Movies Release Date Secret
సినిమా విడుదల తేదీ వెనుక ఇంత చర్చ ఉంటుందా
ఒక సినిమాకు విడుదల తేదీ ఎంతో ప్రాధాన్యం. కాలానికి తగ్గట్టు ఏ సినిమా ఎప్పుడూ రావాలి. ఏ సమయంలో సినిమా వస్తే జనాలు ఆదరిస్తారనే లెక్కలు ఉంటాయి. మాస్ సినిమాలు అన్ని పండుగలప్పుడు వస్తాయని, కాస్త క్లాస్ సినిమాలు, చిన్న, మధ్య తరహా సినిమాలు వీలు చూసుకొని రిలీజ్ డేట్స్ దొరికినప్పుడు వస్తాయని తెలుసు. ఈ మధ్య ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా విడుదల తేదీలను ఊరికే పెట్టేయకూడదు, కంటెంట్ ను బట్టి సరైన సమయంలో దింపితే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు. అంతే కాకుండా తండేల్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ ను ఏర్పాటు చేసి కొన్ని మాటలు చెప్పారు.
పండగలు వచ్చాయని అన్ని సినిమాలు విడుదల చేయకూడదు, పండుగలకు ఓ లెక్కలు ఉంటాయని అరవింద్ అన్నారు. అంతే కాదు ఒక సినిమాను విడుదల చేస్తున్నామంటే పోటీలో ఎక్కువ సినిమాలు లేకుండా చూసుకోవాలి. సినిమాను మొదటి వారంలోనే విడదలయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న, మధ్య తరహా ఉద్యోగుల దగ్గర ఆ సమయంలోనే డబ్బులు ఉంటాయని చెప్పారు. వీటితో పాటు స్టూడెంట్స్ ఎగ్జామ్స్, ప్రిపరేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని చిత్రాలను విడుదల చేయాలి. ఇవన్ని సినిమా విజయానికి కొంత భాగం తోడ్పడితే కంటెంట్ బాగుండాలి అప్పుడే కమర్షియల్ సక్సెస్ ఉంటుందని చెప్పారు. వీటన్నింటిని లెక్కలు వేసుకొని నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
అయితే ఫిబ్రవరి నెలలో గత పది సంవత్సరాలుగా ఎన్ని సినిమాలు విడుదల అయ్యాయి. అందులో మొదటి వారంలో ఎన్ని, నాలుగవ వారంలో ఎన్ని విడుదల అయ్యాయో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. 2023లో సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల అయింది. కంటెంట్ బాగుంది పాజిటీవ్ తెచ్చుకుంది. కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ఫిబ్రవరి 10న విడుదలయ్యింది. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వచ్చినా.. సెకండ్ వారంలో వచ్చినా.. ఏ సినిమా పోటీలో లేకున్నా.. కంటెంట్ నచ్చకపోవడంతో బ్యాడ్ రిజల్డ్ వచ్చింది. ఇక ధనుష్ నటించిన సార్ చిత్రం మూడవ వారం ఫిబ్రవరి 17న విడుదల అయింది. కంటెంట్ నచ్చింది పెద్ద విజయం సాధించింది.
అలాగే 2022లో రవితేజ నటించిన ఖిలాడీ రెండో వారంలో విడుదల అయింది. పెద్దగా ఆడలేదు దాని తరువాత రోజు చిన్న సినిమాగా విడుదలైన డీజే టిల్లు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. కంటెంట్ అలాంటిది మరి. ఫిబ్రవరి 25న విడుదలైన భీమ్లానాయక్ మంచి కలెక్షన్లను రాబట్టింది. అలాగే 2021లో ఫిబ్రవరి 5న జాంబిరెడ్డి, ఫిబ్రవరి 12న ఉప్పెన, ఫిబ్రవరి 19న నాంది సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. కంటెంట్ బాగుండడంతో మూడు వారాలు హిట్లు పడ్డాయి. కానీ చెక్ సినిమా నాలుగోవారం ఫిబ్రవరి 26న విడుదలయ్యింది. ఫలితం ఆశించినట్లు రాలేదు.
2020
సవారి – ఫిబ్రవరి 07 – ఫ్లాప్
జాను – ఫిబ్రవరి 07 – యావరేజ్
వరల్డ్ ఫేమస్ లవర్ – ఫిబ్రవరి 14 – ఫ్లాప్
హిట్ – ఫిబ్రవరి 28 – సూపర్ హిట్
2019
యాత్ర – ఫిబ్రవరి 08 – హిట్
ఎన్టీఆర్ మహానాయకుడు – ఫిబ్రవరి 22 – ఫ్లాప్
2018
ఛలో – ఫిబ్రవరి 08 – హిట్
టచ్ చేసి చూడు – ఫిబ్రవరి 02 – ఫ్లాప్
తొలిప్రేమ – ఫిబ్రవరి 10 – యావరేజ్
ఇంటిలిజెంట్ – ఫిబ్రవరి 09 – ఫ్లాప్
ఆ! – ఫిబ్రవరి 16 – హిట్
2017
నేను లోకల్ – ఫిబ్రవరి 03 – యావరేజ్
ఓం నమో వెంకటేశ – ఫిబ్రవరి 10 – యావరేజ్
ఘూజీ – ఫిబ్రవరి 17 – హిట్
విన్నర్ – ఫిబ్రవరి 24 – ఫ్లాప్
2016
స్పీడున్నోడు – ఫిబ్రవరి 05 – ఫ్లాప్
కృష్ణగాడి వీర ప్రేమ గాధ – ఫిబ్రవరి 12 – హిట్
క్షణం – ఫిబ్రవరి 26 – హిట్
2015
మళ్లీ మళ్లీ ఇది రానిరోజు – ఫిబ్రవరి 06 – హిట్
గడ్డం గ్యాంగ్ – ఫిబ్రవరి 06 – ఫ్లాప్
టెంపర్ – ఫిబ్రవరి 13 – సూపర్ హిట్
పిశాచి – ఫిబ్రవరి 27 – హిట్
2014
పైసా – ఫిబ్రవరి 27 – ఫ్లాప్
భీమవరం బుల్లోడ – ఫిబ్రవరి 27 – ఫ్లాప్
2013
ఒంగోలుగిత్త – ఫిబ్రవరి 1 – ఫ్లాప్
మిర్చి – ఫిబ్రవరి 08 – సూపర్ హిట్
ఈ పది సంవత్సరాల సినిమాలను గమనిస్తే ఫిబ్రవరి 7 వ తేదీన సవారి, జాను రెండు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. అంతే కాకుండా మొదటి వారంలో విడుదలైన అన్ని సినిమాలు హిట్లు కాలేదు, అలాగని ఫ్లాప్ లు కాలేదు. నాలుగవ వారంలో విడుదలైన సినిమాలు కూడా అన్ని ఫ్లాప్ లు కాలేదు హిట్లు కాలేదు. కంటెంట్ బాగున్న సినిమాలు హిట్లుగా నిలిచాయి. అయితే అల్లు అరవింద్ అన్నట్లు మొదటి వారంలో విడుదల అయితే చిన్న, మధ్యతరగతి వాళ్ల అకౌంట్లో డబ్బులు ఉంటాయి కాబట్టి సినిమాలు చూస్తారు. ఇది నిజమే కానీ టాక్ బాగుంటే మొదటి రోజు తరువాత కూడా సినిమాలు చూస్తారు. ఇన్ని సినిమాలు తీసిన ఆయన అనుభవంతో చెప్పిన మాటలో నిజం అయితే లేకపోలేదు. అందుకే నిర్మాతలందరూ విడుదల తేదీల పైన అంత శ్రద్దగా ఉంటారు. చూడాలి మరి అరవింద్ స్ట్రాటజీ ఎంతవరకు విజయం సాధిస్తుందో.