Reading Time: 2 mins

UI Movie Review
యూఐ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్వీయదర్శకత్వంలో వచ్చే సినిమాలకు తెలుగులో సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన గత సినిమాలు ఏ, రా, ఉపేంద్ర, రక్తకన్నీరు వంటిచిత్రాలు జనాకర్షణను పొందాయి. చాలా కాలంగా ఉపేంద్ర డైరెక్షన్ లో మూవీస్ రాలేదు. దీంతో ఆయన దర్శకత్వంలో వస్తున్న యూఐ చిత్రంపై అందరికి ఆసక్తి నెలకొంది. టెైటిల్ తోనే ప్రేక్షకులను ఆకర్షించే క్రియేటివిటీ ఆయనదే. ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలతో పాటు ట్రైలర్ కూడా కొత్తగా అనిపించింది. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూఐ చిత్రం ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ:
డైరెక్టర్ ఉపేంద్ర(ఉపేంద్ర) తీసిన యూఐ చిత్రం చూసిన ప్రేక్షకుల్లో కొందరికి జ్ఞానం వస్తుంది. మరి కొందరికి అర్థం కాక జుట్టుపీక్కుంటారు. ఇంకొందరు ఈ సినిమాను బ్యాన్ చేయాలని నిరసనలు చేస్తుంటారు. ఇదే సమయంలో ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్(మురళి శర్మ) ఈ సినిమాపై రివ్యూ రాయాలని ప్రయత్నిస్తాడు. కానీ సినిమాతో కనెక్ట్ అవకపోవడంతో డైరెక్ట్ గా ఉపేంద్రతో మాట్లాడుదామని ఆయన ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆయన ఉండరు కానీ ఉపేంద్ర రాసుకున్న యూఐ సినిమా స్క్రిప్ట్ దొరుకుతుంది. ఆ కథ చదివిన తరువాత ఆయన తీసిన కథ వేరు అని తెలుస్తుంది. ఇంతకీ ఉపేంద్ర రాసుకున్న కథలో ఏం ఉంది? ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలకు ఉపేంద్ర ఎలాంటి సమధానాలు చూపించారు? కత్తెర శ్రీను(రవి శంకర్) పాత్ర ఏంటి? సత్యకు, కల్కికి సంబంధం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఉపేంద్ర సినిమా ఎలా ఉంటాయో ప్రేక్షకులకు కొంత తెలుసు అందుకే ఆయన కూడా అదే ఫార్మెట్ ఈ సినిమాను తెరకెక్కించారు. సిినిమా మొదలైన 20 నిమిషాల వరకు ఏం జరుగుతుందో అర్థం కాదు కానీ ఏదో జరుగుతుంది అన్న ఆసక్తిని క్రియేట్ చేశారు. అలాగే కామెడీ సీన్లు అలరిస్తాయి. ఇక సత్యగా ఉపేంద్ర ఎంట్రీ చాలా భిన్నంగా ఉంటుంది. ఫస్ట్ సీన్ లోనే ఉపేంద్ర రైటింగ్, టేకింగ్ అర్థం అవుతుంది. తన మంచితనంతో ఈ ప్రపంచాన్ని మార్చాలని సత్య చేసే ప్రయాత్నాలు అలరిస్తాయి. అదే సమయంలో హీరోయిన్ సత్యను ప్రేమించడం, తన ప్రేమ ఎలాంటిదో చెప్పే ప్రయత్నంలో హీరోయిన్ చేసే పనులు వింతగా ఉంటాయి. తెరమీద నవ్వు తెప్పిస్తాయి. అదే సమయంలో పాపులను కల్కి అనే వ్యక్తి శిక్షిస్తుంటాడు. అందుకోసం ఒక అంతర్గత స్థావరాన్ని ఏర్పాటు చేస్తాడు. అలా ప్రథమార్థంలో ఒక ట్విస్ట్ తో ముగుస్తుంది.

తనను తాను కల్కిగా ప్రకటించుకున్న తరువాత ఉపేంద్ర చేసిన కొన్ని పనులు ఆలోచింపచేసేలా ఉంటాయి. తన తల్లికి జరిగిన అన్యాయాన్ని ఈ భూమితో పోల్చి చెప్పడం, ఆ తరువాత తన తల్లి సంతోషం కోసం చేసే పనులు అన్ని ఈ ప్రకృతిని కాపడానికే అన్నట్లు ఉంటాయి. ఈ పాయింట్ కూడా తనదైన స్టైల్ లోనే చెప్పారు. సత్యకు, కల్కికి మధ్య సైంధితిక ఘర్షణ వచ్చిన తరువాత కల్కి తీసుకునే చర్యలు ఆసక్తిగా ఉంటాయి. అందరు సమానం అనే ధర్మాన్ని సత్య అందరికి చెప్పి హాయిగా ఉంటే అక్కడికి కల్కి వచ్చి ఒక సవాల్ విసిరి వెళ్లడం, ఆ తరువాత దాన్ని ఎదుర్కొనే సమయంలో సత్యకు ఎదురయ్యే పరిస్థితి ఆలోచింపజేసేలా ఉంటుంది. ఇక క్లైమాక్స్ ఎవరూ ఊహించనట్లు ముగుస్తుంది.

నటీనటులు:
ఉపేంద్ర నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం ఉంటుంది. ఎన్ని పాత్రలు అయినా సరే అలవోకగా చేయగలరు. ఇందులో కూడా రెండు విభిన్న పాత్రల్లో నటించారు. హీరోయిన్ రీష్మ పాత్ర చిన్నదే తన ఫర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. అలాగే కరణ్ ఆదర్శ్ గా మురళి శర్మ, రవి శంకర్ తదితరులు ఆకట్టుకున్నారు.

సాంకేతిక అంశాలు:
సినిమా ఆద్యంతం సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. కెమెరా వర్క్ బాగుంది. సంగీతం, ఎడిటింగ్ మెప్పించింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితనం చాలా బాగుంది. సీజీ వర్క్ కూడా మెప్పించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్
ఉపేంద్ర యాక్టింగ్
ఆసక్తిరమైన సన్నివేశాలు
ఆర్ట్ వర్క్

మైనస్ పాయింట్స్
లాజిక్ లేని కథనం
క్లైమాక్స్

అంతిమ తీర్పు
సమజాంలో ఉన్న కుల, మత, జాతి అసమానాతలు, మనుషులు చేేసే అన్యాయాలను ఎలా ఎదుర్కోవాలో చూపించే ప్రయత్నంలో భాగంగా ఉపేంద్ర తనదైన స్టైల్ జోడించారు. ఆయన ఆలోచనలకు కనెక్ట్ అయితే ఎంజాయ్ చేస్తాము లేదంటే.. ఎండ్ కార్డ్ కోసం ఎదురుచూస్తాము.

Movie Title : UI The Movie(dubbed from Kannada)
Banner: Lahari Films, Venus Entertainers
Release date:-20.12.2024
Censor rating:-“U/A”
Cast :-Upendra
Directed by : – Upendra,Reeshma Nanaiah,Murali Sharma
Music: -B Ajaneesh Loknath
Cinematography :- HC Venu
Editing: -Vijay Raj BG
Producer : G Manoharan  Sreekanth KP
Nizam Distributors:-Geetha Film Distributors
Runtime:-132 minutes