Reading Time: < 1 min

Vishwak Sen Anudeep K V Crazy Combo- TEL

విశ్వక్ సేన్ అనుదీప్ కే వి క్రేజీ కాంబినేషన్ 

 

ఎటువంటి క్యారెక్టర్ నైనా అలవోకగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించే ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ తన అభిమానులకు హుషారు రెట్టింపు చేస్తున్నారు. కాగా తాజాగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో కొత్త సినిమాను అధికారంగా ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై #VS14 ను నిర్మిస్తున్నట్లు  పేర్కొన్నారు. విశ్వక్ ఇప్పటికే మెకానిక్ రాకీ సినిమాలో నటిస్తుండగా, ఇటీవలే SLVC  ప్రొడక్షన్ లో శ్రీధర్ ఘంటా దర్శకుడిగా #VS13 ను సినిమాను ప్రకటించారు. మరోవైపు వినోదాత్మక చిత్రాల తీసే అనుదీప్ మూవీలో విశ్వక్ నటించనుండటంతో వీరిద్దరి కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రజలను విపరీతంగా నవ్వించిన దర్శకుడు కేవీ అనుదీప్. దానికి ముందు ‘పిట్టగోడ’, ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా ‘ప్రిన్స్’ తీశారు. ఆయన సినిమాల్లో కామెడీ మాత్రమే కాదు… టీవీ షోస్, ఇంటర్వ్యూలలో ఆయన చెప్పే సమాధానాలు సైతం విపరీతంగా నవ్వించాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా అనడంతో ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ ని సొంతం చేసుకుంది.