Reading Time: 2 mins

Rashi Khanna Birthday Special
రాశి ఖన్నా బర్త్ డే స్పెషల్

ఊహలు గుసగుసలాడే అంటూ కుర్ర కారు గుండెల్లో సందడి చేసి జిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా. తెలుగులో అతి కొద్దిమంది అందాల భామలలో రాశి ఖన్నా ముందు వరుసలో ఉంటుంది. సినిమా అంటే గ్లామర్ మాత్రమే ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి అని నిరూపించిన బ్యూటీ రాశి ఖన్నా. వెండితెరపై యాక్టింగ్ మాత్రమే కాదు తన మధురమైన గొంతుతో అద్భుతమైన పాటలు పాడగలదు, తన హోయలొలికే అందంతో అభిమానులను కట్టిపడేయడమే కాదు మెరుపు తీగలా నర్తించి ప్రేక్షకుల గుండెలకు తూట్లు పొడవ గలదు. అందమైన చక్రాల్లాంటి కళ్ళతో ప్రేక్షకుల హృదయాలను దోచడమే కాదు రమనీయమైన తన నవ్వుతో వీక్షకుల మనసు రంజింప చేయగలదు. విభిన్నమైన పాత్రలను ఎంచుకొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాశి ఖన్నా జన్మదినం సందర్భంగా ఆమె ఫిలిం జర్నీని ఒక్కసారి చూద్దాం.

రాశి ఖన్నా నవంబర్ 30 1990 న ఢిల్లీలో జన్మించారు. అక్కడే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. అందం, అభినయం, నటన, డాన్స్, పాటలు మాత్రమే కాదు చదువులో కూడా రాశి కన్నా టాపర్. అయితే తాను కాలేజీ చదివే రోజుల్లో సింగర్ కావాలని సంగీతాన్ని నేర్చుకున్నారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి నటిగా తెరంగేట్రం చేశారు. 2013లో పొలిటికల్ చిత్రం మద్రాస్ కేఫ్  మూవీలో ఒక పాత్రలో మొదటిసారి రాశి కన్నా కనిపించారు. ఆ సినిమాలో రాశి కన్నా నటన చూసి తెలుగు రైటర్, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల ఊహలు గుసగుసలాడే అనే సినిమా తెరకెక్కించారు. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ నటి ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ తన జోరును కొనసాగించింది.

ఆ తర్వాత జిల్ చిత్రంతో గోపీచంద్ సరసన మెప్పించింది. వరుసగా శివం, బెంగాల్ టైగర్, సుప్రీం, హైపర్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపత్రాభినయం చేసిన జై లవకుశ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత రాజా ది గ్రేట్, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాలను సొంతం చేసుకుంది. మారుతి తెరకెక్కించిన ప్రతిరోజు పండుగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అదే సమయంలో తమిళ, మలయాళ, చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. జోరు చిత్రంలో జోరు అనే పాటను మొదటిసారిగా ఆలపించింది. ఆ తర్వాత జవాన్ చిత్రంలో, ప్రతిరోజు పండుగ చిత్రంలో మరిన్ని చిత్రాలలో తన గానాన్ని వినిపించింది. తన నటనకు ఎన్నో అవార్డులు వరించాయి. వాటన్నింటి కన్న ముఖ్యంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈరోజు రాశిఖన్నా పుట్టినరోజు సందర్భంగా మరిన్ని చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.