Paradha Teaser Launch Event
పరదా టీజర్ లాంచ్ ఈవెంట్
అనుపమ పరమేశ్వరన్, దర్శిని, సంగీత ముగ్గురు అందమైన ముద్దుగుమ్మలు ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పరదా నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కథానాయిక సుబ్బు పాత్రను అనుపమ పరమేశ్వరన్ వాయిస్ ఓవర్ ద్వారా పరిచయం చేస్తుంది. కథకుడి ప్రకారం, సుబ్బు చాలా దూరం ప్రయాణించి తన జీవితాన్ని ముగించడానికి 70 లక్షలు చెల్లిస్తుంది. ఆ తర్వాత సుబ్బు, దర్శన రాజేంద్రన్, సంగీత పోషించిన మరో ఇద్దరు ప్రధాన పాత్రలతో కలిసి సాహసోపేతమైన యాత్రకు బయలుదేరడం ఆసక్తిగా వుంది. అయితే, సుబ్బు ప్రయాణంలో సీక్రెట్ ఎజెండా వుంది. టీజర్ ముందుకు సాగుతున్న కొద్దీ, గ్రామంలోని పాత ఆచారాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలను రివిల్ చేస్తుంది, వాటిలో మహిళలు ముఖాలను కప్పుకోవడం, సతి లాంటి ఆచారం ఉన్నాయి. చివర్లో, అనుపమ పరమేశ్వరన్ ముఖం రివిల్ కావడం మిస్టిరియస్ ఎక్సపీరియన్స్ ఇస్తోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్, ప్రముఖప్రొడ్యూసర్ శరత్ మరార్ పాల్గొన్నారు. సినిమా బండి అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆనంద బ్యానర్ పై శ్రీనివాసులు పీవీ, విజయ్ డొంకడ, శ్రీధర్ మక్కువ ఈ సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడం కోసమే ఈ ప్రయత్నం చేశామన్నారు. దాదాపు రెండున్నర సంవత్సరాలు ఈ సినిమాకోసం కష్టపడ్డామన్నారు. ఈ సినిమాలో హీరోయిన్సే హీరోలు అని పేర్కొన్నారు. మంచి కథను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ కంటెంట్ ను తీసుకొచ్చాము, డైరెక్టర్ ప్రవీణ్ చాలా కష్టపడి పనిచేశారని, ఈవెంట్ కు వచ్చిన మిత్రుడు ఏపీ మంత్రి శ్రీనావస్ కు, ప్రొడ్యూసర్ శరత్ మరార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రొడ్యూసర్ శరత్ మారార్ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా ముగ్గురు హీరోయిన్లనతో ఒక కథ రాయడం అనేది సవాల్ అని ఈ సినిమా గ్రాండ్ హిట్ అవ్వాలని కోరారు. తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే ఇలాంటి సినిమాలు తెరకెక్కించాలంటే చాలా గట్స్ ఉండాలని పేర్కొన్నారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. టీజర్ ప్లే చేసినప్పుడు నా పదేళ్ళ జర్నీ కనిపించింది. చాలా ఎమోషనల్ అయ్యాను. ఈ రోజు ఆనందంతో పాటు ఒక బాధ్యత కనిపిస్తోంది. మిమల్ని అలరించడానికి ఇలాంటి మంచి పాత్రలు మరిన్ని చేయాలనే రెస్పాన్స్ బులిటీ. నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు అవుతుంది. ఈ పదేళ్ళలో నా మోస్ట్ ఫేవరేట్ ఫిలిం పరదా, మోస్ట్ ఫేవరేట్ క్యారెక్టర్ సుబ్బు. ఈ సినిమా అందరూ ఇష్టపడి చేసిన సినిమా, అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. టీం అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్. నన్ను నమ్మి బిలీవ్ చేసిన విజయ్ గారికి ప్రవీణ్ గారి థాంక్ యూ. మీ అందరి సపోర్ట్ కి థాంక్ యూ’ అన్నారు.
హీరోయిన్ దర్శన మాట్లాడుతూ.. మీ అందరి ప్రేమకి థాంక్ యూ. ప్రవీణ్ చాలా హార్ట్ ఫుల్ గా ఈ సినిమా తీశారు. ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టం. చాలా టఫ్ ఛాలెంజ్ తీసుకున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ వున్నారు. అనుపమ, సంగీత గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. ఈ సినిమాలో మ్యాజిక్ కు మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు
యాక్టర్ సంగీత మాట్లాడుతూ.. ఆనంద మీడియా లాంచ్ చేసిన నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ప్రవీణ్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్. ఆయన డైరెక్షన్ సినిమాలో చేయడం ఆనందంగా వుంది. టీం అందరికీ థాంక్ యూ. అనుపమ, దర్శన నుంచి చాలా నేర్చుకున్నారు. చాలా కూల్ గా వుంటారు. ఇలాంటి గొప్ప కథని రాసిన డైరెక్టర్ కి థాంక్. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’అన్నారు.