Lucky Baskhar Movie Press Meet
లక్కీ భాస్కర్ మూవీ ప్రెస్ మీట్
దుల్కర్ సల్మాన్ సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ అని ప్రేక్షకులు నమ్ముతున్నారు. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకొని మంచి కంటెంట్ అందిస్తున్న ఈ మలయాళ హీరోకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీతారా ఎంటర్ టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాసై బ్యానర్లపై తెరకెక్కిన మరో వైవిధ్యమైన చిత్రం లక్కీ భాస్కర్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా, బ్యూటిఫుల్ మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా నటిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఒక రోజు ముందుగానే హైదరాబాద్ సహా మరికొన్ని ఏరియాల్లో ప్రీవ్యూ షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు.
సినిమా కంటెంట్ ను నమ్మి , ఈ కథకు దుల్కర్ సల్మాన్ అయితేనే కరెక్ట్ అని ముందు ఆయనకే కథ చెప్పినట్లు చెప్పారు. సినిమా బాగుంటే దాని విజయాన్ని ఎవరు ఆపలేరని దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయడం రిస్క్ అని తెలిసినా.. కంటెంట్ బాగుంది, ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నాగవంశీ పేర్కొన్నారు. ముందు హైదరాబాద్ లో 35 థియేటర్లలో ప్రీవ్యూస్ ప్లాన్ చేశామని కానీ స్క్రీన్స్ పెంచమని ఫొర్స్ రావడంతో 70కి పైగా స్క్రీన్స్ పెంచినట్లు చెప్పారు. ఈ సినిమా మొత్తం 150కి పైగా థియేటర్లలో ప్రదర్శన జరుగుతుందని వెల్లడించారు. ఇది బ్యాంకింగ్ సెక్టర్ బ్యాగ్ డ్రాఫ్ లో జరిగే కథ అని, బ్యాంకింగ్స్ లోని లూప్ హోల్స్ పట్టుకొని హీరో ఎలా రిచ్ అయ్యాడు అనేది తెరమీద చూస్తేనే బాగుంటందని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ప్రశ్న: ప్రతీ పండుగకు మీ బ్యానర్ లో సినిమా రావాలని ప్లాన్ చేసుకుంటారా?
నాగవంశీ: అలా అని ఏం లేదు. సినిమాలు చేస్తున్నాము, విడుదల తేదీలు అలా కుదురుతున్నాయి. ప్రతీ సినిమా మాదిరిగానే ఈ సినిమాకు కూడా పాజిటీవ్ వైబ్స్ వస్తున్నాయి. సినిమా మంచిగా ఆడితే కేవలం ప్రొడ్యూసర్ కే కాదు ఇండస్ట్రీకి కూడా మంచిదే.
ప్ర: ప్రీవ్యూ షోలు సినిమా ఫలితంపై నెగిటీవ్ ప్రభావం చూపుతుందన్న భయం లేదా?
నాగవంశీ: ప్రీవ్యూ షోలు వేయడం కొత్తేమి కాదు, అయితే కంటెంట్ నచ్చకపోతే సినిమాపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. కానీ లక్కీ భాస్కర్ విషయంలో మాత్రం అలా కాదు సబ్జెక్ట్ చాలా బాగుంది. ఇంకా పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది.
ప్ర: ప్రేక్షకులందరూ దీపావళి ఫెస్టివల్ మోడ్ లో ఉంటారు కదా? సినిమాపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది.
నాగవంశీ: దీపావళి పండుగకు చాలా మంది ఇంటి దగ్గర పూజ చేసుకుంటారు. మ్యాట్నీ వరకు షో లు కాస్త డల్ గానే ఉంటాయి. అందుకే ప్రీవ్యూలు వేస్తున్నాము.
ప్ర: వెంకట్ అట్లూరికే అవకాశాలు ఇవ్వడం వెనుక రహస్యం ఏంటి?
నాగవంశీ: రహస్యం ఏం లేదు. ఆయనతో వెవ్ లెంగ్త్ మ్యాచ్ అయింది. అంతే కాకుండా పరిశ్రమలో రిలేషన్ షిప్స్ ఎంతో ముఖ్యం ఈ విషయాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. వెంకట్ చెప్పిన కథ నచ్చింది కాబట్టే ముందుకెళ్లాము.
ప్ర: లక్కీ భాస్కర్ కథ చూస్తే బ్యాంకింగ్ సెక్టార్ కు సంబంధించి ఉంది? స్కామ్ ల గురించి ఏదైనా డిస్కస్ చేశారా కథలో?
నాగవంశీ: ఇది బ్యాంకింగ్ సెక్టార్ బ్యాగ్ డ్రాఫ్ మాత్రమే కానీ సినిమా మొత్తం అలా ఉండదు. ఇది థ్రిల్ కలిగించే ఫ్యామిలీ డ్రామా. కచ్చితంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా.
ప్ర: క సినిమాకు తమిళ్ లో థియేటర్లు దొరకలేదన్నారు.. మీకు ఆ సమస్య వచ్చిందా?
నాగవంశీ: థియేటర్ సమస్యలు మాకు రాలేదు. క సినిమా హిట్ అవడం కిరణ్ అబ్బవరంకు చాలా అవసరం. అందరి సినిమాలు హిట్ కావాలి.
ప్ర: సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా?
నాగవంశీ: కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే ఫైట్స్ ఉండవు కానీ హీరో ఫైట్ చేస్తే ఆడియన్ కు వచ్చే కిక్ ను లక్కీ భాస్కర్ లో చాలా సీన్లు ఇస్తాయి.
ప్ర: బాలయ్య, బాబీ సినిమా టైటిల్ ఎప్పుడు రిలీజ్
నాగవంశీ: త్వరలోనే రిలీజ్ ఉంటుంది. సీజీ వర్క్ పెండింగ్ లో ఉంది. మంచి బీజీఎం సీజీతో విడుదల చేస్తాము. టైటిల్ ఫిక్స్ అయింది.
లక్కీ భాస్కర్ సినిమా అందరికి కచ్చితంగా నచ్చుతుంది. ప్రతీ కామన్ ఆడియన్ భాస్కర్ లో తనను చూసుకుంటాడు అని అందరికి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.