Reading Time: < 1 min

Janaka Aithe Ganaka Movie Pre Release Event

మంచి చిత్రాన్ని ఇస్తే ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారు. మీడియా, ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా? అని వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా మాత్రం ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. ఓ మంచి సందేశాన్ని ఇచ్చారు అనే ఆలోచనతో థియేటర్ నుంచి బయటకు వస్తారు’ అని అన్నారు.

దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల మాట్లాడుతూ.. ‘ప్రశాంత్ నీల్ టీంలోకి నన్ను దిల్ రాజు గారే పంపారు. అక్కడ చాలా నేర్చుకున్నాను. ప్రశాంత్ నీల్ గారికి ఈ కథ తెలుసు. బాగుందని మెచ్చుకున్నారు’ అని అన్నారు.

సుహాస్ మాట్లాడుతూ.. ‘‘జనక అయితే గనక’ సెన్సార్ అయింది. చాలా బాగా వచ్చింది. ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా? అని వెయిట్ చేస్తున్నాను. స్క్రిప్ట్ విన్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. సినిమాను చేస్తున్న టైంలోనే ఈ డిస్ట్రిబ్యూషన్ గురించి దిల్ రాజు గారిని అడిగాను. ఓవర్సీస్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నారు.’ అని అన్నారు.

ఎడిటర్ కోదాటి పీకే మాట్లాడుతూ.. ‘అందరూ కలిసి చూసేలా సినిమా ఉంటుంది. వాట్సాఫ్ ఫార్వార్డ్‌లా మా సినిమా గురించి అందరికీ చెప్పండి’ అని అన్నారు.

విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. ఆర్ఆర్ బాగా కుదిరింది. మా మూవీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.