Top 10 Telugu Movies Based On Collections
టాప్ 10 తెలుగు మూవీస్
2024లో సినిమా ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు ఎన్నో వైవిధ్యమైన చిన్న, మధ్య, భారీ తరహ సినిమాలు విడుదలయ్యాయి. ఈ సంవత్సరం చాలా వరకు పాన్ ఇండియా చిత్రాలే అలరించాయి. ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఈ సంవత్సరం విడుదలైన చిత్రాలలో కలెక్షన్ల పరంగా టాప్ టెన్ చిత్రాలను ఒకసారి చూద్దాం.
1. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజింగ్ చిత్రానికి సీక్వెల్ గా ఈ ఏడాది పుష్పది రూల్ చిత్రం విడుదలై సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 1300 కోట్లు వసూలు చేసింది. విడుదలైన అన్ని ఏరియాలో రన్నింగ్ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతోంది. నార్త్ లో అల్లు అర్జున్ హవా నడుస్తోంది. ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. మరి క్లోజింగ్ కలెక్షన్లు ఎంత వస్తాయో వేచి చూడాలి.
2. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే వంటి దిగ్గజాలు నటించిన చిత్రం కల్కి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన ఈ భారీ చిత్రం విడుదలైన ప్రతి చోట మంచి టాక్ సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లను వసూలు చేసింది.
3. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన దేవర పార్ట్ వన్ చిత్రం మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత విజయతీరాలవైపు దూసుకెళ్లింది. మొత్తంగా రూ. 500 కోట్లను కొల్లగొట్టింది.
4. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం హనుమాన్ వండర్ క్రియేట్ చేసింది. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం రూ. 350 కోట్లు వసూల్ చేసి అందర్నీ అబ్బురపరిచింది.
5. సంక్రాంతి కానుకగా విడుదలైన స్టార్ హీరో మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం. ఆశించిన టాక్ తెచ్చుకోలేదు కానీ కలెక్షన్లను రాబట్టింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ. 172 కోట్ల క్లోజింగ్ కలెక్షన్ ను రాబట్టింది.
6. మల్లిక్ రామ్, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్లో వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రం రూ. 135 కోట్లతో దూసుకెళ్లింది.
7. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ చిత్రం బ్యాంకింగ్ సెక్టార్లో తెరకెక్కింది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 106 కోట్ల షేర్ సాధించింది.
8. నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సరిపోదా శనివారం చిత్రం ఈ సంవత్సరం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో వివేకాత్రేయ సైతం 100 కోట్ల క్లబ్లో చేరారు. ఇక సరిపోదా శనివారం మొత్తం క్లోజింగ్ కలెక్షన్లు 100 కోట్లు.
9. కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం క. యంగ్ డైరెక్టర్స్ సందీప్, సతీష్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ. 53 కోట్ల వసూళ్లను రాబట్టింది.
10. సంక్రాంతి కానుకగా విడుదలైన నాగార్జున చిత్రం నా స్వామి రంగ మూవీని విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రూ. 37 కోట్లను రాబట్టింది. 2024 లో విడుదలైన ఈ చిత్రాలు కలెక్షన్ల పరంగా టాప్ టెన్ పొజిషన్ లో ఉన్నాయి.