Reading Time: 3 mins

Director Puri Jagannadh Best Dialogues
డైరెక్టర్ పూరి జగన్నాథ్ బెస్ట్ డైలాగ్స్

కమర్షియల్ హంగులతో కొత్త పుంతలు తొక్కిన తెలుగు సినిమాను వేగవంతం చేసిన డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. 2000 సంవత్సరంలో వచ్చిన డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ క్రేజ్ వేరే. ప్రస్తుతం సరైనా సినిమాలు పడక కాస్త నెమ్మదించారు కానీ ఆయన స్పీడ్ అందరికీ తెలిసిందే. పడి లేవడం ఆయనకేం కొత్త కాదు, హిట్లు, ప్లాపులు ఆయన టాలెంట్ కు కొలమానం కాదు. ఒక తరానికి ఇన్స్పిరేషన్ ఆయన అంటే అతిశయోక్తి కాదు. పంచ్ డైలాగులు రాయడంలో ఆయన కాయనే సాటి, ఆయన ఆలోచనలోని వేగం, ఆయన రైటింగ్ స్పీడ్ ఎవరు మ్యాచ్ చేయలేరు అనేది నిజం. సెప్టెంబర్ 28 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రంలోని బెస్ట్ డైలాగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

1. ”సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు. చంటిగాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు.. లోకల్”
‘ఇడియట్’ సినిమాలో హీరో రవితేజ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో, మీమ్స్ లలో ట్రెండింగ్ లో ఉంటుంది.

2. “టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా.. అలా ఉంటుంది నేను గుద్దితే”
‘బుజ్జిగాడు’ చిత్రంలో ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఆయనకి ఎంతో నచ్చిందని ఎన్నో సందర్భాల్లో చెప్పారు.

3. “తుడుచుకుంటే పోతుందనుకుంటే నూటికి 99 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ.. కానీ నేనే పోతాను అనుకుంటే.. నువ్వు పోతావ్” నేనింతే సినిమాలో రవితేజ చెప్పే ఈ డైలాగ్ ఎంతో ఇంపాక్ట్ గా ఉంటుంది.

4. “నేను మెళ్ళిగా ఎలాగో అలా బ్రతికేయడానికి రాలేదు.. ముంబై ని… పోయించడానికి వచ్చా, ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు.. కన్ఫ్యూజన్‌లో ఎక్కవ కొట్టేస్తా” వంటి డైలాగ్స్ చాలా బాగుంటాయి.

5. “నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్”.. బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో మారుమోగుతుంది.

6. “గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చినోడిని.. మళ్ళీ టోర్నమెంట్స్ పెట్టొద్దు..” పైసా వసూల్ చిత్రంలో బాలకృష్ణ చెప్పిన ఈ డైలాగ్ నందమూరి అభిమానుల్ని ఉర్రూతలూగించింది.

7. “ఈ అడవి నాదే వేట నాదే చిరుతా”… రామ్ చరణ్ చెప్పిన ఈ డైలాగ్ చిరుత సినిమాలోనిది.

8. “నీ టార్గెట్ టెన్స్ మైల్ అయితే ఏయిమ్ ఫర్ ది లెవంత్ మైల్… కొడితే దిమ్మ తిరిగిపోవాలా.. చల్” బిజినెస్ మ్యాన్ చిత్రంలోని ఈ డైలాగ్ చాలా ఫవర్ ఫుల్ అనిపిస్తుంది.

9. “ఎప్పుడొచ్చామని కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా”, “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” పోకిరి సినిమాలోని ఈ డైలాగ్ కు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు.

10. “సినిమా హిట్ అయింది సినిమా తీయడం మానేస్తామా.. సినిమా ఫ్లాప్ అయింది సినిమాను వదిలేసి వెళ్లిపోతామా” నేనింతే సినిమాలో చివర్లో వచ్చే డైలాగ్ ప్రతీ సినిమా ప్రేమికుడి హృదయాన్ని తాకే డైలాగ్.

“హమ్ జహాన్ ఖడే హో జాతే హైం, లైన్ వహిం సే షురు హో జాతి హై” (నేను ఎక్కడ నిలబడితే అక్కడ లైన్ మొదలవుతుంది) వంటి డైలాగ్స్ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్త ఆలోచనలను రగిలిస్తాయి.