Pushpa The Rule Interesting Facts
పుష్ప ది రూల్ ఆసక్తికరమైన అంశాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్ర పుష్ప ది రూల్. పుష్ప ది రైజ్ క్రియేట్ చేసిన హైప్ పుష్ప ది రూల్ పై ఎ విధంగా పడిందో డైలీ బజ్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సైతం సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేసింది. ఈ మూవీ కోసం బన్ని అభిమానులు మాత్రమే కాదు మూవీ లవర్స్ అంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో చాలా మంది కొత్త నటులు కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇదివరకే విడుదలైన ట్రైలర్ లో జగపతి బాబు కనిపించి ఆశ్చర్యపరిచారు. పుష్ప 2 చిత్రంలో జగపతి బాబు ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారన్న వార్త చాలా కాలాంగా చెక్కర్లు కొట్టింది. పుష్ప ది రూల్ ట్రైలర్ రిలీజ్ అవడంతో అది నిజమే అని తెలిసిపోయింది. “ఎవడ్రా వాడు.. డబ్బు అంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు..,” “ఇనిలో తెలియని బాధేదో ఉంది”. అంటూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. అతని టేబుల్ పై కోగటం వీర ప్రతాప్ అనే బోర్డు ఉంది. పక్కనే ఇండియన్ ఫ్లాగ్ ఉంది. వీటిని బట్టి ఏపీ సీఎం అయినా కావాలి, లేదా పుష్ప రేంజ్ పెరిగింది కాబట్టి పీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అంతేకాకుండా ఇనిలో తెలియని బాధేదో ఉంది అని చెప్పే డైలాగ్ ను బట్టి చూస్తే జగపతి బాబు క్యారెక్టర్ హీరోకు ఫేవర్ చేసేదై ఉంటుందనే భావన కలుగుతుంది. సుకుమార్ ఏదైనా పాత్ర డిజైన్ చేశాడు అంటే అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. జగపతి బాబు పాత్ర కచ్చితంగా ఏదో మ్యాజిక్ చేసేలా కనిపిస్తుంది. రంగస్థలం సినిమాలో వీరి కాంబినేషన్ చూశాము. మళ్లీ డిసెంబర్ 5న వీర ప్రతాప్ పాత్ర ఏంటో చూడాలి. ట్రైలర్ లో కనిపించని కొన్ని క్యారెక్టర్లు కూడా పుష్ప పార్ట్ 2 లో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రకాశ్ రాజ్ సైతం ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు అర్థం అవుతుంది. ఆయన పేరు మంగళం ప్రకాశ్ అని అతని వికిపీడియాలో కూడా పేర్కొన్నారు. అంటే మంగళం సీను రిలేటీవ్ అనేది అర్థం అవుతుంది. మరి పుష్ప ది రూల్ ఎలా ఉండబోతుంది. ఇంకేన్ని క్యారెక్టర్లు ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
అలాగే ట్రైలర్ లో అల్లు అర్జున్, రష్మిక మంధాన, ఫహాద్ ఫాజిల్, శ్రీలీల కంటే ఓ క్యారెక్టర్ అందరిలో ఆసక్తి రేపిది. మెడలో చెప్పుల దండ, బ్లాక్ కలర్ బ్లౌజ్, చెవులకు బుట్టాలు, పెద్ద బొట్టు, మిడిగుడ్లు, జుగుప్సకరమైన నవ్వుతో ఒక అరగుండు క్యారెక్టర్ కనిపించింది. దాంతో ఆ క్యారెక్టర్ ఎవరు అని సోషల్ మీడియాలో తెగ వెతికారు. ఆ క్యారెక్టర్ చేసిన నటుడి పేరు తారక్ పొన్నప్ప. కన్నడ నటుడు. కేజీఎఫ్ చిత్రంలో నటించారు. అలాగే ఎన్టీఆర్ దేవర సినిమాలో సైఫ్ అలీఖాన్ కొడుకు పాత్రలో కనిపించారు పొన్నప్ప. ఆయన కటౌట్, గెటప్ బట్టి చూస్తే ఏదో తప్పు చేస్తే శిక్షగా పుష్ప రాజ్ అలా చేసుంటాడు అనిపిస్తుంది. అంత అవమానంలో కూడా అలా వికృతంగా నవ్వుతున్నాడు అంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. బహుశా సినిమాను మలుపుతిప్పే క్యారెక్టరై ఉండొచ్చు. నిజమో కాదో తెలియాలంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి కాబట్టే పుష్ప ది రూల్ క్రేజ్ అంతలా ఉంది.