Reading Time: < 1 min

Top 10 Actors 2024
టాప్ 10వ యాక్టర్ 2024

తెలుగు పరిశ్రమలో చాలామంది హీరోలు ఉన్నారు. వారికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అందరిలో ఎవరు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అంటే మాత్రం అంత సులువుగా చెప్పడం కష్టం. అయితే సినిమా విజయాన్ని బట్టి ఏ హీరో అగ్రస్థానంలో ఉన్నాడో చెప్పగలం. అలాగే సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి, హీరో తీసుకున్న పారితోషికాన్ని బట్టి, హీరో చేసిన సినిమాలను బట్టి కూడా వారి స్థానాలను నిర్ణయించడం ఒక పద్ధతి. అయితే 2024లో విడుదలైన సినిమాలు ఆ చిత్రాలలో కథానాయకులుగా వారు పోషించిన పాత్రలు అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయిన విధానాన్ని బట్టి టాప్ 10 హీరోలలో పదవ స్థానంలో ఉన్న హీరో కిరణ్ అబ్బవరం.

కిరణ్ అబ్బవరం మధ్యతరం నుంచి వచ్చిన నటుడు. షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి సిల్వర్ స్క్రీన్ పై విజిల్స్ కొట్టించుకునే స్థాయికి ఎదిగారు. ఈ సంవత్సరం ఆయన హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ క. ఈ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకులను ఆకర్షించింది. ఆ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు కాబట్టే టాప్ టెన్ స్థానంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల లిస్ట్ ఒక సారి చూద్దాం.

1.రాజావారు రాణిగారు
2.ఎస్ఆర్ కల్యాణమండపం
3.సెబాస్టియన్ పి.సి.524
4.సమ్మతమే
5.నేను మీకు బాగా కావాల్సిన వాడిని
6.విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ
7.మీటర్
8.రూల్స్ రంజన్
9.క
10.దిల్రూబ