Pushpa 2 the Rule Music Director DSP Violin Hit Songs
దేవిశ్రీ ప్రసాద్ వాయిలెన్ సూపర్ హిట్స్ సాంగ్స్
దేవి చిత్రంతో మొదలైన ప్రసాద్ సంగీత ప్రయాణం నేటికి సూపర్ హిట్ సాంగ్ లా దూసుకెళ్తుంది. మొదటి సినిమా టైటిల్ నే తన పేరులో చేర్చుకొని దేవిశ్రీప్రసాద్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. యావత్తు సంగీత ప్రీయులను ఉర్రూతలూగిస్తూ రాక్ స్టార్ డీఎస్పీగా ప్రసిద్దిగాంచారు. వందకు పైగా తెలుగు చిత్రాలకు సంగీతాన్ని అందించి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ తన ఖాతాలో వేసుకున్నారు. సంగీతం అంటే ఎన్నో వాయిద్యాల శబ్ద సమ్మేళనం అని అందరికీ తెలిసిందే. అందులో ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ కు ఒక్కో అభిరుచి ఉంటుంది. వాళ్ల అభిరుచి తగ్గట్లుగానే పరికారాలను వాడుతూ శబ్దాన్ని పుట్టిస్తారు. ఇక దేవి కూడా రకరకాల పరికరాలను వాడుతూ ఇప్పటికీ అద్భుతమైన పాటలను అందిస్తున్నారు. అయితే ఆయన సంగీత ప్రవాహంలో వచ్చిన పాటలలో వాయిలెన్ పరికరాన్ని వాడి సూపర్ హిట్ అయినా సాంగ్స్ ఒకసారి చూద్దాం. డిఎస్పి కంపోజ్ చేసిన పాటలలో వాయిలెన్ మ్యూజిక్ ఉంటే ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతున్నాయి.
ఉదయించిన సూర్యుడినడిగా
ఉదయ్ కిరణ్, గజాల హీరోహీరోయిన్లుగా నటించిన కలుసుకోవాలని అనే చిత్రంలో ఉదయించిన సూర్యుడిని అడిగా, కనిపించని దేవుడినడిగా అనే పాటలో వాయిలెన్ మ్యూజిక్ ను అద్భుతంగా వాడారు. ఈ పాట మొత్తం రైయిన్ ఎఫెక్ట్ లో ఉంటుంది. మధ్యలో బీజీఎంలలో వాయిలెన్ మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉంటుంది. ఈ సాంగ్ ను దేవిశ్రీ ప్రసాద్ రచించి పాడారు. అప్పట్లో ఈ పాట చాలా పెద్ద హిట్ అయింది.
నీటి ముల్లై.. నన్ను గిల్లీ
ప్రభాస్, త్రిషా జంటగా నటించిన వర్షం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మ్యాజిక్ కూడా అంతే పెద్ద హిట్ అయింది. అన్ని సాంగ్స్ అద్భతంగా ఉంటాయి. ఈ సినిమాలో నీటి ముల్లై నన్ను గిల్లీ అనే సాంగ్ లో వాయిలెన్ అద్భుతంగా ఉపయోగించారు డీఎస్పీ. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్, సుమంగళి ఆలపించారు.
అటు నువ్వే ఇటు నువ్వే
సుశాంత్, స్నేహ ఉల్లాల్ జంటగా నటించిన కరెంట్ చిత్రంలో అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. అందులో అటు నువ్వే ఇటు నువ్వే అనే పాట ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలో వాయిలెన్ మ్యూజిక్ సంగీత ప్రియుల గుండెను తాకుతుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను నేహా, బాసిన్ ఇద్దరు ఆలపించారు.
డార్లింగే ఒసినా డార్లింగే
ప్రభాస్, అనుష్క నటించిన మిర్చి సినిమాలో డార్లింగే ఒసినా డార్లింగే అనే పాటలో వాయిలెన్ సౌండ్ వాడి హట్ కొట్టారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను గీతా మాధురితో కలిపి ఆయనే స్వయంగా పాడారు.
వాయిలెన్ సాంగ్
అల్లు అర్జున్, అమలాపాల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో వాయిలెన్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది.
నాన్నకు ప్రేమతో
ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రంలో టైటిల్ సాంగ్ ఏ కష్టమెదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందనమనే ఉయ్యాలలో నను పెంచినా నాన్నకు ప్రేమతో సాంగ్ లో వాయిలెన్ వాడి అందరి హృదయాలను కొల్లగొట్టాడు. ఈ సాంగ్ కూడా చాలా పెద్ద విజయం సాధించింది.
నువ్వే నవ్వేలే
బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రత్ సింగ్, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన చిత్రం జయజానకి నాయక. ఈ చిత్రంలో నువ్వేలే నువ్వేలే అనే పాటలో వాయిలెన్ సౌండ్ వాడారు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. ఈ పాటను చంద్రబోస్ రచించారు.
బుజ్జితల్లి
నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న తండేల్ చిత్రంలో బుజ్జితల్లి అనే పాటకు వాయిలెన్ మ్యూజిక్ వాడారు దేవిశ్రీ ప్రసాద్. శ్రీ మణి రాసిన ఈ లిరిక్స్ ను జావెద్ అలి అద్భుతంగా పాడారు.