Reading Time: 2 mins

Telugu Pan-Indian Directors
తెలుగు పాన్ ఇండియన్ డైరెక్టర్స్

పాన్ ఇండియా సినిమా ప్రస్థావన వచ్చిందంటే సౌత్ ఇండియా డైరెక్టర్స్ గుర్తుకొస్తారు. మరీ ముఖ్యంగా తెలుగు డైరెక్టర్స్ పాన్ ఇండియా రేంజ్ లో హవా సాగిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు పరిశ్రమ నుంచే ఎక్కువ మంది పాన్ ఇండియా డైరెక్టర్స్ వచ్చారు. అందులో సక్సె రేట్స్ ఉన్నవాళ్లు తెలుగు నుంచే ఉండడం విశేషం. మొదటి నుంచి హిందీ సినిమాలు అన్నా, హిందీ ఫిల్మ్ మేకర్స్ అన్నా మిగితా పరిశ్రమల్లో ఒక ఆలోచన ఉండేది. బాలీవుడ్ స్థాయిని అందుకోవడం కొంచెం కష్టమని, వారు పెట్టిన ఖర్చుకు తగ్గట్టుానే బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు వస్తాయి అనే నమ్మేవారు. ఇదంతా తెలుగులో బాహుబలి సినిమా విడుదల అవకముందు. బాహుబలి విడుదల తరువాత మొత్తం వ్యవస్థ తారుమారు అయింది. బహుబలి కలెక్షన్లు చూసి బాలివుడ్ ఆశ్చర్యపడింది. తెలుగు తెర ఎన్నడూ చూడని వసూళ్లు అవి.

రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ప్రచారం చేసి విపతమైన బజ్ తీసుకొచ్చారు. ఫలితంగా బాహుబలి పార్ట్ 1 కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్ల వసూళ్లు సాధించింది. తరువాత బాహుబలి 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ 1800 కోట్లు సాధించింది. ఈ చిత్రంతో ఇండియా మొత్తం తెలుగు పరిశ్రమవైపు చూసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ చిత్రంతో రూ.1300 కోట్లు కొల్లగొట్టారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం పాన్ ఇండియా భాషల్లో విడుదలై రూ. 350 కోట్ల వరకు కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు పుష్ప ది రూల్ ఏ విధంగా దూసుకెళ్తుందో చూస్తూనే ఉన్నాము. అలాగే చందుమొండేటి, నిఖిల్ సిద్దార్థ్ కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియాను షేక్ చేసింది. చిన్న సినిమాగా విడుదలై రూ. 120 కోట్లు సాధించింది.

ఇదే వరుసలో సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సాహో సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా భాషాల్లో విడుదలైంది కానీ మంచి ఫలితాన్ని అందుకోలేదు. తేజ సజ్జ హీరోగా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం చేసిన హనుమాన్ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లు సాధించింది. ఇక తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సైతం పాన్ ఇండియా సినిమా తీశారు. బాలీవుడ్ హీరో రణ బీర్ కపూర్ తో అనిమల్ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా రూ. 918 కోట్లు సాధించింది. వీరి వరుసలోనే మరో పాన్ ఇండియా డైరెక్టర్ తెరమీదకు వచ్చారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి చిత్రం రూ. 1100 కోట్లు వసూల్ చేసింది. ఇక సౌత్ నుంచి రిషబ్ శెట్టి, డైరెక్టర్ అట్లీ, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజు తదితర డైరెక్టర్లు కూడా మంచి పాన్ ఇండియా విజయాలనే అందుకున్నారు. ఇప్పటి వరకు తెలుగు పాన్ ఇండియా డైరెక్టర్లు మొత్తం కలిపి రూ. 5400 కోట్లకు పైగా మార్కెట్ చేశారు. దీన్ని బట్టి 2030 సంవత్సరానికి సునాయసంగా పదివేల కోట్ల మార్కెట్ చేరుకుంటారు అని పిస్తుంది.

హిందీలో కూడా చాలా మంది డైరెక్టర్లు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొందరు విజయం సాధిస్తున్నారు. మరికొందరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు పరిశ్రమన నుంచే ఎక్కువ మంది డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు తీసీ విజయం సాధించారు. చూడాలి మరి భవిష్యత్తులో ఇంకెంత మంది తెలుగు దర్శకులు పాన్ ఇండియాలో విజయం సాధిస్తారో. అయితే ఇప్పుడున్న బిజినెస్ లెక్కల ప్రకారం సుకుమార్, రాజమౌళి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ వర్మ ఈ ఐదుమంది డైరెక్టర్లు వచ్చే ఐదేళ్లలో టాప్ పాన్ ఇండియా డైరెక్టర్లుగా కనిపిస్తున్నారు. కేవలం వీరి మార్కెట్ మాత్రమే పదివేల కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది.