Reading Time: < 1 min

Shivanna 131 Movie Launched – Tel

#శివన్న131 మూవీ ప్రారంభం

శివ రాజ్‌కుమార్ కన్నడ- తెలుగు బైలింగ్వల్ #శివన్న131 గ్రాండ్ గా లాంచ్

కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ 131వ మూవీ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైయింది. కార్తీక్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ఈ కన్నడ తెలుగు బైలింగ్వల్ ఫిల్మ్ ని పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో భువనేశ్వరి పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, సుధీర్ పి నిర్మిస్తున్నారు.

శివరాజ్ కుమార్‌ని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసే ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి.

హై-బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎ.జె శెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ దీపు ఎస్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ రవి సంతే హక్లే.

నటీనటులు:

కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: కార్తీక్ అద్వైత్
నిర్మాతలు: SN రెడ్డి, సుధీర్ P
బ్యానర్: భువనేశ్వరి పిక్చర్స్
సంగీతం: సామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ: ఎ.జె. శెట్టి
ఎడిటర్: దీపు ఎస్ కుమార్