Reading Time: < 1 min

Director Sreenu vaitla Birthday Special
శ్రీను వైట్ల బర్త్ డే స్పెషల్

డైరెక్టర్ శ్రీను వైట్ల సరికొత్త కామెడీని తెరకు పరిచయం చేసిన క్రియేటర్. శ్రీను వైట్ల నుంచి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుడు ఎంతో కుతూహలంగా వెయిట్ చేసేవారు. కడుపుబ్బ నవ్వుకోవచ్చు అనే నమ్మకంతో థియేటర్లో కూర్చునే వారు. సొంతం, వెంకీ, దుబాయ్ శీను, దూకుడు, వంటి ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను అందించారు. కామెడీకి ప్రాధాన్యత ఇస్తూనే మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలను అందిస్తూ తెలుగులో టాప్ కమర్షియల్ డైరెక్టర్ గా దశాబ్దం క్రితం ఓ వెలుగు వెలిగారు. ఆ తరువాత కొన్ని సినిమాలు అనుకున్నట్లు ఆడక పోవడంతో కాస్త విరామం ఇచ్చారు. మళ్లీ ఆయన తరహా కామెడీ పంచడానికి ఈ సంవత్సరం సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, కందులపాలెంలో సెప్టెంబరు 24, 1972 శ్రీను వైట్ల జన్మించారు. చిన్ననాటి నుంచి ఉన్న సినిమాలపై ఇష్టమే ఆయన్ను డైరెక్టర్ అయ్యేలా చేశాయి.

ఆయన తెరకెక్కించిన చిత్రాలలో మంచి విష్ణుతో చేసిన ఢీ, రామ్ పోతినేనితో రెఢీ, నాగార్జునతో కింగ్, మహేష్ బాబు దూకుడు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో బాద్ షా, మహేష్ బాబుతో ఆగడు, రామ్ చరణ్ తో బ్రూస్ లీ చిత్రాలు కొంత నిరాశపరచాయి. ఇప్పుడు మళ్లీ అదే ఉత్సాహంతో కం బ్యాక్ ఇచ్చేందుకు శ్రీను వైట్ల విశ్వం సినిమాతో రెడీ అవుతున్నారు. గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 2024లో విడుదలకు సిద్దం అవుతుంది. 1999 నీకోసం చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయిన శ్రీను వైట్ల, 2001లో ఆనందం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సొంతం, వెంకీ వంటి చిత్రాలు ఆయన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. తొలి సినిమాకే డెబ్యూ దర్శకుడిగా నంది అవార్డు అనుకున్నారు. 2012లో దూకుడు చిత్తానికి ఉత్తమ స్క్రీన్ పై రచయితగా నందిగా అవార్డును కైవసం చేసుకున్నారు. దీనితో పాటు పలు అవార్డులు సొంతం చేసుకుని ఎంతో మంది నూతన దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. కొంత గ్యాప్ తరువాత మళ్లీ మనముందుకు వస్తున్న శ్రీను వైట్లకు మంచి హిట్ పడాలని కోరుకుంటూ బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున శుభాకాంక్షలు.