Purushotthamudu Movie Pre Release Event Held-Tel
పురుషోత్తముడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పురుషోత్తముడు”. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. “ఆకతాయి”, “హమ్ తుమ్” చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు “పురుషోత్తముడు” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ – “పురుషోత్తముడు” సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. చాలా మంచి రోల్. మా డైరెక్టర్ రామ్ భీమన నాకు కొడుకు లాంటి వాడు. మా అబ్బాయి కూడా డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. రామ్ భీమనకు మన పురాణాలు, ఇతిహాసల గురించి బాగా తెలుసు. ఆ నేపథ్యంలో అందమైన పాత్రలు, డైలాగ్స్ రాశారు. ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ, మురళీ శర్మ.. మేమంతా సంతోషంగా చేసిన సినిమా ఇది. మా ప్రొడ్యూసర్స్ డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ తమ భుజాల మీద వేసుకుని ఈ సినిమాను చేశారు. “పురుషోత్తముడు” సినిమా మంచి సక్సెస్ కావాలి. ఈ నిర్మాతలు మళ్లీ మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ – పురుషోత్తముడు సినిమాలో నటించడాన్ని మేమంతా ఎంజాయ్ చేశాం. మా ప్రొడ్యూసర్స్ డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ఎప్పుడూ సెట్ లోనే ఉండేవారు. సినిమా మీద ఫ్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. మొదటి సినిమాకే డైరెక్షన్ చేసేంత తెలుసుకున్నారు. మా డైరెక్టర్ రామ్ భీమన ముందు నుంచీ తెలుసు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం గారు ఇలా మంచి ప్యాడింగ్ మూవీలో ఉంది. రాజ్ తరుణ్ ఈ ఫంక్షన్ కు రాలేకపోయాడు. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతాడు. మా మీడియా మిత్రులంతా పురషోత్తముడు సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ – ఈ ఫంక్షన్ లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ గురించి. చాలా మంచి సాంగ్స్ ఈ మూవీకి ఆయన ఇచ్చారు. అలాగే డైరెక్టర్ రామ్ భీమనకు ఇది మూడో సినిమా. ఈ థర్డ్ మూవీ ఆయనకు బిగ్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
కొరియోగ్రాఫర్ సుభాష్ మాట్లాడుతూ – పాటలకు కొరియోగ్రాఫ్ చేయడం అంటే కేవలం డ్యాన్సులు కాదు. ఆ కథను మరింత ముందుకు తీసుకెళ్లేలా చేయడం. అలాంటి అవకాశం నాకు ఇచ్చిన దర్శకుడు రామ్ భీమనకు థ్యాంక్స్. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ కు నేనే కొరియోగ్రాఫ్ చేయడం సంతోషంగా ఉంది. అన్నారు.
డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ – పురుషోత్తముడు సినిమా కంటెంట్ చాలా బాగుంది. దర్శకుడు రామ్ భీమనలో చాలా టాలెంట్ ఉంది. నేను కోర్సులు చేసి సినిమాలు చేస్తామని వచ్చిన వారి కంటే ఇలా సహజంగా టాలెంట్ ఉన్నవారి సినిమాలే బాగుంటాయని నమ్ముతాను. ప్రొడ్యూసర్స్ డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్యాషనేట్ గా ఈ మూవీ చేశారు. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
లిరిసిస్ట్స్ పూర్ణాచారి మాట్లాడుతూ- పురుషోత్తముడు సినిమాలో నాకు మంచి సాహిత్యాన్ని అందించే అవకాశం దొరికింది. మంచి సందర్భాలు రెండు సెలెక్ట్ చేసుకుని పాటలు రాశాను. ఆ అవకాశం దర్శకుడు రామ్ భీమన గారు ఇచ్చారు. ఈ సినిమాతో గొప్ప వారు ఎందరితో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అన్నారు.
లిరిసిస్ట్ బాలాజీ మాట్లాడుతూ – పురుషోత్తముడు సినిమాలో రెండు సాంగ్స్ రాశాను. ఆ పాటలు ఎలా ఉండాలో దగ్గరుండి మా డెరెక్టర్ రామ్ భీమన రాయించుకున్నారు. ఆ పాటలు బాగున్నాయంటే క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. అన్నారు.
నటుడు సమీర్ మాట్లాడుతూ – పురుషోత్తముడు సినిమాలో ఒక మంచి రోల్ ఇచ్చారు దర్శకుడు రామ్ భీమన. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. మా ప్రొడ్యూసర్స్ డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ చాలా ప్యాషనేట్ గా సినిమాను నిర్మించారు. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ కు సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ హాసిని సుధీర్ మాట్లాడుతూ – నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను. అక్కడ తెలుగు సినిమాలు చూస్తూ తెలుగు నేర్చుకున్నాను. నన్ను తెలుగు అమ్మాయిలా మీరంతా ఆదరిస్తున్నారు. నా క్యారెక్టర్ హాసినీని క్రియేట్ చేసిన మా డైరెక్టర్ రామ్ గారికి థ్యాంక్స్. అలాగే ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రమేష్ తేజావత్ గారికి థ్యాంక్స్. సకుటుంబంగా మీరంతా వచ్చి చూసి ఎంజాయ్ చేసే సినిమా పురుషోత్తముడు. ఈ నెల 26న థియేటర్స్ లో చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ – మేము సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చాం. తొలి ప్రయత్నంగా పురుషోత్తముడు సినిమాను నిర్మించాం. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చూసే ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేశామని గర్వంగా చెప్పగలను. మా మూవీలో రాజ్ తరుణ్ 100కి 101 పర్సెంట్ తన ఎఫర్ట్స్ పెట్టారు. అలాగే హీరోయిన్ మాల్వీ 104 ఫీవర్ లో కూడా షూటింగ్ చేసింది. మీరు ఆమె ఫీవర్ తో ఉండి చేసిన సీన్స్ లేకుండా చేసిన సీన్స్ లో తేడా చెప్పలేరు. చెబితే గిఫ్ట్ ఇస్తాం. అంత బాగా నటించింది. మా డైరెక్టర్ రామ్ భీమన డెడికేషన్ ఉన్న డైరెక్టర్. ప్రొడ్యూసర్స్ యాంగిల్ లో ఆలోచించే డైరెక్టర్. ఆయన ఆయన సెలెక్ట్ చేసుకున్న వండర్ పుల్ టీమ్ పురుషోత్తముడు మూవీని మీ అందరికీ నచ్చేలా అందంగా రూపొందించారు. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.
డైరెక్టర్ రామ్ భీమన మాట్లాడుతూ – నేను డైరెక్టర్ గా ఆకతాయి, హమ్ తుమ్ అనే రెండు సినిమాలు చేశాను. ఆ తర్వాత ఆరేళ్లు గ్యాప్ వచ్చింది. చదువుకున్న వారికి ఉద్యోగాలు ఈ టైమ్ కు వస్తాయని ఆశ పెట్టుకోవచ్చు. కానీ డైరెక్టర్ కు నెక్ట్ సినిమా ఎప్పుడనేది చెప్పలేం. ఈ టైమ్ లో నాకు మా ఫ్యామిలీ అండగా నిలబడింది. నాకు తెలిసిన వాళ్లు రామ్ మంచి టాలెంటెడ్ అతనికి సినిమాలు రావట్లేదు అనేవారు. అలాంటి టైమ్ లో పురుషోత్తముడు మూవీకి డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. మా ప్రొడ్యూసర్స్ నాతో ఒకటే మాట చెప్పారు రామాయణం అంత రమణీయంగా భారతం అంత భారీగా మన సినిమా ఉండాలని అన్నారు. అలాగే నేను ఈ పురుషోత్తముడు సినిమా రూపొందించాను. ఈ క్రమంలో మా ప్రొడ్యూసర్స్ డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ అందించిన సపోర్ట్ మర్చిపోలేను. నా గత రెండు సినిమాలు అంతగా ఆదరణ పొందలేదు. ఈ థర్డ్ మూవీ ఖచ్చితంగా బిగ్ మూవీ చేయాలనే పట్దుదలతో వర్క్ చేశాను. మా హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం గారు, రాజా రవీంద్ర గారు..ఇలా ప్రతి ఒక్కరూ మా టెక్నికల్ టీమ్ అంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. వారందిరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మీ ఫ్యామిలీలో చిన్నా పెద్దా అందరూ కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చూసే కలర్ ఫుల్ మూవీ పురుషోత్తముడు. మా మూవీలో ఎలాంటి అసభ్యమైన సన్నివేశాలు, తాగుడు, సిగరెట్ స్మోకింగ్, డ్రగ్స్ , బ్లడ్ షెడ్ ఏదీ ఉండదు. మీడియా మిత్రులే మాకు సారథులై ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా. అన్నారు.