Reading Time: < 1 min

Ravi Teja’s Mr. Bachchan is going to entertain a day early-Tel

ఒక రోజు ముందుగానే అలరించబోతున్న మిస్టర్ బచ్చన్

మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంటే బుధవారం సాయంత్రం హైదరాబాద్ థియేటర్లలో మిస్టర్ బచ్చన్ సందడి చేయనుంది. దీంతో అభిమానులు, సినిమా ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది. ఇది కేవలం మీడియా, సిినిమా ప్రముఖులకు మాత్రమే ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక బెనిఫిట్ షోల విషయంలో కూడా క్లారిటీ రావల్సి ఉంది.

ధమకా చిత్రంతో మాస్ విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తరువాత ఈగల్ చిత్రంతో చతికిలా పడ్డారు. అయినా సరే మళ్లీ ఫినిక్స్ పక్షీలా అంతే రెట్టించిన ఉత్తేజంతో మిస్టర్ బచ్చన్ మూవీతో వస్తున్నాడు. నిజానికి రవితేజకు అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా సాధారణమైన విషయం. ఈసారి మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మిస్టర్ బచ్చన్ చిత్రం వస్తుండడం, ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను రంజింపచేయడంతో ఫిల్మ్‌పై భారీ అంచనాలు పెరిగాయి. అంతే కాకుండా డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం ప్రచార కార్యక్రమాల్లో చాలా జోష్‌తో కనిపిస్తున్నారు. దీనికి కారణం మిస్టర్ బచ్చన్ సబ్జెక్ట్‌పై నమ్మకం అని, కచ్చితంగా అలరిస్తుంది అని స్వయంగా ఆయనే చెబుతున్నారు. అలాగే మీడియా మిత్రులు రేటింగ్స్ ఎలా ఇచ్చినా పర్లేదు, ప్రేక్షకులకు కంటెంట్ నచ్చుతుందని తనదైన స్టైల్‌లో విసుర్లు విసిరారు.

ఇదివరకటిలా ప్రీమియర్ షోలు వేయడం లేదు.ఎందుకంటే విడుదలకు ముందే టాక్ బయటకు వచ్చేస్తుంది. చిత్రం బాగుంటే టికెట్స్ తెగుతాయి. లేదంటే అంతేసంగతి. అయినా సరే కంటెంట్‌పై నమ్మకంతో మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ వేస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరీ మేకర్స్ నమ్మకాన్ని చిత్రం ఏ మేరకు నిలబెడుతుందో.

ఆగస్టు 15 రోజున తెలుగు పరిశ్రమ నుంచి రెండు మాస్ చిత్రాలు పోటీలో ఉన్నాయి. రామ్ పోతినేని హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. వీటితో పాటు తెలుగులో పెద్దగా అంచనాలు లేకపోయినా.. టాక్ బాగా వస్తే తంగలాన్ చిత్రాన్ని సైతం తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇక ఆగస్టు 16న ఆయ్ చిత్రం విడుదలకు సిద్దం అయింది.