Reading Time: 3 mins

Ka Movie Review
‘క’ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

దీపావళి కానుకగా కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా విడుదల అయింది. ఇలాంటి పాయింట్ తో సినిమా రాలేదు, అలా వచ్చి ఉంటే ఇకపై సినిమాలు తీయను అని కిరణ్ అబ్బరం ప్రతీ ప్రెస్ మీట్ లో చెప్పడం, ప్రీరిలీజ్ ఈవెంట్ తనపై ఇండస్ట్రిలో జరుగుతున్న చర్చను బయటపెట్టడం, ఎమోషనల్ గా మాట్లాడడంతో ప్రతీ ఆడియన్ కు ఆయన జర్నీపై ఓ సానుభూతి ఏర్పడింది. దీనికి తోడు ‘క’ ట్రైలర్ కూడా కొత్తగా ఉండడంతో సినిమాను ఒక సారి చూడాలన్న ఆసక్తి ఏర్పడింది. కిరణ్ అబ్బవరం సినిమాలు అంటే మినిమమ్ గ్యారెంటీ అనే టాక్ ఎప్పటినుంచో ఉండడం, ఈ సారి ట్రైలర్, ప్రచార చిత్రాలు బాగుండడంతో అందరిలో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ వారం థియేటర్లోకి వచ్చిన ‘క’ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ
వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) అనథా, గురునాథం(బలగం జయరామ్) నడిపిస్తున్న ఆశ్రమంలో పెరుగుతుంటాడు. ఎవరు లేని వాసుదేవ్ కు తనవాళ్లు ఎక్కడో ఒక చోట ఉన్నారు అనే నమ్మకంతో బతుకుతుంటాడు. అనుకోకుండా ఒక ఉత్తరం చదవి అందులో తన అమ్మను చూసుకుంటాడు. అలా ఉత్తరాలు చదవడం అలావాటు అవుతుంది. అనుకోకుండా గురునాథం ఉత్తరం చదవడంతో వాసుదేవ్ ను కోప్పడుతాడు. దాంతో చిన్నతనంలో గురునాథం తన కూతురు ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులను తీసుకొని ఆశ్రమం నుండి పారిపోతాడు. పెద్దయ్యాక కృష్ణగిరి అనే ఊరిలో పోస్ట్ మాస్టర్ రంగారావు(అచ్యుత్ కుమార్) దగ్గర కాంట్రాక్ట్ పోస్ట్ మెన్ గా ఉద్యోగం చేస్తుంటాడు. ఈ క్రమంలో రంగారావు కూతురు సత్యభామ(నయన్ సారిక)తో ప్రేమలో పడుతాడు. సాయంత్రం 3 గంటలకే చీకటి పడే ఆ ఊరిలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. అమ్మాయిల మిస్సింగ్ వెనుక అసలు కథ ఏంటి? దీనితో వాసుదేవ్ ఎలా కనెక్ట్ అయ్యాడు. సత్యభామతో తన ప్రేమ ఏమైంది? లాలా ఎవరు? తన్వీ రామ్ పాత్ర ఏంటి? అనేది తెరమీద చూడాల్సిందే.

విశ్లేషణ
క సినిమా లాంటి ఇంతవరకు రాలేదు అని ప్రమోషన్స్ లో కిరణ్ చెప్పిన విషయం నిజమే అనిపిస్తుంది. ఈ కథ కమర్షియల్ పాయింట్ తో చాలా కన్విక్షన్ తో చేసిన కథ. దీన్ని రెగ్యూలర్ ఫార్మెట్ లో కూడా చెప్పవచ్చు కానీ డైరెక్టర్స్ చెప్పిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. చివరి వరకు కథ చెప్పి క్లైమాక్స్ లో వావ్ అనిపించేలా ఈ కథను నెరేట్ చేశారు. సినిమా ప్రారంభం అవడమే వాసుదేవ్ ను కిడ్నాప్ చేసిన ఒక చీకటి గదిలో బందిస్తారు. ఆ తరువాత అతని గతాన్ని గురించి తెలుసుకుంటారు. గతం మరిచిపోయిన వాసుదేవ్ కు ఒక మిషన్ తిరగడంతో గుర్తుకొస్తుంటుంది. ఆ పక్కగదిలోనే రాధను కూడా బందిస్తారు. అసలు ఏం జరుగుతుందో కొంచెం కూడా గెస్ చేయలేయని స్థితికి తీసుకెళ్తారు డైరెక్టర్స్. అలా చిన్నతనం నుంచి హీరో గతాన్ని చెబుతూ ఇంటర్ మిషన్ లో ఓ భారీ షాకింగ్ ఎలిమెంట్ ను రివీల్ చేశారు.

ఇక సెకండ్ ఆఫ్ లో ఊరిలో అమ్మాయిలు తప్పిపోయే పాయింట్ ను టచ్ చేశారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హీరో చేసే ప్రయత్నం ఆసక్తిగా సాగుతుంది. ఇక హీరోయిన్ ప్రేమ విషయం తెలుసుకున్న రంగారావు తీసుకున్న డెసిషన్ కాస్త ఎమషనల్ గా ఉంటుంది. అలాగే సినిమాలో రాము అనే కుక్క పాత్ర కూడా కీలంగా ఉంటుంది. అలా ఒక లెటర్ చదవడంతో హీరోకు అసలు నిజం తెలవడం దాన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలనే ఆయన ప్రయత్నం బాగుంది. ఇక క్లైమాక్స్ వచ్చే సరికి సినిమా కమర్షియర్ ఫార్మెట్ నుంచి థ్రిల్లర్ జోనర్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్టింగ్ అందరిని వావ్ అనేలా చేస్తుంది. ఫ్యామిలితో హాయిగా చూడొచ్చు. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తాడు.

నటీనటులు
ఇది కిరణ్ అబ్బవరం వన్ మ్యాన్ షో. ఆయన యాక్టింగ్ మెప్పిస్తుంది. ఫైట్స్, డ్యాన్స్ కూడా బాగా చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లలో యాక్టింగ్ చాలా బాగుంది. సినిమాలో రెండు మూడు వేరియేషన్స్ ఉన్నాయి అన్నింటిని చక్కగా హాండిల్ చేశాడు. నయన్ సారిక క్యూట్ లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. తన పాత్రలో ఒదిగిపోయింది. తన్వీ రామ్ డీ గ్లామర్ పాత్రలో కనిపించింది. తనకు ఉన్నంతలో యాక్టింగ్ తో ఆకట్టుకుంది. బలగం జయరామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్ స్లే యాక్టింగ్ మెప్పిస్తుంది.

సాంకేతిక అంశాలు
డైరెక్టర్స్ సుజిత్-సందీప్ రైటింగ్, డైరెక్టర్ చాలా బాగుతుంది. చాలా గ్రిప్పింగ్ గా కథను డ్రైవ్ చేశారు. క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడిని ఒకే పాయింట్ మీద కూర్చోబెట్టి విజయం సాధించారు. మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ అందించారు. సినిమా విజవంతం అవడంలో బీజీఎం ముఖ్యభూమిక పోషించింది. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్
కథ
కథనం
యాక్టింగ్స్
ట్వీస్ట్
బీజీఎం

మైనస్ పాయింట్స్
అక్కడక్కడ కాస్త స్లో అవడం

అంతిమ తీర్పు
వావ్ అనిపించే యాక్షన్ థ్రిల్లర్

Movie Title : KA
Banner : Srichakraass Entertainments, KA Productions
Release Date : 31-10-2024
Censor Rating : “U/A”
Cast : Kiran Abbavaram, Nayan Sarika, Tanvi Ram
Story – Director : Sujith, Sandeep
Music : Sam CS
Cinmeatography : Viswas Daniel, Sateesh Reddy Masam
Editor : Sree Varaprasad
Producer : Chinta Gopalakrishna Reddy
Nizam Distributors:-Geetha Film Distributors
Runtime : 134 minutes