ARM Movie Review
ఏఆర్ఎమ్ మూవీ రివ్యూ
మిన్నల్ మురళి, 2018 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో టొవినో థామస్. తాజాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఏఆర్ఎమ్ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీ ఆయనకు 50వ చిత్రం కావడం విశేషం. తెలుగులో సైతం ప్రమోషన్లు చేశారు. హీరోయిన్‌గా నటించిన కృతి శెట్టి ఎలాగో తెలుగు వారికి బాగా పరిచయం ఉండడంతో ఏఆర్ఎమ్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకున్న ఈ మూవీ థియేటర్లో ప్రేక్షకులను ఏ మేరకు ఆకర్షించిందో తెలుసుకుందాం.
కథ:
ఒక చిన్న గ్రామంలో అజయ్ (టొవినో థామస్), తల్లి (రోహిణి) చిన్నచితక పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. అజయ్ తాతా మణియన్ (టొవినో థామస్) పేరు మోసిన దొంగ. ఈ కారణంగా ఊరిలో ఏ దొంగతనం జరిగినా అజయ్‌ని అనుమానిస్తుంటారు. ఆ ఊరిలో ఒక గుడి ఉంటుంది. అందులో నిత్యం వెలిగే శ్రీభూతి దీపానికి చాలా విశిష్టత ఉంటుంది. దాన్ని కొట్టేయడానికి సుదేవ్‌వర్మ (హరీష్ ఉత్తమన్) ఊరిలోకి వస్తాడు. ఆ నిందను అజయ్ మీదకు వచ్చేలా ప్లాన్ చేస్తాడు. నిజానికి ఆ దీపాన్ని కాపాడేది అజయ్ కుటుంబమే. ఈ సారి అజయ్ ఈ దీపాన్ని ఎలా కాపాడాడు? దాని చరిత్ర ఏంటి? మహావీరుడు కుంజికేలు (టొవినో థామస్) పాత్ర ఏంటి? లక్ష్మి (కృతిశెట్టి), అజయ్ ల మధ్య ప్రేమ ఏమైంది? అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
విశ్లేషణ:
మూడు తరాల కథను రెండున్నర గంటల్లో చెప్పడం అంటే మాములు విషయం కాదు. ఇది మంచి థ్రిల్లర్ కథ. అయితే మూడు పాత్రలు, మూడు పిరియడ్స్ లో కథ సాగుతున్న నెమ్మదిగా వెళ్తున్న అనుభూతి కలుగుతుంది. కేలు పరాక్రమం చూసిన రాజు అతడు అడిగిన మహిమగల శ్రీభూతి దీపాన్ని.. కేలుకు ఇవ్వడంతో కథలో ఇంట్రెస్టింగ్ మొదలౌతుంది. అలాంటి పరాక్రమవంతుడి వారసుడు మణియన్ ఎందుకు దొంగగా మారాడు అనేది చాలా ఆసక్తిగా చూపించారు. ఇక సినిమాకు మణియన్ చాలా ప్రత్యేకం. స్క్రీన్‌ప్లేలో బాగుంది. వీటన్నింటితో పాటు సమాజంలోని అంతరాల్ని కూడా టచ్ చేశారు. రోహిణి పాత్రను కూడా చాలా బలంగా చూపించారు. రెండున్నర గంటల సేపు ప్రేక్షకుడిని కూర్చోబెడుతుంది.
నటీనటులు:
టొవినో థామస్ మూడు పాత్రల్లో చాలా అలరించారు. పాత్రల వేరియేషన్స్ కూడా చాలా బాగా చూపించారు. యుద్ధ విద్యలు, పోరాట ఘట్టాలలో అద్భతంగా చేశారు. ఐశ్వర్య రాజేశ్ కొద్దిసేపే అయినా ఆకట్టుకుంది. లక్ష్మి పాత్రలో కృతిశెట్టి చాలా బాగా చేసింది. 90ల నాటి అమ్మాయిగా, అమయాకంగా కనిపించింది. మిగితా నటీనటులు అంతా తమ పాత్ర పరిధిమేరకు అలరించారు.
సాంకేతిక అంశాలు:
జితిన్ లాల్ దర్శకత్వం చాలా బాగుంది. మూడు పాత్రలను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది ఆయన మొదటి సినిమాల లేదు. ప్రతీ ఫ్రేమ్‌లో ఆయన పనితనం, ప్రతిభ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన సినిమాటికి విజన్ ఆకట్టుకుంది. ఆ తరువాత థిబు నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు ప్లస్. రచనలో బలం ఉంది.
ప్లస్ పాయింట్స్
టొవినో థామస్ యాక్టింగ్
కథా, కథనం, నేపథ్యం
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్
మైనస్ పాయింట్స్
ఊహించే సీన్లు
క్లైమాక్స్
తీర్పు: కథ, కథనం బాగుంది.. కానీ ఏదో మిస్ అయిన ఫిలింగ్ కలుగుతుంది.
Movie Title : ARm
Banner: Magic Frames
Release Date : 12-09-2024
Censor Rating : “U/A”
Cast: Tovino Thomas, Krithi Shetty, Aishwarya Rajesh, Surabhi Lakshmi, Basil Joseph
Director: Jithin Laal
Music : Dhibu Ninan Thomas
Cinematography: Jomon T John Isc
Editor: Shameer Muhammed
Producer : Listin Stephen, Dr. Zachariah Thomas
Nizam Distributor : Mythri Movie Distributors LLP
Runtime : 140 minutes