Gally Gang Stars Movie Release on 26th July-Tel
గల్లీ గ్యాంగ్ స్టార్స్ సినిమా జూలై 26 రిలీజ్
ఎన్నో అడ్డంకులను ఎదురుకుని జూలై 26న రిలీజ్ కానున్న ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’ సినిమా
సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’. ఈ సినిమాని డా. ఆరవేటి యశోవర్ధాన్ గారు ‘ఏ బి డి ప్రొడక్షన్స్’ బ్యానర్ లో నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 26 నా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ధర్మ మాట్లాడుతూ “గల్లీ గ్యాంగ్ స్టార్స్ అనేది ఒక సినిమా కాదు నిజ జీవితంలో ఎందరో అనాధలు ఎదురుకునే రోజువారి సంఘటనలు. అనాధల బాధ్యత సమాజం తీసుకోకపోతే ఆ సమాజం ఎన్ని దారుణాలు ఎదురుకోవలసి వస్తుందో వాస్తవికంగా తెరక్కించటం జరిగింది. సినిమా షూటింగ్ అంతా నెల్లూరులో 76 రోజుల పాటు షూటింగ్ చెయ్యటం జరిగింది. ఎన్నో సార్లు అనుకున్న బడ్జెట్ దాటిపోయి షూటింగ్ ఆగిపోతుంది అనుకున్న ప్రతిసారి ప్రొడ్యూసర్ యశోవర్ధాన్ గారు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యటం వల్లనే ఈ సినిమా ఈరోజు రిలీజ్ కాబోతుంది. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఎనలేని మక్కువ కలిగిన యశోవర్ధాన్ గారు సినిమా నిర్మాణం వైపు అడుగులు వేసి ‘ఏ బి డి ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ ని నిర్మించి టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తూ వరసగా మూడు సినిమాలు నిర్మించారు. దానిలో మొదటి సినిమా ప్రయోగాత్మకమైన చిత్రం “May 16” ఇది ఒక మోనో డ్రామా. ఆ తర్వాత చిత్రం నెల్లూరు గల్లిలో జరిగే మాస్ డ్రామా సినిమా “గల్లీ గ్యాంగ్ స్టార్స్” . ఈ సినిమా ఈ నెల 26 నా రిలీజ్ కానుంది. ఇదే బ్యానర్ లో వస్తున్న మరో సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఒక పక్క డాక్టర్ గా తన బాధ్యతలని ఇంకో పక్క తనకి ఎంతో ఇష్టమైన సినిమాలని రెండిటిని బాలన్స్ చేస్తున్నారు. ABD ప్రొడక్షన్స్‌తో, మరెన్నో గొప్ప చిత్రాలకు తన సహకారం అందించాలని మరియు సినీ చరిత్రలో తనకంటూ కొంత గుర్తింపు సంపాదించాలని ఆశిస్తున్నాను చిన్న సినిమా ఐనప్పటికీ ఇందులో పాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. తప్పక అందరిని అలరిస్తుంది అని నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరు ధియేటర్ కి వచ్చి మా చిన్న సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
నటీనటులు :
సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, Rj బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి
టెక్నీషియన్స్ :
నిర్మాణం : ఏ బి డి ప్రొడక్షన్స్
నిర్మాత: డా. ఆరవేటి యశోవర్ధన్
స్టొరీ మరియు దర్శకత్వం: వెంకటేష్ కొండిపోగు, ధర్మ
డి ఓ పి- ఎడిటర్- రచయత- దర్శకత్వ పర్యవేక్షణ : ధర్మ
సంగీత దర్శకుడు: సత్య, శరత్ రామ్ రవి
పి ఆర్ ఓ: మధు VR