Top 10 Actors 2024
టాప్ 10 యాక్టర్స్ 2024
తెలుగు పరిశ్రమలో చాలామంది హీరోలు ఉన్నారు. వారికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అందరిలో ఎవరు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అంటే మాత్రం అంత సులువుగా చెప్పడం కష్టం. అయితే సినిమా విజయాన్ని బట్టి ఏ హీరో అగ్రస్థానంలో ఉన్నాడో చెప్పగలం. అలాగే సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి, హీరో తీసుకున్న పారితోషికాన్ని బట్టి, హీరో చేసిన సినిమాలను బట్టి కూడా వారి స్థానాలను నిర్ణయించడం ఒక పద్ధతి. అయితే 2024లో విడుదలైన సినిమాలు ఆ చిత్రాలలో కథానాయకులుగా వారు పోషించిన పాత్రలు అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయిన విధానాన్ని బట్టి టాప్ 10 హీరోల వరసను ఒకసారి చూద్దాం.
10. కిరణ్ అబ్బవరం
షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి సిల్వర్ స్క్రీన్ పై విజిల్స్ కొట్టించుకునే స్థాయికి ఎదిగిన నటుడు కిరణ్ అబ్బవరం. ఈ సంవత్సరం ఆయన హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ క. ఈ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకులను ఆకర్షించింది. ఆ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు కాబట్టే టాప్ టెన్ స్థానంలో ఉన్నారు.
9.దుల్కర్ సల్మాన్
వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కించిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ చిత్రంలో కథానాయకుడు దుల్కర్ సల్మాన్ నటనకు తెలుగు ప్రేక్షకులు ముగ్దులయ్యారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ, అప్పులు, ఆశ నిరాశలతో పాటు డబ్బు సంపాదించినప్పుడు ఆయన చూపించిన దర్పం, గర్వం లాంటి భావాలతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. అందుకే టాప్ టెన్ స్థానంలో 9 వ స్థానంలో చోటు దక్కించుకున్నారు.
8. ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం డివైడర్ తెచ్చుకున్నప్పటికీ నటనలో మాత్రం ఎన్టీఆర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రెండు విభిన్నమైన పాత్రలతో తెరపై అలరించారు. దేవరగా ఆయన ప్రేక్షకుల హృదయాలను మీటారు. ఇంకా సినిమాలో కొన్ని ఎమోషన్స్ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అవలేదు. కానీ నటన పరంగా ఎన్టీఆర్ టాప్ లో 8వ స్థానంలో ఉన్నారు.
7. సిద్దు జొన్నలగడ్డ
డిజె టిల్లు తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆటిట్యూడ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసి సిద్ధూ జొన్నలగడ్డ అంటే మన పక్కింటి కుర్రాడు అనే టాగ్ సంపాదించుకున్నారు ఈ హీరో. ఈ సంవత్సరంలో ఆయన నటించిన టిల్లు స్కేర్ చిత్రం విడుదలై ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ అందరికీ నచ్చింది అందుకే టాప్ టెన్ లో 7వ స్థానంలో ఉన్నారు.
6.ప్రభాస్
నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి. ఇలా చెప్పడం కన్నా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి అంటే కరెక్టుగా ఉంటుందేమో. ఎందుకంటే ప్రభాస్ కేవలం హీరో మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకుల ఎమోషన్. ఇక సినిమా విషయానికి వస్తే అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పడుకొనే, దిశా పటాని వంటి స్టార్ నటులు ఉండడంతో కల్కి పార్ట్ 1 లో ప్రభాస్ కు కొంచెం తక్కువ స్పేస్ దొరికింది. దానిలో కూడా ప్రభాస్ తన మార్క్ చూపిస్తూ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నారు. ఇక పార్ట్ 2 లో ప్రభాస్ ప్రభంజనం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. టాప్ టెన్ వరుసలో 6వ స్థానంలో ఉన్నారు.
5.మహేష్ బాబు
అమ్మ సెంటిమెంట్ త్రివిక్రమ్ మాటలతో తెరకెక్కిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రంలో మహేష్ బాబు స్టైల్ చాలా భిన్నంగా, కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ లో ఆయన పండించిన భావోద్వేగాల సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో పదిలంగా ఉంది. అందుకే 2024లో టాప్ హీరోలలో ఐదో స్థానంలో ఉన్నారు.
4.నాని
నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ తెరమీద మ్యాజిక్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా సరిపోదా శనివారం అనే వినూత్నమైన కథతో ప్రేక్షకులను అలరించారు. అమ్మ చెప్పిన మాటను పాటిస్తూ ఎమోషనల్ గా ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. అందుకే టాప్ ఫోర్ లో ఉన్నారు.
3.తేజ సజ్జ
తలుచుకుంటే అసాధ్యం కానిది ఏదీ లేదు అని హనుమాన్ చిత్రంతో తేజ సజ్జ మరోసారి గుర్తు చేశారు. పెద్ద సినిమాపై పోటీగా విడుదలైనప్పటికీ సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు అని నిరూపించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో తేజ సజ్జ ఓ సూపర్ హీరోగా కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులకి బాగా చేరువైంది. అందుకే తేజ సజ్జ నటుడిగా ఈ సంవత్సరం మూడో స్థానంలో ఉన్నారు.
2. విజయ్ సేతుపతి
ఏ చిత్రమైన ఎమోషనల్ ఎంగేజ్మెంట్ తో పాటు ఆడియన్స్ కనెక్టివిటీని కంటిన్యూ చేస్తుంటే ఆ చిత్రంతో ప్రతి ప్రేక్షకుడు ప్రేమలో పడిపోతారు. దీనికి తోడు కథానాయకుడి నటన అదనపు ఆకర్షణ. సరిగ్గా ఈ కొలతలు ఉన్న చిత్రం మహారాజ. విజయ్ సేతుపతి నటించిన మహారాజ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో అదరగొట్టింది. అలాగే తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటనకు అందరూ ఫిదా అయ్యారు. మొదటి సీన్ నుంచి క్లైమాక్స్ వరకు విజయ్ సేతుపతి యాక్టింగ్ ఆద్యంతం ఆకట్టుకుంది. అందుకే 2024 నటుల్లో ద్వితీయ స్థానాన్ని పొందారు.
1. అల్లు అర్జున్
జాతీయ అవార్డు రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ ఆ ఘనతను సాధించారు. అల్లు అర్జున్ నటనకు యావత్తు భారతదేశం ఫిదా అయిన విషయం తెలిసిందే. 2024లో పుష్పకు సీక్వెల్ గా పుష్ప ది రూల్ అనే చిత్రం విడుదలైంది. పుష్ప రాజ్ రెడ్ శాండిల్ సిండికేట్ గా ఎలా ఎదిగాడో, ఎలా శాసిస్తున్నాడో, అంతర్జాతీయ మార్కెట్లో ఎలా దూసుకెళ్లాడో సినిమాలో చూపించారు. తన వ్యాపారంలో పుష్ప రాజ్ కింగే అయినప్పటికీ కుటుంబ వ్యవహారంలో మాత్రం శ్రీవల్లికి భర్తగా, తల్లికి కొడుకుగా, ఇంటి పేరుతో అవమానించబడే వ్యక్తిగా ఆయన నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. భావ ఉద్యోగాలు, ఫైట్స్, డాన్సులు, ఎక్స్ ప్రెషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే మూడు గంటల 20 నిమిషాలు ఉన్న సినిమాలో దాదాపు వన్ మ్యాన్ షో గా అలరించారు. అందుకే అల్లు అర్జున్ 2024 నటుల వరుసలో అగ్రస్థానంలో ఉన్నారు.
2024 లో విడుదలైన సినిమాలలో కలెక్షన్ల పరంగా కాకుండా ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన సినిమాల్లోని హీరోల పాత్రలు, దాని తాలూకు భావోద్వేగాలను బట్టి ఈ వరుసక్రమాలను వెల్లడించాము. ఇది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ టీం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.