Emotional Engagement Movies 2024 Top 9th Movie
ఎమోషనల్ ఎంగేజ్మెంట్ 2024 చిత్రాలలో 10 వ చిత్రం
సినిమా పరిశ్రమలో ప్రతీ సంవత్సరం వందలాది చిత్రాలు విడుదల అవుతున్నాయి. అలాగే 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు తెలుగు తెరపైన ప్రదర్శించబడ్డాయి. వాటిలో ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించగా, కొన్ని చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ఒక సంవత్సరంలో ఎన్ని చిత్రాలు విడుదలైనా కొన్ని చిత్రాలు మాత్రం మనసుకు దగ్గరగా ఉంటాయి. వాటినే మనం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ చిత్రాలు అంటాము. మరి 2024లో ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన టాప్ 10 చిత్రాలలో 9 వ స్థానంలో ఉన్న చిత్రం టిల్లు స్క్వేర్.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఎమోషనల్ ఎంగేజ్మెంట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ పరంగా అగ్రస్థానంలో నిలిచిన చిత్రం టిల్లు స్క్వేర్. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరేమశ్వరన్ జంటగా నటించారు. సిద్దు తనదైన స్టైల్ లో టాలీవుడ్ ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో హీరో జీవితంలోకి పోలీసు ఆఫీసర్ అయిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరి లీలాగా ఎంట్రీ అవుతుంది. మోస్ట్ వాంటెడ్ డాన్ ను పట్టుకోవడానికి సిద్దు లైఫ్ లో వచ్చి అతన్ని పట్టుకునే ప్రయత్నంలో హీరోతో లవ్ ట్రాక్ నడిపిస్తుంది. చివరికి సిద్దు లైఫ్ లో ఏం జరిగిందే అనేదే టిల్లు స్క్వేర్ సినిమా కథ. అందరిని నవ్వించిన ఈ సినిమా టాప్ 9వ స్థానంలో నిలిచింది.