Reading Time: < 1 min

Rao-San Films On-Boards Pushpa Writers For Their Project.
రావు -శాన్ ఫిల్మ్స్ కు కలం అందించనున్న పుష్ప రచయితలు

రావు -శాన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నైజాం ఏరియాలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విభాగంలో తనకంటూ ప్రత్యేక చరిత్రను నిర్మించుకుంది. నాణ్యమైన సినిమాల పంపిణీతో పాటు చాలా కాలంగా మంచి కథను ప్రేక్షకులకు అందించే ప్రయత్నంలో ఉంది. ఈ తరుణంలో డైరెక్టర్ సుకుమార్ టీమ్ లో ప్రతిభావంతులైన శ్రీకాంత్ విస్సా, ప్రశాంత్ బారాది రచయితలతో ఓ మంచి కథను అందించనుంది. ఈ మేరకు ఈ ద్వయ రచయితలు రావు -శాన్ ఫిల్మ్స్ కు కథను అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా సంచలనం సృష్టించిన పుష్ప-1, పుష్ప-2 చిత్రాలతో శ్రీకాంత్ విస్సా, ప్రశాంత్ బారాది లు మంచి రచయితలుగా పేరుగాంచారు. రావణాసుర, 18 పేజేస్, వెంకీమామ లాంటి చిత్రాలతో రచయిత శ్రీకాంత్ విస్సా అందిరికి పరిచయమే.

ఇద్దరు ప్రతిభావంతమైన రచయితలతో ప్రేక్షకుల అభిరుచి మేరకు రావు -శాన్ ఫిల్మ్స్ ఓ అద్భుతమైన కథను 2026లో థియేటర్స్ లలో తీసుకొచ్చేందుకు ప్రణాళికను సిద్దం చేస్తోంది. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత టైమ్ తీసుకొని మంచి ప్రాజెక్ట్ ను అందించేందుకు అన్ని విధాల ప్రయత్నాలను చేస్తోంది. కథ పూర్తి అయిన తరువాత నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలపనుంది. వైవిద్యభరితమైన కథలను అందిస్తున్న ఈ యువ రచయితలతో, సినిమాతో ఎంతోకాలంగా అనుబంధం ఉన్న రావు -శాన్ ఫిల్మ్స్ సంస్థ తెరకెక్కించే చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతీ సినిమా ప్రేమికుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రాజెక్ట్ రాబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ యర్రమిల్లి నిర్మించబోతున్నారు.