Allari Naresh BaChchala Malli Trailer
మెప్పించిన బచ్చల మల్లి ట్రైలర్
అల్లరి నరేష్ కేవలం కామెడీ పాత్రలే కాదు అవకాశం వస్తే ఊరమాస్ పాత్రలు కూడా చేస్తాడు అని తాజాగా విడుదలైన బచ్చల మల్లి ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు చిత్రాల్లో కనిపించారు. ఇప్పుడు మూడో చిత్రంతో మన ముందుకు రానున్నారు. నాగార్జున నా సామిరంగ సినిమాలో కీలక పాత్రతో మెప్పించారు ఆ తర్వాత ఆ ఒక్కటీ అడక్కు అంటూ తనదైనా మార్క్ కామెడీతో అలరించే ప్రయత్నం చేశారు. కానీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరించింది. ఇప్పుడు చాలా సీరియస్ కథతో ఆడియన్స్ మెప్పించడానికి సిద్ధం అయ్యాడు. బచ్చల మల్లి ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి టాలీవుడ్ లో నరేష్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. ఆయన గెటప్, లుక్ చాలా రఫ్ గా ఉన్నాయి. ఇలాంటి గెటప్ లో నరేష్ ను చూడడం కొత్తగా ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
నరేష్ పాత్రని రావు రమేష్ పరిచయం చేయడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అతనికి ఉన్న అలవాట్లు తాగుడు, తిరుగుడు, గొడవలను పరిచయం చేశారు. ఈ కథ నేపథ్యం గ్రామీన ప్రాంతంలో 90 కాలంలో సాగే ఈ కథ అనేది కనిపిస్తుంది. ట్రైలర్ లో నరేష్ పాత్ర కొంత నెగెటివ్ షేడ్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. హీరోయిన్ అమృత అయ్యర్ చాలా క్యూట్ గా కనిపిస్తోంది. నరేష్ జీవితంలోకి హీరోయిన్ రావడంతో చాలా మార్పులు వచ్చినట్లు తెలుస్తుంది. వీరి ప్రేమకు అడ్డు ఏది, ఎందుకు అచ్యుత్ కుమార్ నరేష్ తో ప్రేమించే ముందు అమ్మాయి బాబు ఎవరు, ఏం చేస్తుంటారు అనేది తెలుసుకోవాలి అనే డైలాగ్ చెప్పారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ చిత్రంలో రావు రమేష్, రోహిణి, వైవా హర్ష, హరి తేజలతో పాటు దన్ రాజ్, సాయికుమార్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సుబ్బు మంగదేవి దర్శకత్వం బాగుంది. టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకులలో ఉత్సాహాన్ని నింపారంటే సినిమా కచ్చితంగా హిట్ తెచ్చుకొనే అవకాశం కనిపిస్తుంది. ఈ మూవీని హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది.