Devara Movie Review
దేవర మూవీ రివ్యూ
ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. యువదసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన దేవర పార్ట్ 1 ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్, పాటలు, ప్రచార చిత్రాలతో భారీ అంచనాలు పెంచారు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కళ్యాణ్ రామ్ ప్రజెంట్స్ చేసిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్ వంటి భారీ తారాగణం ఉన్నారు. ఇక ఎన్టీఆర్ సైతం ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ మన ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
రత్నగిరి ప్రాంతంలోని ఓ కొండపై నాలుగు ఊళ్లు కలిపుకొని ఎర్రసముద్రం అనే ప్రాంతంలో కొన్ని కుటుంబాలు నివసిస్తుంటాయి. దేశానికి స్వతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వాళ్లను తరమికొట్టిన వంశాలకు చెందిన వారసులే వారంత. నాలుగు ఊర్లలో ఒక ఊరి పెద్దగా దేవర(ఎన్టీఆర్), భైర(సైఫ్ అలీఖాన్), శ్రీకాంత్ మరో ఊరికి పెద్దగా ఉంటారు. వీరి ధైర్యాన్ని ఉపయోగించుకొని కొంత మంది ప్రముఖులు సముద్ర మార్గం నుంచి వచ్చే షిప్ నుంచి స్మగ్లింగ్ చేయమని చెప్తారు. అలా జీవినం సాగిస్తున్న దేవర గ్యాంగ్, వారు చేసే పని ఎలాంటిదో తెలిసిన తరువాత ఇకపై స్మగ్లింగ్ చేయకూడదని దేవర నిర్ణయం తీసుకుంటాడు. కానీ భైరతో కలిపి కొంతమంది దేవర మాట లెక్క చేయరు. మళ్లీ స్మగ్లింగ్ చేయడానికి వెళ్తారు. దాంతో దేవర ఆగ్రహంతో వారిని తరిమి కొడుతాడు. కేవలం చేపలు పట్టడానికి మాత్రమే సముద్రం ఎక్కాలి అని నియమం పెడుతారు. దాంతో దేవరను అడ్డు తొలగించుకోవాలని భైర, అతని అనుచరులతో కలిసి పథకం వేస్తాడు. స్మగ్లింగ్ ఆగిందా? భైరా ప్లాన్ ఏంటి? దేవర కనిపించకుండ పోవడం వెనుక ఎవరు ఉన్నారు? వీరా పాత్ర ఏంటి? తంగాగా యాక్ట్ చేసిన జాన్వీ కపూర్ పాత్ర ఏంటో తెలియాలంటే దేవర చిత్రం చూడాల్సిందే.
విశ్లేషణ:
ఎర్రసముద్రంలో ఒక షిప్ వస్తుంది. దానిలో ముఖ్య సమాన్లను స్మగ్లింగ్ చేయాలని అని పోలీస్ ఆపరేషన్ పనిమీద అజయ్ మఫ్టీలో రత్నగిరి ప్రాంతానకి వెళుతాడు. అక్కడ సంగప్ప పాత్రలో ప్రకాశ్ రాజ్ దేవర కథ గురించి చెప్పడం మొదలు పెడుతాడు. ఎర్ర సముద్రం అనే పేరు ఎలా వచ్చింది. దాన్ని చుట్టు నాలుగు ఊర్ల కథ, వారి సాంప్రదాయాలను చెబుతూ.. దేవర, భైర, శ్రీకాంత్ ఇంకా కొంత మంది అనుచరులు స్మగ్లింగ్ చేేసే విధానం గురించి చెప్తాడు. అలా మొదలైన కథ ఫస్ట్ ఆఫ్ అంతా ఎర్రసముద్రం ఊరు, వారి సమస్యల చుట్టూనే తిరుగుతుంది. వీరి సాంప్రదాయమైన ఆయుధ పూజ, ఆయుధాలు కావాలంటే ఊరి ఇద్దరిని ఓడించాలి లాంటి కాన్సెప్ట్ బాగుంది. దేవరకు రియలైజేషన్ వచ్చిన తరువాత ఈ పని ఆపేద్దామంటే తన అనుచరులు సపోర్ట్ చేయకపోవడంతో రెండు వర్గాల విడిపోతారు. అయినా కానీ వారు సముద్రంలో స్మగ్లింగ్ చేయలేరు. ఎలాగైనా దేవరను మట్టుబెట్టాలి అని ప్లాన్ చేస్తారు. ఇంత వరకు ఫస్ట్ హాఫ్ సాగుతుంది.
ఇక సెకండ్ ఆఫ్ లో వర పాత్ర, తంగ పాత్రలు పరిచయం అవుతాయి. తండ్రి పోలికలతో పుట్టిన వర తండ్రికి తగ్గ తనయుడు కాదని అందరూ అనుకుంటారు. వర ఒక భయస్తుడిలా కనిపిస్తాడు. నిజానికి ఆయన భయస్తుడా? వారినే భయపెట్టే వీరుడా అనేది సెకండ్ ప్రీ క్లైమ్యాక్స్ లో తెలిసిపోతుంది. ముఖ్యంగా సినిమాలో బలమైన సీన్లు ఉన్నప్పటికీ పెద్దగా ఎమోషన్లు పండలేదు. హీరో ఎలివేషన్స్ కూడా కుదరలేదు. దాంతో సెకండ్ ఆఫ్ కాస్త తేలిపోయింది. ఇక ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సీన్లు బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తాయి. అభిమానులకు కన్నుల పండుగా అనే సీన్స్ కొన్ని ఉన్నాయి. శ్రీకాంత్ చెల్లెలు పెళ్లప్పడు ఎన్టీఆర్ వేసే డ్యాన్స్ బాగుంది. ఇక సెకండ్ పార్ట్ కోసం చివర్లో లీడ్ ఇవ్వడం కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
నటీనటులు:
ఎన్టీఆర్ నటన గురంచి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది. రెండు భిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన జీవించారు. ఆయన నటన చాలా ఇంటెన్సీవ్ గా ఉంటుంది. ఇక భైరగా యాక్ట్ చేసిన సైఫ్ అలీఖాన్ యాక్టింగ్ కూడా బాగుంది. పూర్తి స్థాయిలో ఆయన విలనిజాన్ని చూపించలేదు. రెండో పార్టులో ఆయన పాత్ర పూర్తిగా చూపిస్తారేమో. జాన్వీ పాత్ర ఉన్నది తక్కవే తన అందంతో ఆకట్టుకుంది. శ్రీకంత్, ప్రకాశ్ రాజ్ పాత్రలు మెప్పిస్తాయి.
సాంకేతిక అంశాలు:
సినిమాలో రైటింగ్ చాలా బాగుంది. కానీ కొరటాల శివ నుంచి ఇలాంటి డైరెక్షన్ కాదు ప్రేక్షకులు కోరుకునేది. ఆయన రెగ్యూలర్ సినిమాల అనిపించింది. వైవిధ్యం కనిపించలేదు. అనిరుధ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది. కానీ కొన్ని చోట్ల పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
హీరో యాక్టింగ్
నేపథ్యం
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
ఊహించే సీన్లు
ఎమోషన్లు బలంగా లేవు
ల్యాగ్ ఉండడం
అంతిమ తీర్పు: ఎన్టీఆర్ అభిమానులను మెప్పించే సినిమా
Cast And Crew
Movie Title : Devara
Banners: Nandamuri Taraka Ramarao Arts, Yuvasudha Arts
Release Date : 27-09-2024
Censor Rating : “U/A”
Cast : Jr NTR, Saif Ali Khan, Janhvi Kapoor, Prakash Raj, Srikanth, Shine Tom Chacko
Director : Koratala Shiva
Music: Anirudh Ravichander
Cinematography : Rathnavelu ISC
Editor: Sreekar Prasad
Producer: Sudhakar Mikkilineni, Kosaraju Harikrishna
Runtime : 180 minutes