Bahirbhoomi Movie First Launch Event
బహిర్భూమి మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్
వైభవంగా “బహిర్భూమి” ఫస్ట్ లుక్ లాంచ్
నోయల్ , రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “బహిర్భూమి”. ఈ చిత్రాన్ని మహంకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. బహిర్భూమి సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ మాట్లాడుతూ – బహిర్బూమి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ వేణు గారు, డైరెక్టర్ రాంప్రసాద్ కు థ్యాంక్స్. ఈ సినిమాకు మంచి సాంగ్స్ చేసే అవకాశం దొరికింది. మంచి ఎనర్జిటిక్ సాంగ్స్ చేశాం. ఈ సినిమాను మీరంతా సపోర్ట్ చేయాలి. అన్నారు.
జబర్దస్త్ ఫణి మాట్లాడుతూ – బహిర్భూమి సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. నోయెల్ కాంబినేషన్ లో నా కామెడీ సీన్స్ బాగా నవ్విస్తాయి. దర్శకుడు రాంప్రసాద్ గారు అందరికీ నచ్చేలా ఈ మూవీ చేశారు. ప్రొడ్యూసర్ వేణుమాధవ్ ప్యాషన్ తో సినిమా చేశారు. ఆయనకు మీరంతా అండగా నిలబడాలని కోరుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ మరిన్ని సినిమాలు చేయగలరు. అన్నారు.
నిర్మాత మచ్చ వేణు మాధవ్ మాట్లాడుతూ – సినిమా మీద ప్యాషన్ తో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ప్రొడ్యూసర్ గా మూవీస్ చేస్తున్నాను. బహిర్భూమి సినిమాకు మా టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు. మా సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ బాగా సపోర్ట్ చేశారు. మిగతా వాళ్లు టాయిలెట్ అంటూ ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టుకున్నారు. మేము ధైర్యంగా బహిర్భూమి అని సినిమాకు పేరు పెట్టాం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో మంచి డేట్ చూసి గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేస్తాం. అన్నారు.
దర్శకుడు రాంప్రసాద్ కొండూరు మాట్లాడుతూ – బహిర్భూమి సినిమాకు హీరో నోయెల్ ఎంతో సపోర్ట్ చేశారు. నోయెల్, ఫణి వీళ్ల మధ్య కామెడీ సీన్స్ హైలైట్ అవుతాయి. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత వేణు గారికి థ్యాంక్స్. అలాగే సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ ఎంతో సపోర్టివ్ గా ఉండేవారు. మేము బహిర్భూమి అని టైటిల్ ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. వెస్ట్రన్ కల్చర్ కంటే మన కల్చర్ చాలా గొప్పది. ఈ విషయాన్ని మా మూవీలో అంతర్లీనంగా చెబుతున్నాం. హీరోయిన్ రిషిత చాలా బాగా నటించింది. మా మూవీకి మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
డి ఓ పి ప్రవీణ్ మాట్లాడుతూ-ఈ సినిమా కెమెరామెన్ గా నాకు అవకాశం ఇచ్చిన మా నిర్మాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా నిర్మాత గారు మంచి మనసున్న మనిషి .ఆయన సహకారం వల్ల ఈ సినిమా ఇంత గ్రాండ్ గా వచ్చింది.అలాగే మా హీరో నోయల్ గారు మంచి మనసున్న మనిషి. ఆయన కోపరేషన్ వల్లే ఈ సినిమాను తొందరగా పూర్తి చేయగలిగాము. అలాగే మా హీరోయిన్ రిషిత ఎంతో కష్టపడి ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి సహకరించినందుకు ఆమె కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా డైరెక్టర్ ప్రసాద్ గారు చాలా తక్కువ సమయంలో చాలా ఫాస్ట్ గా ఈ సినిమాని మేము అనుకున్న విధంగా తీగలిగామంటే ఆయనచేసిన హార్డ్ వర్క్ కారణం.
హీరోయిన్ రిషిత నెల్లూరు మాట్లాడుతూ – చిత్ర పరిశ్రమలోకి కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు ఉంటాయి. నేను హీరోయిన్ గా పనికి రానని అన్నవాళ్లూ ఉన్నారు. ఈరోజు బహిర్భూమి సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యే అవకాశం దక్కింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ టీమ్ తో వర్క్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. బహిర్భూమి సినిమాలో నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరంతా మా మూవీని చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
డిఓపి ప్రవీణ్ మాట్లాడుతూ-మా నిర్మాత వేణుమాధవ్ గారు మంచి మనసున్న మనిషి అలాగే మంచి ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ కూడా. అలాగే మా హీరో నోయల్ అందించిన సహకారం వల్లే ఈ సినిమా నేను తొందరగా కంప్లీట్ చేయగలిగాము. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను . అన్నారు
హీరో నోయల్ మాట్లాడుతూ – నేను చిన్న మూవీస్ చేయొద్దు అనుకుంటున్న టైమ్ లో వచ్చిన చిత్రం బహిర్భూమి. ఈ సినిమాకు ముగ్గురు మెయిన్ పిల్లర్స్. వాళ్లే నిర్మాత వేణు మాధవ్, దర్శకుడు రాంప్రసాద్, సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్. వీళ్లు ముగ్గురు లేకుంటే ఈ సినిమా లేదు. బహిర్భూమి టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమాలో చూడండి. చాలా మంచి మూవీ చేశాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. ప్రవీణ్ సినిమాటోగ్రఫీ, అజయ్ పట్నాయక్ మ్యూజిక్ తో పాటు ఇతర అన్ని క్రాఫ్టుల పనితనం ఆకట్టుకుంటుంది. త్వరలో థియేటర్స్ లోకి బహిర్భూమి సినిమా వస్తుంది. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు –
నోయల్, రిషిత నెల్లూరు, గరిమా సింగ్, చిత్రం శీను, విజయ రంగరాజు, జబర్దస్త్ ఫణి, జయ వాహిని ఆనంద్ భారతి, కిరణ్ సాపల, పెళ్లకూరు మురళీకృష్ణ రెడ్డి, తదితరులు
టెక్నికల్ టీమ్ –
సినిమాటోగ్రఫీ – ప్రవీణ్ కోమరి,
మ్యూజిక్ – అజయ్ పట్నాయక్,
నిర్మాత – మచ్చ వేణుమాధవ్,
రచన దర్శకత్వం – రాంప్రసాద్ కొండూరు