Reading Time: < 1 min

Game Changer Dhop Song Promo
గేమ్ ఛేంజర్ నుంచి దోప్ సాంగ్ ప్రోమో ఎలా ఉందంటే

రామ్ చ‌ర‌ణ్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ నటిస్తుంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 10న విడుదల అవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన జరగండి, రా మచ్చా మచ్చా, నా నా హైరానా అనే పాటలు యూట్యూబ్‌లో మంచి వ్యూయర్ షిప్ ను దక్కించుకున్నాయి. ఇక రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్‌ సైతం ఆకట్టుకుంది. ఈ చిత్రం నుంచి నాలుగో పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

దోప్ పేరిట విడుదలైన ఈ సాంగ్ ప్రోమో విపరీతంగా కనెక్ట్ అవుతుంది. ఈ ప్రోమోలో రామ్ చరణ్, కియారా చాలా స్టైల్ గా కనిపించారు. దీన్ని బట్టి చూస్తే ఈ పాటను ఏ రేంజ్‌లో పిక్చరైజేషన్ జరుపుకుందో అర్థం అవుతోంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా రామజోగయ్య శాస్త్రి పాటను రచించారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రాన్ని శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.