Reading Time: < 1 min

Top 5th Movie 2024
టాప్ 5వ చిత్రం 2024

సినిమా పరిశ్రమలో ప్రతీ సంవత్సరం వందలాది చిత్రాలు విడుదల అవుతున్నాయి. అలాగే 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు తెలుగు తెరపైన ప్రదర్శించబడ్డాయి. వాటిలో ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించగా, కొన్ని చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ఒక సంవత్సరంలో ఎన్ని చిత్రాలు విడుదలైనా కొన్ని చిత్రాలు మాత్రం మనసుకు దగ్గరగా ఉంటాయి. వాటినే మనం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ చిత్రాలు అంటాము. మరి 2024లో ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన టాప్ 10 చిత్రాలలో కల్కి సినిమా ఐదవ స్థానంలో ఉంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం కల్కి. ఈ సినిమాలో అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పడుకొనే తదితరులు నటించారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. తెలుగు పరిశ్రమ ఎప్పుడు చూడని విజువల్స్ తో అలరించింది కల్కి. ముఖ్యంగా సినిమా ప్రేక్షకులకు ఇంత కనెక్ట్ అవడం వెనుక మనకు తెలిసిన పూరాణ పురుషుల గాధలు ఉండడం. ప్రభాస్ కర్ణుడి పాత్ర అయితే అశ్వథ్థమా, కల్కి పాత్రలను మలిచిన తీరు చాలా మెప్పించింది. ముఖ్యంగా కల్కి ఎప్పుడు జన్మిస్తాడు, ఎలా జన్మిస్తాడు అనేది ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రగిలించింది. ఇప్పుడు కల్కి పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కల్కి మూవీలో కమల్ హాసన్ ఏం చేస్తాడు అనేది పార్ట్ 2 లో చూడాలి. కల్కి సినిమా ప్రేక్షకులకు నచ్చడంతోనే ఈ ఏడాది టాప్ 5వ చిత్రంగా నిలిచింది.