Reading Time: 2 mins

Devara Hero NTR Top Budget Movies
దేవర హీరో ఎన్టీఆర్ టాప్ బడ్జెట్ మూవీస్

స్టార్ హీరోగా ఎదగాలంటే బ్యాగ్రౌండ్ కాదు ట్యాలెంట్ మాత్రమే అని నమ్మిన అతి కొద్దిమంది నటుల్లో హీరో ఎన్టీఆర్ ఒకరు. లెజండరీ నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన ఆయనకు విజయం రాలేదు. ఎంచుకున్న కథలు, ఆయన ప్రతిభ, నటన ఇవే ఆయన్ను వెండితెరపై నిలబెట్టాయి. ఇప్పటి వరకు చేసిన సినిమాలు తక్కువే అయినా ఎన్నో విజయ శిఖరాలను అధిరోహించారు. ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్‌ను పొందారు. మన తెలుగువాడిలో ఇంత ట్యాలెంట్ ఉందా అని బాలీవుడ్ సైతం నివ్వర పోయింది. అందుకే హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేరు చేసుకోబోతున్నారు. అంతే కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న దేవర చిత్రం కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పటికే ఎన్నో విజయాలను తన ఖాాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆయన సినిమా ప్రస్థానంలో ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన చిత్రాలు ఎంటీ? అవి వసూళ్లు చేసిన కలెక్షన్లు ఎంతో సమీక్షిద్దాం.

6. టెంపర్:
పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం టెంపర్. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించారు. 2015లో వచ్చిన ఈ చిత్రాన్ని రూ.35 కోట్ల వ్యవయంతో రూపొందించారు. సినిమా మొదటి షో నుంచే విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. దాంతో సినిమా మొత్తం రూ. 74.3 కోట్లు వసుళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌ అయింది.

5. నాన్నకు ప్రేమతో:
ఎస్వీఎస్సీ బ్యానర్‌పై బివీఎస్ఎన్  ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం నాన్నకు ప్రేమతో. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ చాలా స్టైలిష్గా కనిపించారు. రూ. 45 నుంచి 50 కోట్లు పెట్టి తీసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 87.2 కోట్లు వసుళ్లు సాధించింది.

4. జనతాగ్యారేజ్ :
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మాతలుగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జనతాగ్యారేజ్. ఎన్టీఆర్‌ అద్భతమైన నటనతో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. 2016లో రూ.40 నుంచి 50 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 135.45 కోట్ల వరకు వసూళ్లు సాధించి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

3. అరవింద సమేతా వీరరాఘవ:
హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధకృష్ణ నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 2018లో అరవింద సమేతా వీరరాఘవ తెరకెక్కింది. దాదాపు రూ. 40 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 179.6 కోట్లు సాధించింది.

2. శక్తి: వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మించిన చిత్రం శక్తి. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ దగ్గర డిజాస్టార్ టాక్ తెచ్చుకుంది. అప్పటి వరకు ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ అని చెప్పవచ్చు. 2001లోనే రూ. 48 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 35 కోట్లు మాత్రమే వసుళ్లు చేసింది.

1. ఆర్ఆర్ఆర్:
డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయింది. రూ.550 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1386.31కోట్లు వసుళ్లు చేసింది. కొమరం భీమ్ పాత్రకోసం ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డాడో తెరమీద చూశాము.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.350 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ను సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దంగా ఉన్నారు. ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను ఏ మేరకు రాబడుతుందో చూడాలి మరి.