Reading Time: 3 mins

The Greatest of All Time Movie Pre Release Event

విజయ్ ది గోట్ ప్రీ రిలీజ్ ఈవెంట్

విజయ్ దలపతి హీరోగా నటించి ది గోట్ చిత్రం విడుదలకు సిద్ధం అయింది. అందుకే హైదరాబాద్ లోని ట్రై డెంట్ హోటల్ లో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి డైరక్టర్ వెంకట్ ప్రభు, AGS ఎంటర్ టైన్మెంట్ నిర్మాత అర్చన, నటీనటులు ప్రశాంత్, వైభవ్ ,స్నేహ, లైలా, ప్రేమ్ జీ, మైత్రీ డిస్ట్రిబ్యూషన్ తరఫున రవి శంకర్, శశి, సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా లు హాజరయ్యారు.

వైభవ్ మాట్లాడుతూ ” నేను ఈ సినిమా రెండు రోజులు క్రితం చూశా, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాబోతుంది, మీరు ట్రైలర్ లో చూసింది కేవలం పది శాతం మాత్రమే సినిమా లో ఇంకా చాలా వుంది, సెప్టెంబర్ 5 న మీరు చూసి ఎంజాయ్ చేస్తారు, అంతే కాకుండా ఈ సినిమా AGS బ్యానర్ కి 25th సినిమా, ప్రొడ్యూసర్ అర్చనా గారు మీకు, మీ బ్యానర్ కి ఇది మైల్ స్టోన్ మూవీ అవుతుంది” అని చెప్పారు.

ప్రేమ్ జీ మట్లాడుతూ” ఈ సినిమా మీకు థియేటర్ లో ఒక సరికొత్త అనుభూతినిస్తుంది ‘ అని చెప్పారు. తర్వాత వైభవ్ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ లోని ఒక పాట ర్యాప్ లిరిక్స్ పాడి అలరించారు.

యువన్ శంకర్ రాజా మట్లాడుతూ ” AGS బ్యానర్ 25th film కి నేను మ్యూజిక్ చేయడం మరియు తలపతి విజయ్ సార్ తో మళ్ళీ కలిసి చేయడం చాలా సంతోషంగా వుంది. నేను సినిమా చూశా, మీ అందరికీ నచ్చుతుంది అని నమ్ముతున్నా ‘ అని చెప్పారు.

హీరోయిన్ నటి లైలా మాట్లాడుతూ.. దళపతి విజయ్ తో నటించడం, గోట్ చిత్రంలో తాను ఒక పాత్ర చేయడం చాలా సంతోషం అన్నారు. దర్శకుడు వెంకట ప్రభువుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సెప్టెంబర్ 5న ది గోట్ చిత్రం విడుదల కాబోతుందని అందరు కచ్చితంగా చూడాలని కోరారు.

బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. చేసినవి తక్కువ సినిమాలు అయినా అన్ని స్టార్ యాక్టర్స్ తో పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. సెట్లో హీరో విజయ్ చాలా సైలెంట్ గా ఉంటాడని చాట్ రెడీ అనగానే తనలో ఇంకొక పర్సన్ బయటకు వస్తాడని అన్నారు. అందుకే ఆయన బిగ్ స్టార్ అయి ఉంటాడని మీనాక్షి చౌదరి తెలిపారు. ఇక తెలుగు పరిశ్రమలో గ్రేట్ అఫ్ ఆల్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వెల్లడించారు. తెలుగులో తాను చూసిన మొదటి సినిమా జల్సా అని, ఆ తర్వాత ఎన్నో సినిమాలు చూసానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
ఏజీఎస్ ఎంటర్ టైన్మెంట్స్ పనిచేయడం అలాగే హీరో విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. అలాగే డైరెక్టర్ వెంకట్ ప్రభు గురించి మాట్లాడుతూ.. సెట్ లో ఏలాంటి సమస్య వచ్చినా చాలా కూల్ గా సాల్వ్ చేస్తారని అన్నారు. ఇక చివరిగా విజయ్ సర్ తో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ది గోట్ చిత్రంలో నటించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకట ప్రభువుకు యాక్టర్ ప్రశాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు. డైరెక్టర్ వెంకట ప్రభువు ఎంత కామ్ గా ఉంటారో ఆయన విజన్ అంతా సాలిడ్ గా ఉంటుందని చెప్పారు. ఇలాంటి చిత్రాలు అప్పుడప్పుడు వస్తుంటాయని, కచ్చితంగా సెప్టెంబర్ 5న ది గోట్ చిత్రాన్ని ఆదరించాలన్నారు.

అందాల హీరోయిన్ స్నేహ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందు ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇది చాలా బిగ్ సినిమా అని సెట్లో ఎప్పుడూ మల్టీ స్టార్స్ ఉండే వారిని అందరిని అలా చూడడం ఆనందంగా ఉందని చెప్పారు. అలాగే తెలుగు చాలామంది హీరోలతో పనిచేసినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరితో పని చేయలేదు అనే ఫీలింగ్ మిగిలిపోయిందని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలో గ్రేట్ అఫ్ ఆల్ టైం పవన్ కళ్యాణ్ అని.. ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ది గోట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. ఇది చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న చిత్రం అని, ఇందులో విజయ్ మీనాక్షి చౌదరి, లైలా, యోగి బాబు తదితరులుతో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చింది అని తెలిపారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. ఇంత పెద్ద సినిమాను కేవలం ఒక సంవత్సరంలోపే తీశామని చెప్పారు. తెలుగులో డైరెక్టర్ రాజమౌళి అంటే ఆయనకు ఇన్స్పిరేషన్ అన్నారు. ఈ సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థాంక్స్ చెప్పారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 5న ప్రేక్షకులను థియేటర్లోకి వచ్చి సినిమాను చూడాలని కోరారు. హీరో బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు పరిశ్రమలో ది గోట్ అంటే బాలయ్య బాబు అని డైరెక్టర్ వెంకట్ ప్రభు వెల్లడించారు.

అనంతరం మీడియాతో ముచ్చటించారు. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అలాగే సినిమా గురించి నటీనటులు వారి వారి అనుభవాలను పంచుకున్నారు. ‘సెప్టెంబర్ 5న ది గోట్ మూవీ థియేటర్లో అలరించబోతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.