవినీతి రాజకీయ నాయకులను, అలాగే అధికారుల అక్రమాలను బహిర్గతం చేస్తూ సాగే కార్టూన్ ట్రాక్ సినిమాలో హైలైట్ గా ఉంది. మొత్తానికి భారీ విజువల్స్ తో పాటు గుడ్ ఎమోషన్స్ కూడా బాగా చూపించారు. ముఖ్యంగా సమాజంలోని లోటుపాట్లును దర్శకుడు శంకర్ చాలా బాగా చూపించారు. చివర్లో మూడో పార్ట్ కి సంబంధించి రివీల్ చేసిన షాట్స్ కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధ స్వాతంత్ర్య సమరయోధుడి కథ గురించి ఆల్ రెడీ భారతీయుడు చిత్రంలోనే చాలా బాగా చూపించారు. దీంతో ఈ సీక్వెల్ లో ప్లాట్ పరంగా, పాత్రల పరంగా ఫ్రెష్ నెస్ మిస్ అయ్యింది. సమకాలీన సంఘటనల ఆధారంగా సీన్స్ రాసుకున్నప్పటికీ, వాటిలో ఎలాంటి కొత్తదనం లేదు. దీంతో స్క్రీన్ ప్లే చాలా రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అదే విధంగా కొన్ని సన్నివేశాలు బోర్ గా సాగాయి.

పైగా దేశంలోని అవినీతి రాజకీయ నాయకులను బహిర్గతం చేయడానికి చాలా సీన్స్ ను ఎస్టాబ్లిష్ చేశారు. ఆ అవినీతి గురించి అవగాహన ఉన్నదే కదా. ఆ అవినీతి పై భారతీయుడు ఏం చేస్తాడు అనేదే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ, ఆ కోణంలో ఈ సినిమా ఎక్కువ సేపు సాగకపోవడం కొంత నిరాశను కలిగిస్తోంది. పైగా క‌మ‌ల్‌ హాస‌న్‌ తో పాటు ఈ మూవీలో సిద్ధార్థ్ క్యారెక్ట‌ర్ కి కూడా లెంగ్త్ ఎక్కువ‌గా ఉండటం ఫ్యాన్స్ కి రుచించదు. అనిరుధ్ మ్యూజిక్ కూడా గొప్పగా సాగలేదు. మొత్తానికి ఈ సినిమా కొన్నిచోట్ల బోరింగ్ ప్లేతో, అవుట్‌ డేటెడ్ సీన్స్ తో సాగింది .

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ కాలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు ఎస్. శంకర్ దర్శకత్వ పరంగా మాత్రం చాలా బాగా ఆకట్టుకున్నారు. రచన (స్క్రీన్ ప్లే – మాటలు) పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయారు.

తీర్పు :

భారీ అంచనాల మధ్యన వచ్చిన ఈ భారతీయుడు-2 అంతగా మెప్పించలేకపోయింది . ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఎంచుకున్న పాయింట్ బాగున్నా , అది ప్రీచింగ్ లా వుండటం సినిమాకి ప్రధాన లోపం. అదేవిధంగా శంకర్ మార్క్ విజువల్స్, కమల్ హాసన్ నటన సినిమాకి కొంతమేరకు పర్వాలేదు అనిపించున్నా, బలవంతపు స్క్రీన్ ప్లే , మనసుకు హత్తుకోని ఎమోషనల్ సీన్స్ ఇలా ప్రేక్షకులకి పరీక్ష పెడతాయి. కనీసం ఊరటనిచ్చే పాటలు కానీ లేకపోవడం మరింత అసహనానికి గురిచేస్తాయి. అవుట్‌ డేటెడ్ సీన్స్ అండ్ పెద్దగా కథ లేకపోవడం, మరియు కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. కమల్ హాసన్ లుక్స్ (గెటప్స్) కూడా అంతగా మెప్పించవు.

నటీనటులు:

కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని తదితరులు.1

సాంకేతికవర్గం
:

సినిమా టైటిల్: భారతీయుడు 2
బ్యానర్లు: రెడ్‌గెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్
విడుదల తేదీ : 12-07-2024
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకుడు : ఎస్.శంకర్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
నిర్మాతలు: సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్
నిజాం డిస్ట్రిబ్యూటర్: గ్లోబల్ సినిమాస్ LLP

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్