Reading Time: < 1 min

Malavika Mohan As Heroine In Sardar 2 Movie

సర్దార్ 2 మూవీ లో హీరోయిన్ గా మాళవిక మోహన్

కార్తి, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ సర్దార్ 2 లో హీరోయిన్ గా మాళవిక మోహన్

హీరో కార్తి సర్దార్ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటివలే సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌లో ప్రారంభమైయింది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది.

తాజాగా మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో బ్యూటీఫుల్ అండ్ ట్యాలెంటెడ్ మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ చిత్రంలో ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కతోంది.

ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సర్దార్ 2 చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్.

విజయ్ వేలుకుట్టి ఎడిటర్. AP పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఎ వెంకటేష్ సహ నిర్మాతగా, ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తారాగణం:

కార్తి, ఎస్ జె సూర్య, మాళవిక మోహన్

సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం: పిఎస్ మిత్రన్
నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్
బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
సంగీతం: యువన్ శంకర్ రాజా
డీవోపీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి