Reading Time: < 1 min

Viswam Movie Gunguru Song Launched

విశ్వం మూవీ గుంగురు పాట విడుదల

 

మాచో స్టార్ గోపీచంద్, కావ్యా థాపర్, శ్రీను వైట్ల, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ ‘విశ్వం’ నుంచి భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన అదిరిపోయే మాస్ సాంగ్ గుంగురు గుంగురు రిలీజ్

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’ దసరా కానుకగా అక్టోబర్ 11న  గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినియా టీజర్, ట్రైలర్. సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని మరింతగా పెంచాయి.

మేకర్స్ ఈ రోజు గుంగురు గుంగురు సాంగ్ ని రిలీజ్ చేశారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో మాస్ బీట్స్ తో పెర్ఫెక్ట్ ఫెస్టివల్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ సాంగ్ అదిరిపోయింది.

సురేష్ గంగుల రాసిన మ్యాసీ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. భీమ్స్ సిసిరోలియో, ‘మాయిపిలో’ రోహిణి సోరట్ తమ ఎనర్జిటిక్  వోకల్స్ తో అదరగొట్టారు.

ఈ సాంగ్ లో గోపీచంద్, కావ్యా థాపర్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు. వైబ్రెంట్ సెట్స్ లో షూట్ చేసిన ఈ సాంగ్ లోని విజువల్స్ గ్రాండ్ గా వున్నాయి. థియేటర్స్ లో ఈ సాంగ్ పండగలా వుండబోతోంది.

ఈ చిత్రానికి కెవి గుహన్ టాప్ క్లాస్ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. ఎడిటర్‌ గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మన్నె పని చేస్తున్నారు,.

నటీనటులు :

మాచో స్టార్’ గోపీచంద్, కావ్య థాపర్, వెన్నెల కిషోర్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది :

దర్శకత్వం: శ్రీను వైట్ల
సమర్పణ: దోనేపూడి చక్రపాణి
నిర్మాతలు: TG విశ్వ ప్రసాద్ & వేణు దోనేపూడి
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్
డీవోపీ: K V గుహన్
సంగీతం: చైతన్ భరద్వాజ్