Reading Time: 2 mins

Pan India Hero Teja Sajja Birthday Special

బాలనటుడి నుంచి పాన్ ఇండియా హీరో వరకు తేజ సజ్జ ప్రస్థానం

ఇంద్ర సినిమాలో నేనున్నా నాన్నమ్మ అంటూ స్కూల్ బ్యాగ్ విసిరేసి, తొడకొట్టి కుర్చిలో కూర్చొన్న బాల నటుడు తేజ సజ్జ ధైర్యం చూసిన మెగాస్టార్ చిరంజీవి అప్పుడే చెప్పాడట.. ఇతను మంచి నటుడు అవుతాడని. మెగాస్టార్ మాటలు నిజమే అయ్యాయి. బాల నటుడు నుంచి పాన్ ఇండియా స్టార్‌గా తేజ సజ్జ ప్రయాణం నిజంగా అద్భుతం. తేజ 23 ఆగస్టు 1995న హైదరాబాద్‌లో జన్మించారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. చదువుకే రోజుల్లోనే చూడాలని ఉంది సినిమాతో బాల నటుడిగా వెండి తెరపై ఆరంగేట్రం చేశారు. ఆ తరువాత వరుసగా రాజకుమారుడు, కలిసుందాం రా, యువరాజు, బాచి వంటి చిత్రాలలో నటించారు. ఇక ఇంద్ర చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత సాంబ, బాలు సినిమాల్లో నటించిన తేజ సీన్లు ఇప్పటికీ రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఆ తరువాత యువకుడిగా ఓ బేబీ చిత్రంలో రాకీ పాత్రలో నటించారు. సమంత, నాగశౌర్య లాంటి స్టార్ నటులు ఉన్నప్పటికీ తేజ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తరువాత యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో థ్రిల్లర్ చిత్రం జాంబిరెడ్డి చిత్రంలో నటించారు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించంది. డెబ్యూ హీరోగా సైమా అవార్డును సైతం అందుకున్నారు. ఆ తరువాత ఇష్క్, అద్భతం వంటి చిత్రాలలో నటించారు. కానీ ఆ సినిమాలు ఏవి పెద్దగా ఆడలేదు. దీంతో కెరియర్ కాస్త డౌన్ అవుతున్న సమయంలో మళ్లీ తన ఫ్రెండ్ ప్రశాంత్ వర్మతో హనుమాన్ మూవీని ప్రకంటించారు.

దాదాపు రెండు సంవత్సరాలు హనుమాన్ చిత్రం కోసం కష్టపడ్డారు. పాన్ ఇండియా చిత్రంగా 2024 సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. దాంతో ఒకే రాత్రిలో పాన్ ఇండియా హీరోగా అవతరించారు. నిజానికి ఒకే రాత్రిలో స్టార్ కాలేదు. ఆ పేరు రావడం వెనుక ఆయన 20 సంవత్సరాల కృషి ఉంది. హనుమాన్ చిత్రం తెలుగులో కన్నా నార్త్‌లో అద్భుతంగా ఆడింది. తేజకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారాయ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్ సినిమాటిక యూనివర్స్ నుంచి హనుమాన్ 2 ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.

గుడ్ లుకింగ్, మంచి కటౌట్, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తేజ సజ్జ మిరాయ్ చిత్రంతో యాక్షన్ హీర్‌గా మారబోతున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ మాత్రమే కాదు ఫర్మార్మ్‌గా నిరుపించుకున్నారు. ఇకపై వైవిధ్యమైన కథలతో, ప్రయోగాలు సైతం చేయడానికి సిద్దం అవుతున్నారు. బాల నటుడి నుంచి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నటుడు తేజ సజ్జ మరింత ముందుకు సాగాలని కోరుకుందాం. మంచి కథలతో ప్రేక్షకులను, ఆయన అభిమానులకు రంజింప చేయాలని తేజ సజ్జకు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నాము.