Reading Time: 2 mins

September Celebrities Birthdays

సెప్టెంబర్ నెలలో జన్మించిన తారలు

వెండితెరపై అలరించే ఎంత మంది నటీనటులకు లక్షలాది మంది అభిమానులు ఉంటారు. వారిని ఆరాధ్యధైవంగా పూజించే వీరా అభిమానులు సైతం ఉంటారు. కళకారులుగా తాము ఎంత కష్టపడి నటించినా, క్రీయేటీవ్‌గా ఆలోచింనా వారు ఆనంద పడేది మాత్రం ప్రేక్షకులు సంతోషంగా చప్పట్లు కొట్టినప్పుడు, వారి స్పెషల్ డేస్‌ను అభిమానులు పండుగలా జరుపుకుంటున్నప్పుడు. ఎవరికైనా తమ పుట్టిన రోజు కన్న ప్రత్యేక దినం ఏముంటుంంది. అందుకే సెలబ్రేటీల పుట్టిన రోజును అభిమానులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. స్టార్ సెలబ్రేటీలు అయితే వారి సినిమాలకు సంబంధించిన పోస్టర్లు విడుదల అవుతాయి. అలా సెప్టెంబర్ నెలలో ఏ కళకారుల పుట్టిన రోజులు ఏ రోజున ఉన్నాయో చూద్దాం.

పవన్ కల్యాణ్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొణిదెల కల్యాణ్ బాబుగా 1986 సెప్టెంబర్ 2 న జన్మించారు. అన్నయ్య అడుగు జాడలో తెలుగు పరిశ్రమలోకి వచ్చి అన్నయ్య నీడనే ఎదిగి పవర్ స్టార్‌గా నిలదొక్కుకున్నాడు. ఆయన పుట్టిన రోజును అభిమానులు ఎలా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రక్త దానాలు, అన్నదానాలతో ప్రతీ పల్లే సందడిగా ఉంటుంది. ఈ సారి పవర్ స్టార్ బర్త్‌డే కు ఏ సినిమా నుంచి ఏ అప్డేట్ వస్తుందో అని ప్రేక్షకులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

Sudeepa - Wikipedia

సదీప్: కిచ్చ సుదీప్‌గా ప్రాచుర్యం పొందిన ఈ కన్నడ నటుడు ఈగ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తరువాత బహుబలిలో ఓ చిన్న క్యారెక్టర్ ప్లే చేశారు. ఈయన సైతం సెప్టెంబర్ 2 న తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.

వివేక్ ఓబరాయ్: రక్త చరిత్ర, వినేయ విధేయ రామ చిత్రాలలో అలరించిన వివేక్ ఓబరాయ్ బాలీవుడ్ స్టార్ సెలబ్రేటీ అన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 3న వివేక్ ఓబరాయ్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

సింగర్ స్మిత: సెప్టెంబర్ 4న జన్మదినం జరుపుకుంటున్న సింగర్ స్మిత ఎన్నో పాపులర్ సాంగ్స్‌తో ఫేమస్ అయింది.

Mammootty - Wikipedia

రాధిక ఆప్టే: బాలయ్య బాబు నటించిన లెజెండ్ చిత్రంలో నటించిన రాధిక ఆప్టే బాలీవుడ్‌లో ఫేమస్ నటి. తన పుట్టిన రోజు సైతం సెప్టెంబర్ 7. ఇదే తేదీనా టాలీవుడ్ నటుడు తనీష్ పుట్టిన రోజు కూడా కావడం విశేషం. అలాగే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ బర్త్ డే కూడా సెప్టెంబర్ 7.

వెంకి కుడుముల: ఛలో చిత్రంతో తెలుగు తెరపై డైరెక్టర్‌గా మారిన వెంకి కుడుముల బర్తడే సెప్టెంబర్ 8. సమంతకు డబ్బింగ్ చెప్పే సింగర్ చిన్మయ్ సెప్టెంబర్ 10న పుట్టిన రోజును జరుపుకుంటుంది. అలాగే నటి శ్రియ సరాన్ సెప్టెంబర్ 11న జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటుంది.

BJP Khushbu faces flak for 'Cheri language' remark, later claims it's French word - India Today

సెప్టెంబర్ 12 అక్కినేని అమల, సెప్టెంబర్ 15న అందాల తారా రమ్మ కృష్ణ, సెప్టెంబర్ 16న మీనా, సెప్టెంబర్ 18న కన్నడ స్టార్ నటుడు ఉపెంద్ర, సెప్టెంబర్ 19 తెలుగు కామెడీ స్టార్ వెన్నెల కిషోర్, సెప్టెంబర్ 21న బ్యూటీ హీరోయిన్ కృతి శెట్టి, హీరో కార్తీకేయ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళి శర్మ తమ బర్త్‌డేలను జరుపుకుంటున్నారు. ఇక సెప్టెంబర్ 23న అర్జున్ రెడ్డి బ్యూటీ శాలినీ పాండే, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కార్, సెప్టెంబర్ 24న డైరెక్టర్ శ్రీను వైట్ల పుట్టిన రోజు. అలాగే సెప్టెంబర్ 28 న డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్, 29న అందాల తార ఖుష్బు పుట్టిన రోజు జరుపుకుంటారు.