Reading Time: < 1 min

Hari Hara Veera mallu Mata Vinaali Lyrical Song Released
హరిహర వీరమల్లు నుంచి మాట వినాలి సాంగ్ రిలీజ్

పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన లిరికల్ పాట అందరిని ఆకట్టుకుంటుంది. మాట వినాలి గురుడా మాట వినాలి అంటూ సాగే ఈ పాట తత్వం బోధిస్తున్నట్లు ఉంది. గతంలో కూడా పవన్ కల్యాణ్ ఇలాంటి ప్రయోగాలు చేశారు. ఆయన నటించిన కుషీ చిత్రంలో బాయి బాయియే బంగారు రమణమ్మ నుంచి మొదలుకొని  జానీ సినిమా నారాజుగాకుల అన్నయ్య, గుడుంబా శంకర్ చిత్రంలో కిల్లి కిల్లి కిల్లి పాట, అదేవిదంగా గబ్బర్ సింగ్ లో కొన్నిహమ్మింగ్స్, అత్తారింటికి దారేది చిత్రంలో బెట్రాయి సామి దేవుడా, అజ్ఞాతవాసిలో కొడుకా కోటేశ్వర రావు అనే పాటలు పాడారు.

ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న హరిహరవీరమల్లు చిత్రంలో పవన్ కల్యాణ్ తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి తదితరులు నటిస్తున్నారు. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లముడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్ఎమ్ కిరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కొన్ని కారణాల వలన ఈ చిత్రం నిర్మాణం ఆలస్యంగా అయింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అన్ని కుదిరితే 2025లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. పెంచల్ దాస్ రాసిన ఈ తత్వన్ని పవన్ కల్యాణ్ ఆలపించిన తీరు అందరినీ మెప్పిస్తుంది.