Reading Time: < 1 min

Dill Raju Assumes Charge as Chairman of TFDC
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా తెలుగు నిర్మాత దిల్ రాజు బాధ్యతలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం దిల్ రాజును టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఛాంబర్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. టీఎఫ్‌డీసీకి పూర్వ వైభవం తీసుకురావాలని, అందేకోసం అందరి సహకారాలు కావాలని మీడియాతో పేర్కొన్నారు. ఇదే విధంగా తెలంగాణ సంస్కృతిని ఆధారంగా మరిన్ని సినిమాలు రావాలని, అందుకు తమవంతు కృష్టి ఉంటుందని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు మంచి పేరు ఉందని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత అందరిమీద ఉందన్నారు. టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా తనపై ఎంతో బాధ్యత ఉందని, ఎలాంటి అవాంతరాలకు తావు ఇవ్వకుండా చూసుకుంటామన్నారు. ఇకపై ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పని చేస్తానన్నారు. పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలను పరిష్కరించేందుకు
పాటుపడుతా అని పేర్కొన్నారు. ఈ బాధ్యతను ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మద్రాస్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన తరువాత తెలుగు పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందని దిల్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినిమా పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు.

దిల్ రాజు మాములు డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి పాన్ ఇండియా సినిమా దాదాపు రూ. 450 కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించే స్థాయికి వెళ్లడం మామలు విషయం కాదు. 2003లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ను స్థాపించి నితిన్ హీరోగా దిల్ సినిమాను నిర్మించారు. తన ఫస్ట్ సినిమా పేరునే ఆయన గుండెధైర్యానికి గుర్తుగా దిల్ రాజు అని వ్యవహారికంగా మారిపోయింది. ఆ తరువాత వరుస హిట్లతో ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువయ్యారు. ఈ మధ్య నిర్మాణ బాధ్యతలను తమ పిల్లలకు అప్పగించారు. ఆ సంస్థనుంచి కూడా మంచి సినిమాలే విడుదల అవుతున్నాయి. తెలంగాన నేపథ్యంలో వచ్చిన బలగం చిత్రం ఎంత పెద్ద హిట్ అయింందో అందరికి తెలిసిందే. అంతే కాకుండా దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో మరో అనుబంధ సంస్థను స్థాపించి కొత్తగా వచ్చే నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మార్గం చూపాలి అనుకుంటున్నారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్బంగా బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున బెస్ట్ విషేస్ అందిస్తున్నాము.