Reading Time: 4 mins

Movies with Diwali Celebrations
సినిమాల్లో దీపావళి స్పెషల్

దీపావళి పండుగ ఎంతో ప్రత్యేకం. దీపపు కాంతులతో ఇళ్లంతా అలంకరించి కుటుంబ సమేతంగా ఆ పర్వదినాన్ని వేడుక చేసుకుంటాము. అంతే కాకుండా పిల్లల నుంచి పెద్దల వరకూ కాకరపూవొత్తులు వెలిగిస్తూ ఆనందహేళతో గోల చేస్తారు. ప్రతీ ఇళ్లు, ముంగిళ్లు దీపాల కాంతులతో అలలారుతుంది. అందుకే దీన్ని దీపాల పండుగ అంటారు. అయితే దేన్నైనా కళాత్మకంగా చూపించే మన రచయితలు, దర్శకులు ఈ పండుగను తెరపై ఎలా చూపించారో చాలా సినిమాల్లో చూశాం. హస్యం, ఎమోషనల్, ఆనందాన్ని పాటల రూపంలో, సీన్స్ రూపంలోనే చీత్రికరించి ప్రేక్షకులకు అందించారు. దీపావళి పండుగ ప్రస్తావన ఉన్న సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దాం.

మూవీ టైటిల్స్
1. దీపావళి
నరకాసురున్ని వధించే ఘట్టాన్ని దీపావళి పేరుతో ఎస్ రజనీకాంత్ తెరకెక్కించారు. 1960లో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీ కృష్ణుడి పాత్రలో నటించారు. శ్రీ కృష్ణుడిగా ఆయనకు ఇది మూడో సినిమా. సత్యభామ పాత్రలో సావిత్రి నటించగా, యస్వీ రంగారావు నరకసూరుడి పాత్రలో అలరించారు. ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. తెలుగులో విజయవంతం అవడంతో కన్నడలో నరకాసుర వధే అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో పద్యాలు, పాటలతో కలిపి మొత్తం 24 పాటలు ఉన్నాయి.

2. ఇంటింటా దీపావళి
ఇంటింటి దీపావళి 1990 లో విడుదలైంది. పి. లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, సురేష్, వైజయంతి, విజయ లలిత తదితరలు నటించారు. ఈ మూవీకి శివశంకర్ సంగీతం అందించారు.

3. దీపావళి
వేణు తొట్టెంపూడి హీరోగా, ఆర్తీ ఆగర్వాల్, మేఘ నాయర్ హీరోయిన్లుగా నటించారు. 2008 న విడుదలైన ఈ చిత్రాన్ని ఎ.ఎ.ఎ.క్రియేషన్స్‌ బ్యానర్ పై తీగల కృష్ణారెడ్డి నిర్మించారు. హరిబాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని సమకూర్చారు.

మూవీ సాంగ్స్
1. షావుకారు
ఎల్.వి ప్రసాద్ దర్శకత్వం వహించిన షావుకారు చిత్రంలో షావుకారు జానకి, నందమూరి తారక రామారావు నటించారు. ఈ చిత్రంలో “దీపావళి దీపావళి దీపావళి దీపావళి ఇంటింట ఆనంద దీపావళి ఇంటింట ఆనంద దీపావళి”.. అనే పాట ఉంటుంది. “జిలుగుల వలువల అన్న తళుకు.. కుసున్న కునుకు..” అంటూ వీనుల విందుగా సాగుతుంది. ఇల్లంత దీపపు కాంతులతో కన్నులకు కూడా నిండైన పండుగ చూసినట్లు అనిపిస్తుంది.

2. ఇంటింటా దీపావళి
ఈ చిత్రంలో “ఇంటింటా దీపావళి” అనే పాట ఉంటుంది. “కిలకిల జీవితం సాగనీ.. సాగనీ హాయిగా.. తీయగా.. వలపులే వరదలై పొంగనీ.. చిలిపిగా.. నవ్వులే చిందనీ” అంటూ సాగుతుంది. పాట ఆద్యంతం ఎంతో రమనీయంగా ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం గొంతు చాలా మధురంగా ఉంటుంది.

3.మామగారు
దాసరి నారాయన రావు, వినోద్ కుమార్ నటించిన మామగారు చిత్రంలో “ఇయ్యలే అచ్చమైన దీపావళి, వెయ్యేళ్లు నిచ్చమైన దీపావళి” అంటూ పాట ఉంది.

4. సూర్యవంశం
వెంకటేష్, మీనా జతగా నటించిన సూర్యవంశం చిత్రంలో “చుక్కలన్ని ముగ్గలే.. పక్కుమన్న ముంగళి.. కళ్లముందు కదిలే” పాటలో దిపావళి పర్వదినం కనపిస్తుంది. ఇంటి నిండ దీపాల కాంతులతో వెలిగిపోతుంది.

5. రెబల్
ప్రభాస్ హీరోగా నటించినా రెబల్ చిత్రంలో “చెప్పలేని ఆనందం గుప్పుమంది గుండెలోనా”.. అనే పాటలో “ఎదపండే వెలుగల్లే తొలి దివాళి.. కలిసిందే నీలా దీపాళి.. దీపాళీ… దీపాళీ…” అంటూ సాంగ్ సాగుతుంది.

6. గాలోడు
సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు చిత్రంలో “నీ కళ్లే దీవాలి.. నీ నవ్వే రంగేలి నీ మాటే జోలాలి అవి నావైపోవాలి.. నువ్వు నేనైపోవాలి” అంటూ పాట అంటుంది. “నీ అందం జాబిల్లి… నీ స్నేహం చిరుజల్లి” అంటూ మంచి పదప్రయోగాలు ఉంటాయి. బీమ్స్ సిసిరొలే సంగీతాన్ని అందించారు.

బెస్ట్ సీన్స్

1. తొలిప్రేమ


పవన్ కల్యాణ్ హీరోగా, కీర్తి రెడ్డి హీరోయిన్ గా ఎ. కరుణాకరణ్ తెరకెక్కించిన సినిమా తొలిప్రేమ. 1998లో వచ్చిన ఈ చిత్రంతో పవన్ కల్యాణ్ యువతకు చేరువయ్యారు. ఈ మూవీ పేరు చెప్పగానే ఇప్పటికీ దీపావళి సీన్ గుర్తుకు వస్తుంది. హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్స్ లలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ తొలిప్రేమ సీన్ అని చెప్పవచ్చు. తెల్లారతే దీపావళి అనగా.. నాన్న తిట్టిన బాధలో హీరో ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా… దీనికి ఎందుకురా బాధ పడుతున్నారు.. మిమ్మల్ని మంచి మూడులో పెట్టనా అంటూ కారు దిగిన హీరోయిన్.. తన చిన్నపిల్ల ఫ్రెండ్స్ తో రోడ్డు మీద చిచ్చు బుడ్డిని కాల్చి.. ఆనందంగా చిందేస్తుంది. అప్పుడు వచ్చే మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ సీన్ ఇప్పటికీ, ఎప్పటికీ క్లాసిక్.

2. జనతా గ్యారేజ్


కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ లో దీపావళికి సంబంధించిన ఓ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. హీరో, హీరోయిన్ ల నడుమ ఇలాంటి సీన్ బహుశా ఏ సినిమాలో ఎవరు రాయలేదేమో. ముంబాయికి వచ్చిన నిత్యామీనాన్ దీపావళి పండుగనాడు సరదగా పటాసులు కాల్చుతుంటే.. అక్కడే నిల్చుని చూస్తున్న ఎన్టీఆర్ ను చూసి ఆడపిల్లకు సైట్ కొడుతున్నాడేమో అనుకుంటారు. హీరో దగ్గరకెళ్లి కొంచెం మాట్లాడొచ్చా అనగా… ఏంటీ నచ్చానా అని నిత్యమీనాన్ అంటుంది. దాంతో నచ్చలేదు.. పూర్తిగా నచ్చాలేదు.. దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ ఏ పోల్యూషన్ అండ్ సౌండ్ అని హీరో చెబుతాడు. దాంతో నిత్యామీనన్ షాక్ అవుతుంది. ఈ సీన్ ద్వారా దీపావళి అంటే ఏంటో చెప్పారు.

3. క్షేమంగా వెళ్లి లాభంగా రండి


తెలుగులో వచ్చిన కామెడీ ఫిలిమ్స్ లలో క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా ఒకటి. భార్యలను డామినేట్ చేయాలనే ఉద్దేశంతో, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, బ్రహ్మనందం చేసిన ఫర్ఫార్మెన్స్ చక్కిలిగింతలు పెడుతుంది. ఈ చిత్రంలో ఒక సీన్ లో దీపావళి పండుగ సీన్ ఉంటుంది. పండుగ రోజు టపాసులు తీసుకొచ్చిన బ్రహ్మనందం తన వైఫ్ క్యారెక్టర్ కొవై సరళ ను డామినేట్ చేస్తూ.. సిగరేట్ బదులు టపాకాయను నోట్టో పెట్టి వెలిగించమంటాడు. సరళ వద్దని ఎంత వారించిన వెలిగించి తీరాల్సింది స్టైల్ గా నోట్లో పెట్టుకొని వెలిగించుకుంటాడు. అది దడెల్ మని పేలుతుంది. ఈ సీన్ ఎప్పుడూ చూసినా నవ్వుతెప్పిస్తుంది.

4. పెళ్లి చేసుకుందాం.


వెంకటేష్, సౌందర్య, లైల నటించిన పెళ్లి చేసుకుందాం చిత్రంలో బ్రహ్మనందం పండించిన కామెడీ ఎంతో ప్రత్యేకం. తనకు నచ్చినప్పుడు పండుగలకు చేసుకునే క్యారెక్టర్ లో అందరినీ కడుపుబ్బ నవ్వించాడు. వీధిలో ఒక్క సారిగా దడెల్ మని శబ్దం రావడంతో అందరూ భయపడుకుంటూ బయటకు వస్తారు. చేతులో కాకరపూవత్తులు పట్టుకొని హప్పీ దీపావళి అంటూ అరుస్తుంటాడు. ఈ రోజు దీపావళి కాదు కదా అని అందరూ అంటున్నా.. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడే దీపావళి అంటూ వారిస్తాడు. దీపావళి నవంబర్ నెలలోనే ఎందుకు వస్తుంది. ఆ రోజు చేసుకొమ్మని నరకారసురునికి నాయనమ్మ చెప్పిందా అంటూ అందరి ప్రాణాలు తోడెస్తుంటాడు. అదే సమయంలో కళ్లు చిదంబర్ కింద రాకేట్ పేలి గాల్లో తేలి కింద పడిపోతాడు. ఈ సీన్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది.

5. రేసుగుర్రం


సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం చిత్రంలో కిల్ బిల్ పాండే ఫ్రస్టేషన్ ఎవరు మర్చిపోగలరు. స్పెషల్ ఆఫీసర్ గా బ్రహ్మనందం చేేసే హడావిడీ మాములుగా ఉండదు. శివారెడ్డిని ఆడుకునే విధానం అందరిని పడిపడి నవ్వించింది. శివారెడ్డి కంపెనీలపై రైడ్ చేస్తూ.. ఫైల్ తీసుకోవడానికి కిల్ బిల్ పాండే శివారెడ్డి ఇంటికి వెళ్తాడు. నువ్వా స్పెషల్ ఆఫీసర్ అని విలన్ అంటే.. నువ్వా శివారెడ్డి అంటూ హప్పీ దీవావళి అంటాడు. దానికి ఇంకా టైమ్ ఉంది కదా అనగానే.. నీకు కాస్త ఎర్లీగా స్టార్ట్ అవుతుంది అంటూ.. కట్ ఔట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ.. ఫ్రస్టేషన్ తో ఊగిపోతాడు. కామెడీ మాత్రం పీక్స్ లో ఉంటుంది. ఇంకా ఇలాంటి సీన్స్ మన తెలుగు సినిమాలో చాలానే ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే ఇవి.