Reading Time: 2 mins

Sai Dharam Tej Birthday Special
సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు స్పెషల్

మెగా మేనల్లుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఫస్ట్ ప్రకటించిన చిత్రం రేయ్ అయినప్పటికీ విడుదలైన చిత్రం మాత్రం పిల్లా నువ్వు లేని జీవితం. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు విజయదుర్గ తనయుడు సాయి ధరమ్ తేజ్. ఆక్టోబర్ 15, 1987లో జన్మించిన ఈయన చదువులో యావరేజ్ స్టూడెంట్. చిన్నప్పటి నుంచి ఇంట్లో సినిమా వాతావరణం ఉండేది , దీంతో అందరిలానే సినిమాలకు రావాలనే కోరిక కానీ, పెద మామయ్య అయిన చిరంజీవితో చెప్పడానికి భయం. నాగబాబుతో మంతనాలు జరిపి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అలా 2013లో వై.వి.ఎస్ చౌదరి నిర్మాణదర్శకత్వంలో రేయ్ సినిమాను ప్రకటించారు.

అదే సమయంలో గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా పిల్లా నువ్వులేని జీవితం సినిమాను మొదలుపెట్టారు. ఎ. ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2014లో విడుదలైంది. మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత 2015లో రేయ్ చిత్రం విడుదలైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో సుభ్రమణ్యం ఫర్ సేల్ సినిమా వచ్చింది. ఈ మూవీతో సాయి ధరమ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది. ఇక వరుసగా సుప్రిమ్, తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటలిజెంట్ వంటి సినిమాలు తీశారు కానీ కమర్షిల్ గా పెద్ద సక్సెస్ కాలేదు. కొంచె రూట్ మార్చుకున్న ఈయన మారుతితో ప్రతిరోజు పండుగే అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. సినిమా డిసెంట్ హిట్ అయింది.

ఆ తరువాత చిత్రలహరి, సోలోబ్రతుకే సో బెట్టర్, రిపబ్లిక్ వంటి మూవీస్ తీశారు. రిపబ్లిక్ చిత్రం విడుదల కావడానికి ముందే సాయి ధరమ్ తేజ్ ఓ పెద్ద ప్రమాదానికి గురయ్యారు. ఆక్సిడెంట్ నుంచి కోలుకోవడానికి టైమ్ పట్టింది. ఆ తరువాత విరూపాక్ష చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మొన్నటి ఎన్నికల్లో సైతం చాలా హుషారుగా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన కెరీర్ పై ఫోకస్ చేస్తున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మరిన్ని విజయవంతమైన చిత్రాలతో వెండితెరపై వెలగాలని బిజినెస్ ఆఫ్ టాలీవడ్ తరఫున సాయి ధరమ్ తేజ్ బర్త్ డే విషేస్ అందిస్తున్నాము.