Reading Time: 4 mins

Devar Hero NTR Filmy Names
దేవర హీరో ఎన్టీఆర్ సినిమాల్లోని పాత్రల పేర్లు తెలుసా

నందమూరి తారక రామారావు లేని లోటును జూనియర్ ఎన్టీఆర్ కొంతమేర బర్తీ చేస్తున్నారని చెప్పవచ్చు. డైలాగ్స్, డ్యాన్స్, నటన విషయంలో ఎన్టీఆర్ అందరినీ మెప్పించగలరు అంటే అతిశయక్తి కాదు. చిన్నతనంలోనే తాతా వేలు పట్టుకొని తెలుగు తెరపై కనిపించారు. అలా ఒక్కో మెట్ట్టు ఎదుగుతూ యంగ్ టైగర్ కాస్త మ్యాన్ మాస్సెస్‌గా గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. కష్టపడే తత్వమే ఆయన్ను స్టార్‌గా నిలబెట్టింది. అభిమానులు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిపెట్టింది. ప్రస్తుతం ఆయన వార్‌2 చిత్రంతో తొలిసారిగా బాలీవుడ్‌లో నటించిబోతున్నారు. హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అలాగే దేవర చిత్రంలో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసందే. ఈ చిత్రంలో హీరో పాత్ర పేరు సైతం దేవర.. కానీ కొన్ని చిత్రాలలో ఆయన పేరు టైటిట్ పేరు ఉంటే మరికొన్ని చిత్రాలలో వేరేది ఉంది. మరి ఆ పేర్లు ఏంటో చూద్దాం..

నిను చూడాలని(2001): 2001లో నిను చూడాలని చిత్రంతో నందమూరి నటవారసుడిగా, డెబ్యూ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీ రావు రూపొందించిన ఈ చిత్రంలో ఆయన పేరు వేణు.

స్టూడెంట్ నెం.1(2001): ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన స్టూడెంట్ నెం1 చిత్రంలో ఎన్టీఆర్ పేరు ఆదిత్య. ఈ చిత్రం ఇటు ఎన్టీఆర్‌కు అటు రాజమౌళికి ఇద్దరికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఆదిత్యగా ఎన్టీఆర్ జీవించిన విధానం అందరినీ కట్టిపడేసింది.

సుబ్బు(2001): బాలసుబ్రమణ్యం అలియాస్ సుబ్బుగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ కనిపించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చాలా క్యూట్‌గా కొంచెం బొద్దుగా ఉంటాడు. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఎన్టీఆర్ కెరీర్‌లో అప్పటి వరకు రెండు ఫ్లాప్‌లు పడ్డాయి.

ఆది(2002): వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది చిత్రం ఎన్టీఆర్ ఇమేజ్‌ను మార్చేంత పెద్ద హిట్ అయింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పేరు ఆదికేశవ రెడ్డి. ఈ చిత్రంలో డైలాగ్స్ సైతం విరపీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్ ఎంతో ఫేమసో అందరికీ తెలిసిందే.

అల్లరి రాముడు(2002): బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల్లరి రాముడు చిత్రంలో హీరో పేరు రామ కృష్ణ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కామెడీ చాలా బాగుంటుంది

నాగ(2003): ఏఎమ్ రత్నం నిర్మాతగా, డీకీ సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన నాగ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పేరు నాగ. కానీ ఈ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. ఆ తరువాత వచ్చన చిత్రం సింహాద్రి.

సింహాద్రి(2003): ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి చిత్రంలో ఆయన పేరు సింహాద్రి. అలాగే ఎన్టీఆర్‌ను సింగమలై అని కూడా పిలుస్తారు. ఈ చిత్రంతో ఎన్టీఆర్‌లోని పూర్తి మాస్ కోణం చూపించారు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.

ఆంధ్రవాలా(2004): డబుల్ రోల్‌లో ఎన్టీఆర్ దర్శనిచ్చిన మొదటి చిత్రం ఆంధ్రవాల. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో యంగ్ ఎన్టీఆర్ పాత్ర పేరు మున్నా, సీనియర్ పాత్ర పేరు శంకర్ పహిల్వాన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం తెచ్చుకుంది.

సాంబ(2004): వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాంబలో చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పేరు సాంబశివనాయుడు. మంచి సందేశాత్మకమైన కథతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది.

నా అల్లుడు(2005): ఎన్టీఆర్ హీరోగా నటించిన నా అల్లుడు చిత్రంలో ఎన్టీఆర్ రెండు షేడ్స్ ఉండే పాత్రలో నటించారు. కార్తిక, మురగన్ అనే రెండు పేర్లతో ఎన్టీఆర్ చేసే యాక్టింగ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

నరసింహుడు(2005): నరసింహుడు చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పేరు నరసింహుడు. ఒక ఊరు ఊరంత ఆయన్ను ప్రేమించే పాత్రలో ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.

అశోక్(2006): సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం ఆశోక్ పెద్దగా ఆడలేదు.

రాఖీ(2006): క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో తెరకెక్కిన రాఖీ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పేరు రామకృష్ణ.

యమదొంగ(2007 ): రాజాగా థియేటర్లో సందడి చేసిన సినిమా యమదొంగ. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్న చూపించారు.

కంత్రి(2008): మంచివాళ్లుకు క్రాంతి, నీ లాంటి వాళ్లకు కంత్రి అని మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంత్రి చిత్రంలో ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది. ఈ చిత్రంలో ఆయన పేరు క్రాంతి.

అదుర్స్(2010): వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అదుర్స్ చిత్రం ఎన్టీఆర్‌ మరోసారి ద్విపాత్రాభినయం చేశారు. అందులో ఒక పాత్ర పేరు నరసింహా చారి, ఒకో పాత్ర నరసింహా.

బృందావనం(2010): వంశి పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా చిత్రం బృందావనం. ప్రేయసి స్నేహితురాలి ప్రాబ్లమ్ తీర్చడానికి వెళ్లిన హీరో తనతో ఎలా ప్రేమలో పడ్డారు అనేది ఈ కథ. ఇందులో ఎన్టీఆర్ పాత్ర పేరు కృష్ణ అలియాస్ క్రిష్ అని పిలుస్తారు.

శక్తి(2011): మెహర్ రమేస్ దర్శకత్వంలో వచ్చిన ఈ హై బడ్జెట్ మూవీలో శక్తి స్వరూప్, రుద్రగా నటించారు.

ఊసరవెల్లి(2011): సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఊసరవెళ్లి చిత్రంలో టోనీగా అలరించారు.

దమ్ము(2012): బోయపాటి దర్శకత్వంలో వచ్చిన దమ్ము చిత్రంలో రాజా వాసి రెడ్డి విజయ ధ్వజశ్రీ సింహగా మెప్పించారు. కానీ సినిమా పెద్దగా ఆడలేదు.

బాద్షా(2013): శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్షా చిత్రంలో ఒరిజినల్ పేరుతో అలరించారు.

రామయ్య వస్తావయ్య(2013): హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన రామయ్య వస్తావయ్య చిత్రంలో ఆయన పాత్ర పేరు రాము.

రభసా(2014): రభసా చిత్రంలో ఎన్టీఆర్‌ కార్తిక్ పాత్రలో నటించారు. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు.

టెంపర్(2015): పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ చిత్రంలో దయాగా నటించారు. కానీ కన్నింగ్ అండ్ ఫ్రాడ్ పోలీసు నుంచి ఎలా మారుతాడు అనేది చాలా బాగా నటించారు.

నాన్నకు ప్రేమతో(2016): సుకుమార్ దర్శకత్వంలో రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో చిత్రంలో అభిరామ్ పాత్రలో నటించారు.

జనతాగ్యారేజ్ (2016): కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతాగ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్‌ ఆనంద్ పాత్రలో నటించారు.

జై లవ కుశ(2017): కే.ఎస్ రవింద్ర అలియాస్ బాబీ కొల్లు దర్శకత్వంలో వచ్చిన జై లవ కుశ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. అందులో జై లవ కుశ గా టైటిల్ పేర్లతో నటించారు.

అరవింద సమేతా వీరరాఘవ(2018): మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 2018లో విడుదలైన చిత్రం అరవింద సమేతా వీరరాఘవ చిత్రంలో వీర రాఘవ రెడ్డిగా అలరించారు. .

ఆర్ఆర్ఆర్(2022): కొమరం భీమ్‌గా మరో సారి తన నట విశ్వరూపాన్ని చూపించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంతో ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ను సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. దీనిలో కూడా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు అందులో ఒకరి పేరు దేవర అని తెలుస్తుంది. చూడాలి మరీ తన తండ్రి పాత్ర పేరు ఏంటి, అది ఎలా ఉంటుందో అని. అంతే కాకుండా వార్ 2 చిత్రం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కితున్నా చిత్రలలో ఆయన పేరు ఏముందరో.