Reading Time: 3 mins

Vettaiyan Movie Review
వెట్టయన్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే అందరికీ ఆసక్తే. అందులో జైభీమ్ లాంటి సినిమా తెరకెక్కించిన టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో అంటే ఆ ఆసక్తి రెట్టింపు అవుతుంది. పైగా అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటుడు, టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు అంటే సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇక ట్రైలర్ విడుదల అయిన తరువాత ఏదో మంచి పాయింట్ చెప్పబోతున్నారు అనే ఆలోచన మొదలైంది. వీటన్నింటికి తోడు మంజు వారియర్ డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో వెట్టయన్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇన్ని ఎక్స్ పెక్టేషన్స్ మీద విడుదలైన వెట్టయన్ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది చూద్దాం.

కథ:
అథియన్(రజనీకాంత్) కన్యకుమారి జిల్లాల ఎస్పీగా ఉంటారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్, ఆయనంటే డిపార్ట్ మెంట్ లో గౌరవం ఉంటుంది. తప్పు ఎవరు చేసిన ఉపేక్షించడు, చివరిక పోలీస్ అయినా సరే. అలాంటి సమయంలో చెన్నైలో శరణ్య అనే అమ్మాయి దారుణంగా రేప్ చేసి చంపబడుతుంది. శరణ్య, నదియన్ కు బాగా తెలిసిన అమ్మాయి. ఈ కేసులో ఒక గుణ అనే కుర్రాడు దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. తప్పని పరిస్థితుల్లో ఈ కేసును నదియన్ టేకప్ చేస్తాడు. అనుకున్న టైం కన్న ముందే గుణను కాల్చేస్తాడు. అతను నేరస్తుడు అని పోలీసులు ఎలా నిర్ధారిస్తారు, అతను అమాయకుడు కావొచ్చు కదా అని జడ్జీ అయిన సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) క్వశ్చన్ చేస్తాడు. దాంతో అథియన్ మళ్లీ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అక్కడ పోలీసులు వదిలేసిన లూప్ పాయింట్స్ చాలా ఉంటాయి. ఈ కేసులో చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ కేసులో న్యాట్ అకాడమీ ఫౌండర్ నట్రాజ్(రానా దగ్గుబాటి) ప్రమేయం ఉంటుంది. పలుకుబడి ఉన్న నట్రాజ్ ను, అథియన్ పట్టుకున్నాడా? లేదా? గుణాకు, శరణ్యకు ఉన్న సంబంధం ఏంటి? శరణ్య మరణాన్ని నదియన్ ఎందుకు సీరియస్ గా తీసుకున్నాడు? పోలీసుల చేతులో అమాయకులు బలి అవుతున్నారు అనే సత్యదేవ్ పాయింట్ కు ఆధారం ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే వెట్టయన్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
సినిమా మొదలవ్వడమే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మొదలౌతుంది. జడ్జ్ అయిన సత్యదేవ్ పోలీసుల సమావేశంలో బ్రీటిష్ వాడు మన దేశంలో అందరికీ సమానమైన విద్యా, నేరం చేస్తే సమానమైన శిక్ష విధించాడు. కానీ ఇప్పుడు అదే జరుగుతుందా.. పేదవాడి చదువు, ధనవంతుడు చదువు ఒక్క విధంగానే ఉందా, తప్పు చేస్తే ఉన్నవాడికి, లేనివాడికి ఒకే విధమైన శిక్ష ఉందా అంటూ ఆయన లేవనెత్తిన పాయింట్స్ ఆసక్తిగా ఉంటాయి. ఇక రజనీకాంత్ ఇంట్రడక్షన్ ఫైట్, పాట, నేరస్తులను కట్టడి చేయడంలో ఆయన చేసే ఫీట్స్ తో సినిమా అలా సాగుతుంది. ఆ తరువాత కథలో ఒక సబ్ ప్లాట్ స్టార్ట్ అవుతుంది అది కొద్దిసేపే ఉన్నా తరువాత ఏం జరగబోతుంది అనేది క్లారిటీ ఉండదు. ఎప్పుడైతే శరణ్య హత్య చేయబడుతుందో అప్పుడు అసలు కథ మొదలౌతుంది.

శరణ్యను గుణా చంపాడు అన్న కోణం నుంచి, ఎందుకు చంపాడు అనే ప్రాసెస్ లో గుణాకు, శరణ్యకు ఉన్న అసలు సంబంధం బయటపడుతుంది. అక్కడినుంచి సినిమా ఆసక్తిగా వెళ్తుంది అనుకుంటే మళ్లీ అందులో సబ్ ప్లాట్ తీసుకొచ్చారు. నిజానికి స్టూడెంట్స్ కు కోచింగ్ అనేది మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినా.. ఇన్విస్టిగేటింగ్ థ్రిల్లింగ్ గా సాగుతున్న సమయంలో ఈ పాయింట్ కాస్త పంటికింద రాయిలా అనిపిస్తుంది. కానీ ఆ పాయింట్ లాగితే అసలు నేరస్తుడు బయటకు వస్తాడు. ఈ పాయింట్ చెప్పడానికి సెకండ్ ఆఫ్ అంతా ల్యాగ్ అవసరం లేదు అనిపిస్తుంది. స్టార్ హీరో రజనీకాంత్ ఉన్నారు కాబట్టి కొన్ని ఎలివేషన్ సీన్లు, కమర్షియల్ సీన్లు పెట్టినట్లు అనిపిస్తుంది. మంచి పాయింటే కానీ చెప్పడంలో ఎక్కడో గాడీ తప్పింది అన్న ఫీలింగ్ వస్తుంది.

నటీనటులు:
రజనీకాంత్ యాక్టింగ్ గురించి చెప్పడానికి ఏం ఉంటుంది. ఆయన లెజెండ్ కానీ ఫైట్స్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. రానాను కొట్టే సీన్స్ అంతా కన్విన్సింగ్ గా అనిపించవు. అమితాబ్ బచ్చన్ చాలా సెటిల్డ్ గా చేశారు. చాలా మంచి పాత్ర. రానా యాక్టింగ్ చాలా బాగుంది. నెగిటీవ్ క్యారెక్టర్ చేయడంలో ఆయనకంటూ ఒక స్టైల్ అలవాటు చేసుకున్నారు అనిపిస్తుంది. మంజు వారియర్ ఉన్నంతలో మెప్పించింది. ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ మెప్పిస్తుంది. చాలా యాక్టీవ్ గా కనిపించారు. రీతూ సింగ్ సైతం తన యాక్టింగ్ తో మెప్పించింది. మిగితా నటీనటులందరూ బాగా చేశారు.

సాంకేతిక అంశాలు:
డైరెక్టర్ టీ.జే జ్ఞానవేల్ రాసుకున్న కథ చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది కానీ స్టార్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయాడేమో అనిపించింది. జై భీమ్ లాంటి సినిమా తీశాక అంతకు మించే ఊహిస్తాము. చెప్పాల్సిన పాయింట్ ను తిప్పి చెప్పాలనుకోవడం రుచించలేదు. అనిరుధ్ మ్యూజిక్ బాగుంది. కొన్ని సీన్లు ఉత్కంఠతను రేకెత్తించాయి. బీజీఎమ్, సాంగ్స్ బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పెద్దగా రిజిస్టర్ అవలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంది.

ప్లస్ పాయింట్స్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్ యాక్టింగ్
కథ
సంగీతం

మైనస్ పాయింట్స్
కథనం
ఎడిటింగ్
సెకండ్ ఆఫ్ ల్యాగ్

అంతిమ తీర్పు
రజనీకాంత్ కోసం చూడొచ్చు.. కథ బాగుంది.. కథనం స్లో అయింది.

Movie Title : Vettaiyan The Hunter
Banner: Lyca Productions
Cast: Rajinikanth, Amitabh Bachchan, Fahadh Faasil, Rana Daggubati, Manju Warrier
Relese Date : 10-10-2024
Censor Rating : “U/A”
Writer & Director: T.J. Gnanavel
Music: Anirudh Ravichander
Cinematography: S.R. Kathir I.S.C
Editor: Philomin Raj
Producer : Subaskaran Allirajah
Nizam Distributor : Global Cinemas LLP
Runtime : 163 minutes