Reading Time: 4 mins

Devara Producer Kalyan Ram Movies

దేవర ప్రొడ్యూసర్ కల్యాణ్ రామ్ మూవీస్

అదృష్టాన్ని కాదు కేవలం తమ కష్టాన్ని నమ్ముకున్న హీరోల్లో కల్యాణ్ రామ్ ముందు వరుసలో ఉంటారు. ఆయన రక్తంలోనే నటన ఉన్నప్పటికీ ప్రతీ సినిమాకు తనను తాను విల్లులా మలుచుకుంటాడు. అంతే కాదు బాధ్యతయుతమైన కథలను మాత్రమే ఎంచుకొని నందమూరి అభిమానులకు, సినిమా ప్రేక్షకులకు సంతోషాన్ని పంచుతున్నారు. కల్యాణ్ రామ్ నుంచి ఏదైనా చిత్రం వస్తుందంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అనేలా తన ఫ్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు. హిట్స్, ఫ్లాప్‌లతో ఏలాంటి సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ ఫలితాన్ని పూర్తిగా ప్రేక్షకుల చేతుల్లో పెట్టే నటుడు కల్యాణ్ రామ్. కేవలం లవ్, యాక్షన్, డ్రామా చిత్రాలతో మాత్రమే కాదు పౌరాణిక చిత్రాల్లో సైతం మెప్పించారు.

తెలుగు పరిశ్రమలో ఆయన సినిమాలు, ఆయన కుటుంబం తప్ప వేరే విషయాన్ని పట్టించుకోకుండా అందరిచే ‘ఎంత మంచివాడువురా’ అని పించుకొని తెరపై ‘తొలిచూపులోనే’ ‘అతనకొక్కడే’ ‘అసాధ్యుడు’గా, ‘షేర్‌’గా, ‘జయీభవ’ అంటూ తన ‘ఇజం’తో ఆయన అభిమానులకు ప్రతీ సినిమాతో ‘విజయదశమి’ని అందిస్తూ.. ‘బింబిసార’ లాంటి రౌద్రంతో శత్రువలు గుండెల్లో ‘డెవిల్’ లా ‘కత్తి’ దూస్తూ ‘హరే రామ్’ అంటూ శరణు కోరితే ‘అమిగోస్‌’లా కలిసిపోయి ‘పటాస్‌’లా చిందేస్తూ.. ‘ఎమ్మెల్యే  అయినా ఆయన్ను అభిమానిస్తే ‘నా నువ్వే’ అంటూ ప్రేమగా పిలిచే గొప్ప మనుసున్న వ్యక్తితం కలవాడు కల్యాణ్ రామ్‌. హీరోగా తొలిచూపులోనే చిత్రానికి ముందు బాబాయ్ నందమూరి బాలకృష్ణతో బాల గోపాలుడు చిత్రంలో నటించారు.

తొలిచూపులోనే(2003): తొలిచూపులోనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన హీరో కల్యాణ్ రామ్. నందమూరి కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం నటుడు కావడంతో ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ పెట్టారు. కానీ ఈ చిత్రం పెద్దగా ఆడలేదు.

అభిమన్యు(2003): మల్లి కార్జున మల్లి దర్శకత్వంలో అభిమన్యు అనే చిత్రాన్ని 2003లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాలేజీ కుర్రాడిగా కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నారు. కాలేజీలో సైరాభాను అనే మస్లీం అమ్మాయిని ప్రేమిస్తాడు. తన ప్రేమ కోసం అమ్మాయి ఇంటికి వెళ్తాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది. ముస్లీం అమ్మాయి, హిందూ అబ్బాయికి మధ్య చిగురించిన ప్రేమ చివరి వరకు నిలబడుతుందా అనే కథతో ఈ చిత్రం వచ్చింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు.

అతనొక్కడే(2005): సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతనొక్కడే చిత్రం కల్యాణ్ రామ్‌కు మొదటి సక్సెస్. ఈ చిత్రంతో సురేందర్ రెడ్డి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం ఐఎమ్‌బీడీ రేటింగ్‌లో 6.8 రేటింగ్ సాధించింది.

అసాధ్యుడు(2006): అన్ని కన్నెగంటి దర్శకత్వంలో వచ్చిన అసాధ్యుడు చిత్రం థియేటర్ దగ్గర పెద్దగా ఆదరణ పొందలేదు.

లక్ష్మీకళ్యాణం(2007): తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్‌గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీకల్యాణం. బావ, మరదల్ల మధ్య మంచి లవ్ ట్రాక్‌తో నడిపించిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. కానీ కాజల్‌కు మాత్రం తెలుగులో మంచి భవిష్యత్తును ఇచ్చింది.

విజయదశమి (2007): వి సముద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

హరేరామ్(2008): హర్షవర్దన్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం హరేరామ్. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ అన్న వర్గాల ప్రేక్షకులను అలరించలేదు.

జయీభవ(2009): కల్యాణ్ రామ్ సరసన హన్సిక నటించిన చిత్రం జయీభవ. ఫారెన్‌లో ప్రేమలో పడ్డ హీరోహీరోయిన్లు ఇండియాలో ఫ్యాక్షన్ ఫ్యామిలీకి చెందిన వారు. వారి ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనే కథతో నరేన్ కొండెపాటి తెరకెక్కించిన చిత్రం జయీభవ. ఈ చిత్రం సైతం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

కత్తి(2010): మల్లి కార్జున్ దర్శకత్వంలో చెల్లెలు సెంటిమెంట్‌తో తెరకెక్కిన చిత్రం కత్తి. ఈ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. అప్పటికే కల్యాణ్ రామ్‌కు వరుస పరాజయాలు ఉన్నాయి.

ఓం 3డీ(2013): సునిల్ రెడ్డి దర్శకత్వంలో కొత్త టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం అంటూ ఓం త్రీడీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు కానీ సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రం కోసం కల్యాణ్ రామ్ నిజమైన గుండుతో కనిపించడం విశేషం.

పటాస్(2015): అనిల్ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పటాస్‌లా పేలింది. దాంతో కల్యాణ్ రామ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక డైరెక్టర్‌గా అనిల్‌ను తెలుగు పరిశ్రమలో నిలబెట్టింది.

షేర్(2015): ప్రముఖ రైటర్ డైమండ్ రత్నం బాబు రచయితగా మల్లి కార్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం షేర్. ఈ చిత్రం సైతం పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇజం(2016): డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అవనీతి సొమ్మును దాచే స్విస్ బ్యాంక్‌ను కొల్లగొంటి పేదలకు పంచే రాబిన్ హుడ్ లాంటి పాత్రలో కల్యాణ్ రామ్ నటించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్ల వర్షం కురిపించలేదు.

ఎమ్మెల్యే(2018): ఉపేంద్ర మాదవ్ దర్శకత్వంలో వచ్చిన ఎమ్మెల్యే చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ నటించారు. ఈ చిత్రం సైతం పెద్దగా ఆడలేదు.

నా నువ్వే(2018): బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్న హీరోయిన్‌గా నటించిన నా నువ్వే చిత్రం 2018లో విడుదలైంది. కానీ అనుకున్నంతగా ఆడలేదు.

ఎన్టీఆర్ కథానాయకుడు(2019): సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించారు. తరువాత పార్ట్2 గా ఎన్టీఆర్ మహానాయకుడు(2019)లో సైతం నటించారు.

118(2019): కే. వి గుహన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 118. మిస్టిరీయస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది. హీరోకు వచ్చే ఓ కల ఆధారంగా ఓ అన్‌సాల్వుడ్ కేసును బయటపెడుతారు.

ఎంతమంచి వాడవురా(2020): సతీష్ వెగస్నా దర్శకత్వంలో కల్యాణ్ రామ్, బ్యూటీ మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఎంతమంచి వాడవురా.

బింబిసార(2022): యంగ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన అద్భతమైన దృశ్యకావ్యం బింబిసార. సోషియేఫాంటసీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా అందరి మనుసులను దోచుకుంది. టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్‌తో బింబిసారా లాంటి క్రూరుడు ఎలా మాములు మనిషిలా మారాడు, ఆ తరువాత జరిగే పరిణామాలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. గ్రాఫిక్స్ పరంగా కూడా సినిమా ఆకట్టుకుంది.

అమిగోస్(2023): బింబిసార లాంటి సాలిడ్ హిట్ తరువాత కమర్షల్ చిత్రాన్ని తెరకెక్కించకుండా తనదైనా శైలీలో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అమిగోస్ చిత్రంతో మూడు పాత్రలు పోషించారు. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అమిగోస్ పెద్దగా ఆకట్టుకోలేదు.

డెవిల్(2023): అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన డెవిల్ చిత్రం థియేట్లో డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్రం బ్రిటిష్ కాలంలో సాగుతుంది. ఒక మర్డర్ వెనుక మిస్టరీ చేధించే క్రమంలో హీరోకు కొని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఈ చిత్రంలో దేశభక్తి సైతం మెళవించి చక్కని దృశ్యకావ్యంగా మలిచారు. కానీ ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ అవలేదు.

ప్రస్తుతం కల్యాణ్ రామ్ హీరోగా చేస్తూనే సోదరుడు ఎన్టీఆర్‌తో దేవర చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇలాగే తన సీనీప్రయాణంలో ముందుకు వెళ్లాలని ఆశిద్దాం.