Reading Time: < 1 min

35 Chinna Katha Kaadu Movie Priya Darshi Poster Launched – Tel

రానా దగ్గుబాటి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ నివేతా థామస్, గౌతమి, భాగ్యరాజ్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ 35-చిన్న కథ కాదు లో లెక్కల మాస్టారు M. చాణక్య వర్మ గా ప్రియదర్శి

నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ లెక్కల మాస్టారు M. చాణక్య వర్మ గా యాక్టర్ ప్రియదర్శిని పరిచయం చేస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. లెక్కలు మాస్టారు గా ప్రియదర్శి క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగా వుంది. లుక్, పెర్ఫార్మన్స్ చాలా నేచురల్ గా వున్నాయి. ఈ గ్లింప్స్ ప్రియదర్శి క్యారెక్టర్, సినిమా క్యూరియాసిటీ ని పెంచింది.

స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది.

పెళ్లి చూపులు, సమ్మోహనం, అంటే సుందరానికీ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఆకాశం నీ హద్దు రా, అంటే సుందరానికి, సర్ఫీరా, కుబేర తదితర చిత్రాలకు గ్రేట్ విజువల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న నికేత్ బొమ్మి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. విజువల్ అప్పీల్‌ ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు నిర్వహిస్తున్నారు. టి సి ప్రసన్న ఎడిటర్.

35-చిన్న కథ కాదు ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

నటీనటులు :

నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: నంద కిషోర్ ఈమాని
నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: నికేత్ బొమ్మి
ఎడిటర్: టి సి ప్రసన్న