Reading Time: < 1 min

Emotional Engagement Movies 2024 Top 10th Movie
ఎమోషనల్ ఎంగేజ్మెంట్ 2024 చిత్రాలలో 10 వ చిత్రం

సినిమా పరిశ్రమలో ప్రతీ సంవత్సరం వందలాది చిత్రాలు విడుదల అవుతున్నాయి. అలాగే 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు తెలుగు తెరపైన ప్రదర్శించబడ్డాయి. వాటిలో ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించగా, కొన్ని చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ఒక సంవత్సరంలో ఎన్ని చిత్రాలు విడుదలైనా కొన్ని చిత్రాలు మాత్రం మనసుకు దగ్గరగా ఉంటాయి. వాటినే మనం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ చిత్రాలు అంటాము. మరి 2024లో ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన టాప్ 10 చిత్రాలలో 10 వ స్థానంలో ఉన్న చిత్రం మంజుమ్మల్ బాయిస్.

చిన్న సినిమాగా మలయాళంలో విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ పెద్ద విజయం సాధించింది. అలాగే మిగతా భాషల్లో కూడా అనువాదం చేసుకొని విడుదలైన అన్నిచోట్ల మంచి టాక్ తెచ్చుకుంది. గుణ కేవ్స్ లో ప్రమాదవశాత్తు పడిపోయిన తమ స్నేహితుని తన ఫ్రెండ్స్ ఎలా కాపాడారు అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. చివరి వరకు ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ చిత్రం మంచి ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ని అందించింది. కమర్షియల్ గా కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. దాదాపు మలయాళంలోనే రూ. 200 కోట్లు వసుల్ చేసింది అంటేనే అర్థం చేసుకోవచ్చు. యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2006లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా మలయాళంలో ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రాన్ని తీశారు.

కేరళలోని మంజుమ్మల్ ప్రాంతంలో ఓ 11 మంది స్నేహితులు ఉంటారు. ఓ ఫంక్షన్ సందర్భంగా వాళ్లంతా చాలా కాలానికి కలుసుకుంటారు. సరదాగా అలా కొడైకెనాల్ వెళ్లాలనలని ఫిక్స్ అవుతారు. కొడెకైనాల్ చూసిన తరువాత గుణ కేప్స్ ను కూడా చూడాలనే ఆ కేవ్స్ దగ్గరకు వెళ్తారు. అక్కడ ప్రమాదవశాత్తు ఆ లోయలో శుభాస్ అనే వ్యక్తి పడిపోతారు. అతన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ సినిమా. ప్రతీ ఎమోషన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అందుకే ఈ సినిమా ఎమోనల్ ఎంగేజ్మెంట్ స్థానంలో టాప్ 10 ప్లేస్ దక్కించుకుంది.