Uruku Patela Movie Teaser Launch Event – Tel
ఉరుకు పటేల మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్
‘ఉరుకు పటేల’ టీజర్‌ను రిలీజ్ చేసిన అడివి శేష్.. ఘనంగా టీజర్ లాంచ్
హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తేజస్ కంచర్ల. తేజస్ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను అడివి శేష్ రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహంచిన కార్యక్రమంలో..
తేజస్ కంచర్ల మాట్లాడుతూ.. ‘మా టీజర్‌ను లాంచ్ చేసిన అడివి శేష్ గారికి థాంక్స్. మంచి కంటెంట్‌ను ఇవ్వాలని కాస్త టైం తీసుకున్నాను. మా నాన్నను చాలా కష్టపెట్టాను. ప్రవీణ్ లక్కరాజు మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఆగస్ట్ నుంచి పాటల్ని రిలీజ్ చేస్తాం. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా దర్శకుడు వివేక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. కాఫీ షాప్, బార్ షాప్ ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని చర్చించుకునే వాళ్లం. కెమెరామెన్ సన్నీ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కుష్బూతో నటించడం ఆనందంగా ఉంది. సెట్స్‌కి కరెక్ట్ టైంకి వచ్చి ఎంతో సహకరించారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు వివేక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘టీజర్ లాంచ్ చేసిన అడివి శేష్ గారికి థాంక్స్. మా సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు. మా నిర్మాతే మా చిత్రానికి ఒరిజినల్ పటేల. ఆ తరువాత హీరో తేజస్. మేం అంతా కలిసి మంచి చిత్రాన్ని తీశాం. నా మొదటి చిత్రానికే మంచి నిర్మాత దొరికారు. ఈ కథను ముందుగా నా ఏడీ మారుతికి చెప్పాను. నాలుగైదేళ్ల నుంచి వాళ్లు నాతోనే ప్రయాణం చేశారు. తేజస్‌కి కథ చెబుతూ డెవలప్ చేశాం. నిర్మాత గారు మాకేం కావాలో.. ఎంత కావాలో అంతా ఇచ్చారు’ అని అన్నారు.
కుష్బూ చౌదరి మాట్లాడుతూ..‘టీజర్లో పూర్తి కథను చెప్పలేదు. సినిమా స్టోరీ చాలా బాగుంటుంది. మీకు వన్ పర్సెంటేజ్ మాత్రమే చూపించాం. బాల భాను గారు విజనరీ ప్రొడ్యూసర్. వివేక్ మంచి కథను రాశారు. షూటింగ్ అప్పుడే అయిపోయిందా? అని అనిపించింది. తేజస్‌తో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
నిర్మాత బాల భాను మాట్లాడుతూ.. ‘ఇది మా మొదటి సినిమా. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ మీద మా అబ్బాయి తేజస్‌తో ఈ చిత్రాన్ని తీస్తున్నాం. వివేక్ మంచి కథను రాశారు. అందరూ ఆదరించండి’ అని అన్నారు.
ఎడిటర్ శశాంక్ మాట్లాడుతూ.. ‘మా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ థాంక్స్. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ మాధవ్ మాట్లాడుతూ.. ‘బాల భాను తన తనయుడికి మంచి సినిమాను ఇవ్వబోతోన్నారు. ఇందులో మంచి పాటలున్నాయి. ప్రవీణ్ లక్కరాజు మంచి సంగీతాన్ని ఇచ్చారు’ అని అన్నారు.
ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ.. ‘యంగ్ టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన బాల భాను గారెకి థాంక్స్. నాకు ఎంతో ఫ్రీడం ఇచ్చిన టీంకు థాంక్స్. చాలా ట్రాక్స్ క్రియేట్ చేశాను. ఆర్ఆర్ బాగా వచ్చింది’ అని అన్నారు.