Reading Time: 2 mins

సొంత సినిమాలను డైరెక్ట్ చేసుకున్న హీరోలు
Own Movies of Heroes Made Under Self Direction

టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి ఇండస్ట్రీలో నిలబడాలంటే అని చాలా మంది అంటుంటారు. ఇక హీరోలుగా నిలదొక్కుకోవాలంటే ఇంకెంత ప్రతిభ ఉండాలో అర్థం చేసుకోవాలి. నటన, డ్యాన్స్, ఫైట్స్ అంతే కాకుండా 24 క్రాఫ్ట్స్ మీద పట్టు ఉండాలి. చాలా మంది హీరోలు యాక్టింగ్ వస్తే చాలు అనుకుంటారు కానీ పాతతరం కథనాయకులు అలా కాదు అన్ని విభాగాల మీద గ్రిప్ తెచ్చుకునే వారు. ఈ తరం హీరోలు కూడా కొంత మంది అన్ని క్రాఫ్ట్స్ మీద పట్టు సాధిస్తున్నారు. అంతే కాకుండా కొన్ని సినిమాలను కూడా డైరెక్ట్ చేశారు. అలా తమ సినిమాలను తామే డైరెక్ట్ చేసుకున్న హీరోలు చాలా మందే ఉన్నారు.

పవన్ కళ్యాణ్

కమర్షియల్ హీరోగా కెరీర్ మొదలు పెట్టినా ప్రయోగాలు చేయడం, రిస్క్ లు చేయడం పవన్ కల్యాణ్ కు అలవాటు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రోజుల్లో కావచ్చు, మాస్ ఇమేజ్ ఉన్న రోజుల్లో కావచ్చు పవన్ కల్యాణ్ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అంతే కాకుండా కొత్తగా ఏదో సాధించాలన్న తపన కూడా ఉంది. అందుకే స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో జానీ సినిమాను తెరకెక్కించారు. జానీ చిత్రానికి హీరో తానే దర్శకుడు తానే. సినిమా కమర్షియల్ గా ఆడలేదు.

అడవి శేషు

తెలుగు ట్యాలెంటెడ్ హీరోల్లో అడవి శేషు ఒక్కరు. పంజ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన ఆయన ఆ తరువాత తనలోని రైటర్, డైరెక్టర్ కోణాన్ని పరిచయం చేశారు. కర్మ, కిస్ అనే రెండు సినిమాలకు ఆయనే దర్శకుడు హీరో. ఆ తరువాత కూడా స్క్రీన్ ప్లే రైటింగ్ చేశారు. అలా క్షణం, గూడాఛారి వంటి వినుత్నమైన చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

విశ్వక్ సేన్

యంగ్ అండ్ ట్యాలెండ్ హీరో విశ్వక్ సేన్ గురించి అందరికి తెలిసిందే. తెలుగులో ఆయనకు మాస్ కా దాస్ అనే ట్యాగ్ కూడా ఉంది. ఈ నగరానికి ఏమైంది సినిమాతో నటుడిగా పరిచయం అయి ఫలక్ నామ దాసు చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తరువాత దాస్ కా ధమ్కీ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి, రక్షిత్ శెట్టి

ఈ ముగ్గురు డైరెక్టర్లను కన్నడలో త్రిబుల్ ఆర్ అంటుంటారు. వీరు ముగ్గురు ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి సినిమా పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. రిషబ్ శెట్టి నటించిన కాంతార చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే హీరో, దర్శకుడు.
రాజ్ బి శెట్టి ”ఒండు మొట్టేయ కథ,” ”గరుడ గమన వృషభ వాహన” సినిమాలకు దర్శకత్వం వహించి, నటించారు. రక్షిత్ శెట్టి ‘ఉలిదవరు కందంతే’ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు రక్షిత్ శెట్టి, అలాగే సప్త సాగారాలు కూడా డైరెక్ట్ చేశారు.

మాధవన్

రోమాంటిక్ హీరో మాధవన్ యాక్టింగ్ అంటే చాలా మందికి నచ్చుతుంది. ఈయన కూడా ప్రయోగాలు చేస్తుంటారు. అలా రాకెట్రీ అనే సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ చిత్రంలో ఆయనే నటించి దర్శకత్వం వహించారు.