Reading Time: 2 mins

Dil Raju Dreams Website For Talent Hunt
యంగ్ జనరేషన్ కోసం దిల్ రాజు డ్రీమ్ వెబ్ సైట్

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆలోచనలు ఎప్పుడు కొత్త ఒరవడిలోనే ఉంటాయి అనడానికి తాజాగా ఆయన ప్రకటించిన మరో కొత్త ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. “దిల్ రాజు డ్రీమ్స్” అనే పేరుతో ఒక వెబ్ సైట్ ను లాంచ్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం చిన్న, పెద్ద సినిమాలతో చాలా బిజీ అయినట్లు, అందులో జనవరి 10న “గేమ్ ఛేంజర్” ప్రమోషన్స్, అలాగే సంక్రాంతి‌కి వెంకటేష్ అనీల్ రావిపూడి‌ల “సంక్రాంతికి వస్తున్నాం”, ఆ తరువాత శివరాత్రికి నితిన్ ‘తమ్ముడు’ విడుదలకు సంబంధించిన హడావిడీ ఉన్నట్లు చెప్పారు. వీటితో పాటు నితిన్ – వేణు‌లతో ఎల్లమ్మ, ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ హీరోగా మరో సినిమా ఉంటుందని పేర్కొన్నారు. ఆశిష్ సెల్ఫీష్ సినిమాకు దర్శకుడు సుకుమార్ పుష్ప2 బిజీవలన కాస్త బ్రేక్ ఇచ్చినట్లు, సుకుమార్ ఫ్రీ అవగానే సినిమా ముందుకెళ్తుందని చెప్పుకొచ్చారు. ఇంత బిజీ షెడ్యుల్ నడుమ మరో విషయాన్ని ప్రస్థావించారు.

ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన “జటాయి” పనులు కూడా జరుగుతున్నట్లు చెప్పారు. అలాగే నూతన తరం నటీనటులు, టెక్నిషన్స్ తో తనకు ఎప్పుడూ పని చేయాలని ఉంటుందని కానీ వారికి తన యాక్సెస్ అంత సులువు కాదని అందుకే ప్రత్యమ్నాయ మార్గాన్ని క్రియేట్ చేసినట్లు చెప్పారు. అదే దిల్ రాజు డ్రీమ్ వెబ్ సైట్ అని తెలిపారు. చాలా కాలంగా తన టీమ్ తో మాట్లాడి పక్కా ప్లానింగ్ తో తీసుకున్న నిర్ణయం అని వెల్లడించారు. ఈ వెబ్ సైట్ ద్వారా సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలకు అండగా ఉండడమే కాదు, కొత్త డైరెక్టర్లను, స్క్రిప్ట్ రైటర్లను, నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయవచ్చని చెప్పారు. ఒక సినిమా తీసి చేతులు కాల్చుకోవద్దని, సినిమాను ప్రమోట్ చేయడం నుంచి ప్రేక్షకుల వరకు చేరవేసే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు.

ఆయన పుట్టిన రోజు అయిన డిసెంబర్ 18 కానీ, కొత్త సంవత్సరం పురస్కరించుకోని కానీ ఈ వెబ్ సైట్ ను లాంఛ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వెబ్ సైట్ చాలా పారదర్శకంగా పనిచేస్తుందని, దీని ద్వారా సంవత్సారానికి 5 చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే కాస్ట్ అండ్ క్రూ కు సాలరీలు కూడా ఫ్రొఫెషనల్ గా ఇస్తామని చెప్పారు. 360 డిగ్రీస్ లో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.