Reading Time: 2 mins

Nagarjuna Shiva Movie Facts
నాగార్జున శివ సినిమా ప్రత్యేకతలు

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా నేటికీ 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 5, 1989లో విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక సంచలనం. కేవలం 75 లక్షల వ్యయంతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన శివ సినిమాతో రాంగోపాల్ వర్మ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో స్టడికామ్ ను తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే రీ రికార్డింగ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ విషయంలో ఒక ప్రత్యేకతను తీసుకొచ్చారు. అప్పటి వరకు ఫైట్స్ జరుగుతున్నప్పుడు వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ వేరు, శివ సినిమాలో వేరు. అలా కొత్త ప్రయోగాన్ని పరిచయం చేశారు. ఇక లైటింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నారు.

ఆర్జీవి తండ్రి సౌండ్ ఇంజనీరింగ్ గా పని చేసేవారు కాబట్టి రాంగోపాల్ వర్మకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. అలా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఒక సినిమా షూటింగ్ కు వెళ్లి మూవీ మేకింగ్ నేర్చుకున్నారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జునకు కథ చెప్పారు. అయితే మొదట నాగార్జునకు చెప్పిన కథ శివ కాదు, రాత్రి అనే సబ్జెక్టు చెప్పారు. అది నాగార్జునకు నచ్చకపోవడంతో ఆర్జీవి చదువుకునే రోజులలో జరిగిన రియల్ సంఘటనల ఆధారంగా శివ కథను రాసుకొని, నాగార్జునకు చెప్పారు. ఆ కథ నాగార్జునకి కొత్తగా అనిపించి వెంటనే ఓకే చేశారు. తెలుగులో ఈ చిత్రం ఓ సంచలనం. తెలుగు సినిమా చరిత్రలో బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ అన్నారు.

ఇక ఈ చిత్రం తెలుగులో 5 కేంద్రాలలో 175 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. అలాగే 25 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. అలాగే శివ సినిమాను 1990లో హిందీలో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో నాగార్జున, అమలతో పాటు తెలుగులో విలన్ గా చేసిన రఘువరన్ నటించారు. అలాగే తమిళ్ లో ఉదయమ్ అనే పేరుతో డబ్బింగ్ విడుదల చేశారు. అక్కడ సైతం మంచి విజయాన్ని నమోదు చేసింది. అంతే కాకుండా ఈ సినిమాకు మూడు నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ డెబ్యూ డైరెక్టర్, ఉత్తమ డైలాగ్ రైటర్ గా ఈ సినిమాకు అవార్డులు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో ఒక పాటలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా కనిపిస్తారు. చాలా వరకు ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే చిత్రీకరించారు. ఈ చిత్రం విడుదలై నేటికి 35 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఏదో ఒక విషయం మనల్ని అబ్బుర పరుస్తూనే ఉంటుంది.