Producer Bellamkonda Suresh Completed 25 Years As A Producer
స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ నిర్మాతగా 25 ఏళ్ళు పూర్తి
ఇండస్ట్రీలో నిర్మాతగా 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను: స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్
‘నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేసిన 25 ఏళ్ళు అయ్యింది. ఇండస్ట్రీలో నిర్మాతగా 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది వండర్ ఫుల్ జర్నీ. ఇది నాకు 57వ బర్త్ డే. 2015 లో గంగ రిలీజై సూపర్ హిట్ అయ్యింది. తర్వాత సినిమా చేయలేదు. మళ్ళీ ఏప్రిల్ నుంచి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాను”అన్నారు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్.
నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు బెల్లంకొండ సురేష్. అలాగే గురువారం (డిసెంబర్ 5) ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా విలేకరులు సమావేశంలో తన సినీ జర్నీ గురించి, చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి పనులు విశేషాల్ని పంచుకున్నారు.
నిర్మాతగా 25 ఏళ్ళు జర్నీ ఎలా అనుభూతిని ఇచ్చింది ?
– ఇది వండర్ ఫుల్ జర్నీ. 25 ఏళ్లలో 38 సినిమాలు చేశాను. ఈ జర్నీ పట్ల చాలా హ్యాపీగా వున్నాను. కీర్తి ప్రతిష్టలు ఇండస్ట్రీలోనే సంపాదించుకున్నాను.
-శ్రీహరి గారితో సాంబయ్య సినిమాతో సక్సెస్ ఫుల్ గా జర్నీ స్టార్ట్ చేశాను. ఆ సినిమా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీహరి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధకరంగా వుంది. తన మంచి నటుడే కాదు గొప్ప వ్యక్తి.
ఈ బర్త్ డే స్పెషల్ ఏమిటి ?
-ఏప్రిల్ నుంచి మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మా అబ్బాయితో స్టార్ట్ చేస్తున్నాను.
9ఏళ్లు గ్యాప్ రావడానికి కారణం ?
-పిల్లలు బయట సినిమాలు చేస్తున్నారు. అందుకే గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. పెద్ద అబ్బాయి కెరీర్ సెట్ అయ్యింది. చిన్నబ్బాయి సెట్ చేసుకుంటున్నాడు. రెండు మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. వాటితో తను కూడా సెట్ అయిపోతాడు. ఏప్రిల్ లో ఇద్దరి అబ్బాయిలు ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. త్వరలోనే ఆ ప్రాజెక్ట్స్ గురించి పూర్తి వివరాలు చెబుతాను.
-పెద్ద అబ్బాయి శ్రీనివాస్ ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. టైసన్ నాయుడు, సాహూతో సినిమాలు జరుగుతున్నాయి. గరుడన్ కి రిమేక్ గా చేస్తున్న సినిమా క్రిస్మస్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కోడిరామకృష్ణ గారి అల్లుడు నిర్మాణంలో చేస్తున్న సినిమా మ్యాసీవ్ బడ్జెట్ ఫిల్మ్. దానికి చాలా సీజీ వర్క్ వుంటుంది. అది చాలా పెద్ద సినిమా. చాలా ఓపికగా చేస్తున్నారు.
తొమ్మిదేళ్ళు గ్యాప్ తీసుకున్నారు కదా.. ప్రొడక్షన్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి ?
– నేను ప్రొడక్షన్ లోనే వున్నాను. హిందీ ఛత్రపతి నేనే ఎక్జిక్యూట్ చేసి ఇచ్చాను. ప్రొడక్షన్ లో అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి.
మీకు అగ్ర నిర్మాత అనే పేరు తీసుకొచ్చిన సినిమా ఆది. మళ్ళీ ఎన్టీఆర్ తో కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందా ?
-అది మన చేతిలో లేదు కదా. అన్ని సెట్ అవ్వాలి. నేను అందరితో టచ్ లో వున్నాను. వినాయక్ తో డైలీ మాట్లాడుతుంటాను. లాగే పూరి జగన్నాథ్ అంటే నాకు చాలా ఇష్టం.
నా అటో గ్రాఫ్ రీరిలీజ్ చేస్తామని గతంలో చెప్పారు ?
-4కే లో రెడీ చేశాను. నెక్స్ట్ రవితేజ బర్త్ డే కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నాఅటో గ్రాఫ్ అద్భుతమైన సినిమా. అందులో పాటలన్నీ ఎవర్ గ్రీన్.
చెన్నకేశవ రెడ్డి రీరిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?
-మేము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్, రెవెన్యూ వచ్చింది. మళ్ళీ బాలయ్య బాబుతో వందశాతం సినిమా చేస్తాను.
కథ నచ్చిన తర్వాత మీరు బోయపాటి గారికి బ్లాంక్ చెక్ ఇచ్చారని విన్నాం ?
-లేదండి. బోయపాటి గారు ప్రేమతో వచ్చి నాకు సినిమా చేస్తానని చెప్పారు. రెమ్యునిరేషన్ తగ్గించుకొని మరీ చేసిన వ్యక్తి. ఈ విషయంలో బోయపాటి గారు గ్రేట్ పర్శన్. జయ జానకి నాయక హిందీలో డబ్ అయి 900 మిలియన్స్ వ్యూస్ తో నెంబర్ వన్ ప్లేస్ లో వుంది.
మీకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ?
-మోహన్ బాబు గారు. నాకు ఎవరూ సపోర్ట్ లేనప్పుడు ఆయన నన్ను సినిమాకి మేనేజర్ ని చేశారు. ఆయన నా దేవుడు.
కొత్త దర్శకులతో పని చేయాలని ఉందా ?
-కొత్త దర్శకులు మంచి సినిమాలతో వస్తున్నారు. సామవరగమనా,క, కమిటీ కుర్రాళ్ళు ఇలా మంచి సినిమాలు వచ్చాయి. కథ కుదిరితో అందరితో పని చేయాలని వుంది.
గతంలో మీరు చాలా మంచి రిమేక్స్ తో హిట్స్ అందుకున్నారు.. ఇప్పుడా ఆలోచనలు వున్నాయి ?
-ఒక రిమేక్ తీసుకున్నాను. అది తెలుగు సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వుంది. కథ బావుంటే రిమేక్ సినిమాలు కూడా బాగా ఆడుతాయి.
ఈ రోజుల్లో అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేయాలనిపించే దర్శకుడు ?
-పూరి జగన్నాథ్. ఆయనతో సినిమా చేయాలని వుంది. హీరోయిజాన్ని మారుస్తాడు. హీరోని ఎలివేట్ చేస్తాడు. 90 రోజుల్లో సినిమా రిలీజ్ చేస్తాడు. అలాంటి డైరెక్టర్ తో పని చేయాలని వుంది.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ